రాయచోటి

రాయచోటి పట్టణం

రాయచోటి (ఆంగ్లం: Rayachoti ఉర్దూ: ریچارچی), వైఎస్ఆర్ జిల్లాలోని ఒక పట్టణము, అసెంబ్లీ నియోజకవర్గ కేంద్రము మరియు మండల కేంద్రము. రాయచోటి పాలన ‘రాయచోటి పురపాలక సంస్థ’ పరిధిలో జరుగుతుంది.

రాయచోటి పేరు వెనుక కథ:

రాచవీడు అనే పేరు క్రమంగా రాయచోటిగా మారింది

భౌగోళికం:

రాయచోటి పట్టణం భౌగోళికంగా 14°03’33.4″N, 78°45’05.0″E వద్ద ఉన్నది. ఇది సముద్రమట్టానికి 138 మీ (452 అడుగుల) ఎత్తులో, మాండవ్య నదీ తీరంలో కడప – చిత్తూరు రహదారిలో ఉంటుంది. రాయచోటి పట్టణం యొక్క వ్యాసార్ధం (radius) 2.9 కి.మీ, వైశాల్యం 27 చ.కి.మీ మరియు చుట్టుకొలత (circumference) 19 కిలోమీటర్లు.

హద్దులు:

రాయచోటి పట్టణ పరిధి

జనాభా:

2011 జనాభా లెక్కల ప్రకారం రాయచోటి జనాభా 91234 – ఇందులో పురుషులు 46517 మంది కాగా స్త్రీలు 44717 మంది. రాయచోటి పట్టణంలో అక్షరాస్యతా శాతం 73.58. పురుషులలో అక్షరాస్యతా శాతం 82.07గా ఉండగా స్త్రీలలో అది 64.84గా ఉంది.

రాయచోటి జనాభాలో హిందువులు 50.32 శాతంగా, మహమ్మదీయులు 49.09 శాతంగా, ఇతరులు 0.6 శాతంగా ఉన్నారు.

చదవండి :  కడప జిల్లాలో బౌద్ధ పర్యాటకం

ప్రత్యేకత:

వివిధ  మతాలు, కులాలకు చెందిన ప్రజల ఐక్యత. ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రహరీని ఆనుకుని కడప – చిత్తూరు రహదారి బారులు తీరి ఉండే బాడుగ వాహనాల శ్రేణి.

నగరంలోని ప్రాంతాలు:

కొత్తపేట, జగదాంబ సెంటర్, మాసాపేట, ఎస్ఎన్ కాలని, ఎన్జీవో కాలని, గాంధీ బజార్, భట్టు వీధి, రాజు కాలనీ, రామాపురం, సరస్వతి నగర్, కోటపల్లి, రాజు కాలని, దర్గా వీధి, గాలివీడు రోడ్డు, ఠానా సెంటర్, సుండుపల్లి రోడ్డు, పాత రాయచోటి, మదనపల్లి రోడ్డు

దర్శనీయ స్థలాలు:

రాయచోటి

ఆధ్యాత్మికం: వీరభద్రాలయం, పత్తర్ మసీదు, ఆంజనేయుని గుడి, కొత్తపేట రామాలయం, రామాపురం చౌడమ్మ గుడి, సాయిబాబా గుడి, మాసాపేట వెంకటేశ్వరాలయం,

ఇతరం:  బండ రాళ్ళు (బ్రిటన్ లోని స్టోన్ హెంజ్ ను పోలి ఉండే రాళ్ళు)

విద్యాసౌకర్యాలు:

ప్రాధమిక విద్య నుండి ఉన్నత విద్య అభ్యసించేందుకు అవసరమైన అన్ని విద్యాసంస్థలు రాయచోటి పట్టణంలో ఉన్నాయి. తెలుగు, ఆంగ్లం, ఉర్దూ మాధ్యమాలలో – రాష్ట్ర పాఠ్య ప్రణాళికలను భోదించే విద్యాసంస్థలు ఇక్కడ అందుబాటులో ఉన్నాయి. వృత్తి విద్యను అందించే పాలిటెక్నిక్, ఇంజనీరింగ్ కళాశాలలు మరియు అధ్యాపకులను తీర్చిదిద్దే DIET (District Institute for Educational Training) అందుబాటులో ఉంది.

చదవండి :  వైఎస్ హయాంలో కడపకు దక్కినవి

ప్రజారవాణా సౌకర్యాలు:

రాయచోటిలో ఒక ప్రాంతం నుండి మరో ప్రాంతానికి వెళ్లేందుకు సర్వీసు ఆటోలు అందుబాటులో ఉన్నాయి. ఈ ఆటోలలో ఒకచోటు నుండి మరోచోటికి వెళ్ళటానికి కనీస చార్జి పది రూపాయలు.

బయటి వారిని చేరవేసేందుకు బస్సు స్టాండు అందుబాటులో ఉంది.

దగ్గరి విమానాశ్రయం : కడప (59 కి.మీ), తిరుపతి (132 కి.మీ), బెంగుళూరు (187 కి.మీ), చెన్నయ్ (261 కి.మీ)

దగ్గరి రైల్వేస్టేషన్ :  కడప (55 KM)

వైద్య సౌకర్యాలు:

పట్టణంలో మెరుగైన సదుపాయాలతో ప్రభుత్వ ఆసుపత్రితో పాటు అనేక ప్రయివేటు జనరల్ ఆసుపత్రులు అందుబాటులో ఉన్నాయి.

మొబైల్, ఇంటర్నెట్ సేవలు:

రాయచోటి పట్టణ పరిధిలో అన్ని టెలికం కంపెనీలకు సంబంధించిన సేవలు అందుబాటులో ఉన్నాయి. నగర వ్యాప్తంగా 4జి సేవలు, 3జి సేవలు, బ్రాడ్ బ్యాండ్ సేవలు అందుబాటులో ఉన్నాయి. పట్టణంలో పలు చోట్ల ఇంటర్నెట్ సేవలు అందించే కేంద్రాలున్నాయి.

చదవండి :  రాయచోటి శాసనసభ స్థానంలో ఎవరికెన్ని ఓట్లు?

వినోద కేంద్రాలు:

వినోదాన్ని అందించేందుకు నగరంలో సుమారు 5 వరకు సినిమా హాళ్ళున్నాయి. వీటిలో తెలుగు, ఇంగ్లీషు, హిందీ సినిమాలు ప్రదర్శితమవుతుంటాయి.

మద్యపాన ప్రియుల కోసం శీతల గదులతో కూడిన బార్‌లు (మద్యపానశాలలు) కూడా అందుబాటులో ఉన్నాయి.

హోటళ్ళు/భోజనశాలలు:

రాయచోటిలో దక్షిణాది, ఉత్తరాది, తెలుగు శాఖాహార, మాంసాహార వంటకాలను వడ్డించే సాధారణ/శీతల గదులతో కూడిన హోటల్లు అందుబాటులో ఉన్నాయి. అలాగే పలుచోట్ల భోజన సదుపాయం అందించే మెస్ లు కూడా ఉన్నాయి.

రుచి చూడాల్సినవి : రోడ్డు పక్కన బండ్ల పైన దొరికే పానీపూరి, రవీస్ కేఫ్ లో దొరికే శాఖాహార భోజనం, రాజు హోటల్ మాంసాహార వంటకాలు, తాజ్మహల్ హోటల్ పరాటాలు, వీరబల్లి బేనీషా మామిడి పండ్లు.

వాతావరణం: ఉష్ణోగ్రత: 30°సె. – 44°సె (ఎండాకాలం), 21°సె. – 30°సె (చలికాలం), సగటు వర్షపాతము: 695 మి.మీ

సందర్శించేదానికి అనువైన సమయం: ఆగష్ట్  – ఫిబ్రవరి మధ్య కాలం

ఇదీ చదవండి!

chintakunta

చింతకుంట శ్రీ లక్ష్మీ చెన్నకేశవస్వామి దేవళం

కడప జిల్లా దువ్వూరు మండలం చింతకుంట లోని శ్రీ లక్ష్మీచెన్నకేశవస్వామి దేవస్థానం ఎంతో ప్రాచీనమైనది. చింతకుంట గ్రామ శివార్ల లోని …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

CAPTCHA * Time limit is exhausted. Please reload CAPTCHA.

error: