నాలితనా లేఁటికోయి

ఆడరమ్మ పాడరమ్మ అంగనలు చూడరమ్మ

తన సంకీర్తనా మాధుర్యంతో అలమేలుమంగ పతిని కీర్తించి తరించిన పదకవితా పితామహుడు శ్రీమాన్ తాళ్ళపాక అన్నమాచార్యుల వారు. కడప జిల్లాకు చెందిన ఈ వాగ్గేయకారుడు పాలకొండల ప్రకృతి సోయగాల నడుమ నెలవై, భక్తుల కొంగు బంగారమై భాసిల్లుతున్న వేయి నూతుల కోన (వెయ్యినూతుల కోన) నృసింహున్ని చూడరమ్మని ఇలా కీర్తిస్తున్నాడు..

ఆడరమ్మ పాడరమ్మ అంగనలు చూడరమ్మ
వేడుకఁ బరుషలెల్ల వీధినుండరమ్మా. ||పల్లవి||

అల్లదివో వోగునూతులౌభళేశు పెద్దకోన
వెల్లిపాల నీటి జాలు వెడలే సోన
చల్లనిమాఁ కులనీడ సంగడిమేడలవాడ
యెల్లెగాగ నరసింహుఁ డేగీ నింతితోడను ||ఆడ||

చదవండి :  చీరలియ్యగదవోయి చెన్నకేశవా - అన్నమయ్య సంకీర్తన

సింగారపు మండపాల సింహాలమునిమంద
లంగరు తెల్లగోపురమదె మిన్నంద
చెంగట నాళువార్లు చేరి పన్నిద్దరు గొల్వ
సంగతిఁ దాఁగొలువిచ్చీ జయనరసింహము ||ఆడ||

కందువ శ్రీ వెంకటేశుకల్యాణములవేది
అందమై భూమికెల్ల నాదికి అనాది
మందల పాలకొండమలకు నట్టనడుమ
విందగు దాసులతోడ విహరించీ దేవుడు ||ఆడ||

ఇదీ చదవండి!

సింగారరాయుడ

కరుణించవయ్య యిఁక కడు జాణవౌదువు – అన్నమయ్య సంకీర్తన

ప్రొద్దుటూరు చెన్నకేశవుని స్తుతించిన అన్నమాచార్య సంకీర్తన ప్రొద్దుటూరు లేదా పొద్దుటూరు, వైఎస్ఆర్ జిల్లాలోని ఒక ప్రముఖ పట్టణము. రెండవ బొంబాయిగా …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

CAPTCHA * Time limit is exhausted. Please reload CAPTCHA.

error: