ఎమ్మెల్యే శ్రీకాంత్‌రెడ్డి హెచ్చరిక

రాయచోటి : రాయచోటి ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్‌రెడ్డి కూడా తాజాగా అధికారులను హెచ్చరించిన వారి జాబితాలో చేరారు. ‘రాయచోటి పట్టణం గుండా వెళుతున్న జాతీయ రహదారి విస్తరణ పనులను వెంటనే మొదలుపెట్టి పూర్తిచేయాలి..లేకుంటే జూన్ 6వ తేదీన జాతీయ రహదారిపై ప్రజలతో కలసి ఆమరణ నిరాహార దీక్ష చేస్తా’నని ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్‌రెడ్డి మున్సిపల్ కమిషనర్‌తో పాటు అధికారులను హెచ్చరించారు.

మంగళవారం స్థానిక మున్సిపల్ కార్యాలయంలో ఆయన మాజీ కౌన్సిలర్లు, పుర ప్రముఖులతో కలసి మున్సిపల్ అధికారులతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా గడికోట మాట్లాడారు. ‘ జాతీయ రహదారి కిరువైపులా ఉన్న 95 శాతం భవన యజమానులకు నష్టపరిహారాన్ని అందజేశాం. మా సాపేటలోనివారికి మాత్రమే పరిహారం అందజేయాల్సి ఉంది.

చదవండి :  పోటెత్తిన పోరు గిత్తలు

మున్సిపల్ అధికారులు వెంటనే పరిహారం చెల్లించి భవన నిర్మాణాల తొలగింపు కార్యక్రమాన్ని చేపట్టాలని’ సూచించారు. ఆక్రమణలను తొలగించనందున ట్రాఫిక్ ఇబ్బందులు తలెత్తుతున్నాయన్నారు. మాసాపేటకు వెళ్లే డ్రైనేజి కాలువల నిర్మాణంతో పాటు తాగునీటి పైపులైన్ నిర్మాణం పనులు కూడా పెండింగ్‌లో ఉన్నాయని… వీటన్నింటిపై దృష్టి సారిం చాలని మున్సిపల్ అధికారులను ఆదేశించారు. వెలిగల్లు, రోళ్ళమడుగు నీటి పథకం పనులు పూర్తయ్యాయని.. ఆ నీటి ని పట్టణంలోని అన్ని వార్డులకు అందచేసేందుకు అవసరమైన పైపులైన్‌ల ఏర్పాటుపై శ్రద్ధచూపాలన్నారు. 13వ ఆర్థిక సంఘం నిధులు రూ. 34 లక్షలను పైపులైన్‌ల నిర్మాణం కోసం వినియోగించాలన్నారు.

చదవండి :  బంద్ సంపూర్ణం

కూరగాయల మార్కెట్ కాంప్లెక్స్ నిర్మాణ పనులను వేగవంతం చేయాలన్నారు. పోస్టాఫీసు భవనాల నిర్మాణానికి ప్రభుత్వం కోటి రూపాయలు మంజూరు చేసిందని.. త్వరలో పనులు మొదలుపెట్టేలా చూస్తామన్నారు. ‘పారిశుద్ధ్యపనుల తీరు మెరుగుపడాలంటే శానిటరీ ఇన్‌స్పెక్టర్ పోస్టుతో పాటు రెగ్యులర్ కార్మి కుల నియామకానికి కృషిచేయాలని’ పురప్రముఖులు ఎమ్మెల్యేకు విన్నవించారు. ఇందుకు ఎమ్మెల్యే స్పం దిస్తూ ఈనెల 20నుండి పట్టణంలో పారిశుద్ధ్యంపై స్పెషల్‌డ్రైవ్ నిర్వహించాలని అధికారులను ఆదేశించారు. సమావేశంలో మున్సిపల్ కమిషనర్ వెంకట్రావు, టౌన్ బిల్డింగ్ ఆఫీసర్ ఆసిఫ్, మెప్మా అధికారి అబ్బాస్‌అలీ పాల్గొన్నారు.

చదవండి :  శశిశ్రీ ఇక లేరు

ఇదీ చదవండి!

రాయచోటి వీరభద్రాలయం

రాయలకాలంలో రాయచోటి పక్కన ఉన్న మాండవ్య నది ఒడ్డున భద్రకాళి సమేత వీరభద్రుస్వామి దేవాలయం వెలసింది. వీరభద్రస్వామికి రాచరాయుడు అనే …

Leave a Reply

Your email address will not be published.

CAPTCHA * Time limit is exhausted. Please reload CAPTCHA.

error: