అది ఒక దగా! ఇది ఇంకొక దగా!!

‘నా వైఖరి మారలేదు’ అన్న ఆర్. విద్యాసాగర్ రావు గారి లేఖ (ఆంధ్య్రజ్యోతి ఆగస్టు 24) చదివాను. రాయలసీమ సాగునీటి సమస్యల గురించి నిష్ఠుర నిజాలు వెల్లడించినందుకు ఆయనను అభినందించాలో లేక తన తెలంగాణ మిత్రులకు సంజాయిషీ చెప్పుకుంటూ రాయలసీమ పట్ల తన సానుభూతిని ఉదాసీనతలోకి మార్చుకుంటున్నందుకు విచారపడాలో అర్థం కాని పరిస్థితి! ఆంధ్ర, తెలంగాణలు రాయలసీమ కోసం కృష్ణా జలాల్లో కొంత వాటాను వదలుకోవాలని చెబితే తెలంగాణ మేధావులలో వ్యతిరేకత ఎందుకు రావాలి! సాగునీటి వ్యవహారాలపై సమగ్ర అవగాహన ఉన్న మేధావి విద్యాసాగర్‌రావు.

ఇంజనీర్లకు నైపుణ్యాలతో పాటు మానవత్వ వైశాల్యమూ ఉండాల్సిన అవసరం ఉంది. తోటి ఇంజనీర్లూ, అభిమానుల నుంచీ వ్యతిరేకత వ్యక్తమైనప్పుడు రాయలసీమ నీటి సమస్య పట్ల ఆయన మానవీయ వైశాల్యం సంజాయిషీల బాట పట్టడమే విచారకరం. రాష్ట్రం సమైక్యంగా ఉన్నా, విడిపోయినా ప్రభుత్వం తీసుకున్న కేటాయింపు నిర్ణయాల్లో ఎలాంటి తేడా రాదన్న వాస్త వం ఇప్పటికే నీరావరి ప్రాంతాలయిన కోస్తా, తెలంగాణలను సంతోష పెట్టవచ్చేమోగానీ, రాయలసీమకు ఎంతో నష్టమూ, కష్టమూ కలిగించే మాట.

మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, గుజరాత్ రాష్ట్రాలు రాజస్థాన్ కోసం తమ వాటా కొంత తగ్గించుకున్నప్పుడు సోదర తెలుగు ప్రజల కోసం కోస్తా, తెలంగాణలు కొంచెం కూడా త్యాగం చెయ్యలేవా? సొంత లాభం కొంత మానుకోలేవా? విడిపోయి కలిసుందామనే మానవీయ వాక్కుకు తెలంగాణ మిత్రులు ఇచ్చే అర్థం ఇదేనా? మానవ న్యాయం విశాలమైనది. చట్టాలు ఇరుకైనవి. మానవ న్యాయ ంలో భాగంగానే చట్టాలు రూపొందించడం జరుగుతుంది. మానవ న్యాయానికి హాని జరుగుతున్న సందర్భంలో కూడా చట్టాలు అడ్డం పెట్టుకుని స్వప్రయోజనాలు కాపాడుకోవడం ధర్మం అనిపించుకోదు.

చదవండి :  'రాయలసీమ సంగతేంటి?'

చట్టాలకు అతీతం కాకుండా లోబడి పనిచెయ్యడం కోర్టులు, ట్రిబ్యునళ్ళ వ్యవస్థల ఉనికికి అవసరం కావచ్చు. దానినే అంతిమ న్యాయం అనలేము. చట్టాలకు అతీతమైనాసరే, మానవ న్యాయం కోసం పోరాడటం ప్రజల హక్కు. ఇప్పుడు రాయలసీమ నీటి సమస్య సరిగ్గా అటువంటి అనివార్య సందర్భంలోనే ఉంది. దుర్భిక్ష ప్రాంతమయిన రాయలసీమ నీటి అవసరాలు తీరిన తరువాతనే మిగతా ప్రాంతాల గురించి ఆలోచించాలనే శ్రీబాగ్ ఒడంబడికను (1937) ఏ సందర్భంలోనూ గౌరవించలేదు. అది ఒక దగా!

మన రాష్ట్రంలోనే ఎగువ ప్రాంతాలయిన రాయలసీమ తెలంగాణలను పూర్తిగా విస్మరించి దిగువన ప్రాజెక్టులు కట్టిన చారిత్రక నేరం కోస్తా మేధావి డాక్టర్ కె.ఎల్. రావు (ఇందిరాగాంధీ హయాంలో కేంద్ర జల వనరుల శాఖ మంత్రిగా పనిచేశారు)ది. అది ఇంకొక దగా. తమిళనాడుకి నీళ్లివ్వడమూ అనే సాకుతో రాయలసీమ నీళ్ళ ప్రయోజనాలకు వ్యతిరేకంగా రాయలసీమ రాజకీయ నాయకులతోనే ఆందోళన చేయించి కృష్ణ-పెన్నార్ ప్రాజెక్టును చీకట్లోకి తోసేశారు కోస్తా మేధావులు. అది ఇంకొక దగా. అనంతపురం జిల్లాకు ఏకైక ఆధారంగా ఉన్నటువంటి తుంగభద్ర నీటిని (65శాతం) కరెంటు కోసం త్యాగం చేస్తే; ఆ త్యాగ ఫలితం కరెంటు వల్ల అనంతపురానికి ఒక్క పరిశ్రమ కూడా రాలేదు.

చదవండి :  'శివరామక్రిష్ణన్'కు నాయకుల నివేదనలు

అది ఇంకొక దగా. నాగార్జున సాగర్ అతి పెద్ద ప్రాజెక్టుగా పరిగణనలోకి తీసుకోవడం వల్ల ఆంధ్రకు ఎక్కువ నీటి కేటాయింపులు జరిగాయి. దీని వల్ల రాయలసీమ ప్రాంతంలో సిద్ధేశ్వరం ప్రాజెక్టు (మెకంజీ రూపొందించినది) గాలికి ఎగిరిపోయింది. కర్ణాటకతో పాటు రాయలసీమ, తెలంగాణలు కూడా నష్టపోవలసి వచ్చింది. ఆ రకంగా ఇది ఇంకొక దగా. శ్రీశైలం ప్రాజెక్టును బహుళార్థ సాధక ప్రాజెక్టుగా పథకాన్ని రూపొందించి పంపితే, కృష్ణా డెల్టాకు నష్టం కలుగుతుందనే సాకుతో దాన్ని జల విద్యుత్తు కోసమూ, నాగార్జునసాగర్‌ను సాగు నీటి కోసమూ పరిమితం చేసారు. శ్రీశైలంలో నీళ్ళున్నా, రాయలసీమ శిశువుకు దక్కని స్తన్యం మాదిరి మిగిలిపోయి ంది. ఇన్ని దగాల మధ్య రాయలసీమ రైతుల ఆం దోళన హైదరాబాద్ కోసమో, చార్మినార్ కోసమో కాదు. నీళ్ళ కోస మే!! విద్యాసాగర్ రావు వంటి ఇంజనీరు సానుభూతి నేడు రాయలసీమ రైతుకు ఎంతో అవసరం.

చదవండి :  కడప జిల్లాలో నేరాలు - ఒక పరిశీలన

వర్షపాతం, భూగర్భ జలాల లభ్యత ఆధారంగా కృష్ణా నది నీటిని పునఃపంపిణీ చేయాల్సిన అవసరముంది- 25-4-2000లో 1/97, 2/97 కేసులలో సుప్రీంకోర్టు తీర్పులు, బచావత్ ఆధారంగా! సర్కారు ప్రాంతం వారు రెండు మూడు పంటలకు కాకుండా ఒక పంటకు మాత్రమే నికర జలాలను పరిమితం చేసుకుని, రెండవ పంటకు భూగర్భజలాలు ఉపయోగించుకోవాలి. అందువల్ల నదీ ప్రవాహపు నీరు, భూగర్భ జలాలు రెండూ లేని అనంతపురం జిల్లాకు 100 టీఎంసీల నికర జలాలు కేటాయించే అవకాశం ఉంటుంది.

రాష్ట్ర విభజన జరుగుతున్న ఈ చారిత్రక ఘడియల్లో అన్ని ప్రాంతాల సాగునీటి నిపుణులకూ, రాజకీయవేత్తలకూ, సామాజిక తత్వజ్ఞులకూ, రచయితలూ కళాకారులకూ ఇవే మా విన్నపాలు. కేవలం తమ ప్రాంతీయ ప్రయోజనాలను ఆపేక్షించే ఇంజనీర్లుగా మాత్రమే మిగిలిపోయి, రాయలసీమలో కె.ఎల్. రావు మాదిరి చరిత్రహీనులు కావద్దు. మీ సాంకేతిక నైపుణ్యాలకు మానవీయ వైశాల్యాన్ని జోడించే ఆవకాశం వచ్చిందనీ విద్యాసాగర్ రావు వంటి పెద్దలకు విజ్ఞప్తి చేస్తున్నాను.

– బండి నారాయణస్వామి
అనంతపురం సాగునీటి పోరాట సమితి, రైతు రచయితల సంఘం

(ఆంధ్య్రజ్యోతి september 13)

ఇదీ చదవండి!

రాయలసీమలో హైకోర్టు

హైకోర్టు రాయలసీమలో ఎక్కడ? – మొదటి భాగం

రాష్ట్ర విభజనానంతరం 1953నాటి ప్రాంతాలే ఆంధ్ర ప్రదేశ్ లో మిగలడం వల్ల, స్థూలంగా రాయలసీమలో అప్పటి వెనుకబాటుతనం, సీమవాసుల్లో కోస్తాంధ్ర …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

CAPTCHA * Time limit is exhausted. Please reload CAPTCHA.

error: