ఆయన మొండిగా వ్యవహరిస్తున్నారు…

స్థానిక సంస్థల శాసనమండలి ఎన్నికల్లో రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి పోటీ చేస్తే ఏకగ్రీవంగా గెలిపించుకుంటామని కాంగ్రెస్ ఎమ్మెల్యేలు దేవగుడి ఆదినారాయణరెడ్డి, గడికోట శ్రీకాంత్‌రెడ్డి, ఆకేపాటి అమర్‌నాథ్‌రెడ్డి, కమలమ్మ అన్నారు. కడప నగరంలోని వైఎస్ గెస్ట్‌హౌస్‌లో శనివారం వారు విలేకరులతో మాట్లాడారు. ఎమ్మెల్సీగా పోటీ చేయాలని మధ్యవర్తి ద్వారా తాము ప్రతిపాదించినప్పటికీ వివేకానందరెడ్డి సుముఖత చూపలేదన్నారు.

ఆయన మొండిగా వ్యవహరించడం అందరికీ బాధాకరంగా ఉందన్నారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి వల్లే తామంతా పదవులు అనుభవిస్తున్నామని, ఆయన ఆశయాలను జగన్ నాయకత్వంలో నెరవేర్చేందుకు దేవగుడి నారాయణరెడ్డిని స్థానిక సంస్థల ఎన్నికల బరిలో దించాలని నిర్ణయించామని చెప్పారు.

మాజీ ఎమ్మెల్యే డీసీ గోవిందరెడ్డి మాట్లాడుతూ ఉప ఎన్నికల్లో తల్లి లాంటి వదినపై వైఎస్ వివేకానందరెడ్డి పోటీ చేయాలని భావించడం బాధాకరమన్నారు. దివంగత నేత వైఎస్ కృషి వల్లే వివేకా నేడు ఈ స్థాయికి ఎదిగారన్నారు. కుటుంబాన్ని చీల్చకూడదని యువనేత వైఎస్ జగన్మోహన్‌రెడ్డి ఎంతో కృషి చేశారన్నారు. వైఎస్ వివేకానందరెడ్డి ఒప్పుకుంటే పోటీ నుంచి విరమించుకునేందుకు తాము సుముఖంగా ఉన్నట్లు తెలిపారు. దీనిపై ఆయన పునరాలోచన చేసుకోవాలని కోరారు.

చదవండి :  జిల్లా అభివృద్ధికి పోరుబాటే శరణ్యం: అఖిలపక్షం

వివేకా పోటీ చేయని పక్షంలో వర్గాన్ని కాపాడుకోవడానికి తమ అభ్యర్థిని పోటీకి నిలుపాల్సిన నైతిక బాధ్యత తమపై ఉందన్నారు. వైఎస్ కుటుంబం, జిల్లా ప్రయోజనాల దృష్ట్యా తామంతా కలిసికట్టుగా ఈ నిర్ణయం తీసుకున్నామన్నారు.జెడ్పీ చైర్‌పర్సన్ దేవిరెడ్డి జ్యోతిరెడ్డి మాట్లాడుతూ జిల్లాలో ప్రస్తుత పరిణామాలు చాలా బాధాకరంగా ఉన్నాయన్నారు. మిగతా జిల్లాలకు ఆదర్శంగా ఉండాల్సిన ఈ జిల్లాలోనే ఇలాంటి పరిస్థితి తలెత్తడం దురదృష్టకరమన్నారు. తమకు కాంగ్రెస్ అధిష్టానమంటే ఎవరో తెలియదని, వైఎస్‌నే అధిష్టానంగా భావించామని చెప్పారు.

చదవండి :  మా జిల్లా పేరును పలికేదానికీ సిద్ధపడరా?

మాజీ మేయర్ పి.రవీంద్రనాథ్‌రెడ్డి మాట్లాడుతూ శుక్రవారం ప్రముఖ నిర్మాత సీసీ రెడ్డి ద్వారా వివేకానందరెడ్డితో మాట్లాడే ప్రయత్నం చేసినట్లు తెలిపారు. తల్లిలాంటి వదినపై పోటీ చేయడం మంచిది కాదని, ఎమ్మెల్సీ అభ్యర్థిగా నిలబడాలని అర్థించగా వివేకా తోసిపుచ్చారని చెప్పారు. ఇప్పటికైనా వివేకానందరెడ్డి ఎమ్మెల్సీగా పోటీ చేస్తే కలిసికట్టుగా కృషి చేసి ఏకగ్రీవంగా గెలిపించుకుంటామన్నారు.

మాజీ ఎమ్మెల్యే రఘురామిరెడ్డి మాట్లాడుతూ తాను టీడీపీ జిల్లా అధ్యక్షునిగా ఉన్నప్పుడు వైఎస్ వివేకా ఎమ్మెల్సీగా పోటీ చేస్తూ టీడీపీ అభ్యర్థి లేకపోతే తాను ఏకగ్రీవంగా గెలుస్తానని తనతో అన్నారని, ఆ మేరకు తాను చంద్రబాబును ఒప్పించి జిల్లాలో టీడీపీ పోటీ చేయకుండా చూశానని చెప్పారు. నేడు అదే విధంగా ఆయన ఎమ్మెల్సీగా నిలబడితే ఏకగ్రీవంగా గెలిపించుకుంటామన్నారు. వదినపై పోటీ చేస్తానని ఆయన నిర్ణయం తీసుకోవడం సరికాదన్నారు. ఢిల్లీ నాయకులు వైఎస్ కుటుంబాన్ని చీల్చాలనే దుష్ట ఆలోచనతో ఇలాంటి ప్రయత్నాలు చేస్తున్నారన్నారు. వివేకా దీర్ఘంగా ఆలోచించి కుటుంబం చీలకుండా నిర్ణయం తీసుకోవాలని కోరారు.

చదవండి :  'జీవో 69ని రద్దుచేయాల'

సమావేశంలో డీసీసీ బ్యాంకు మాజీ చైర్మన్ దేవగుడి నారాయణరెడ్డి, డీసీసీ మాజీ అధ్యక్షుడు కె.సురేష్‌బాబు, జెడ్పీ వైస్ చైర్మన్ దేవనాథరెడ్డి, డీసీసీబీ చైర్మన్ బ్రహ్మానందరెడ్డి, బద్వేలు మున్సిపల్ చైర్మన్ మునెయ్య, ఎమ్మెల్సీ అభ్యర్థి సజ్జల శ్రీధర్‌రెడ్డి తండ్రి లక్ష్మిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

ఇదీ చదవండి!

వైకాపా-లోక్‌సభ

93 మందితో వైకాపా జిల్లా కార్యవర్గం

కడప: 93 మంది సభ్యులతో కూడిన వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ నూతన కార్యవర్గాన్ని ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు ఆకేపాటి …

Leave a Reply

Your email address will not be published.

CAPTCHA * Time limit is exhausted. Please reload CAPTCHA.

error: