రేపటి నుంచి ఉత్సవాల అంకురార్పణ
కడప: ఒంటిమిట్ట కోదండరాముని బ్రహ్మోత్సవాలను ఈ నెల 27వ నుంచి ఏప్రిల్ 6 వరకు నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ వెంకటరమణ తెలిపారు.
భక్తులు దర్శనానికి వెళ్లే సమయంలో సెల్‌ఫోన్లు, కెమేరాలు వెంట తీసుకెళ్లరాదని, పాదరక్షలు వేసుకుని వెళ్లరాదని సూచించారు. దర్శనం టికెట్ దేవస్థానంలో కొనుగోలు చేయాల్సి ఉంటుందన్నారు.
27వ తేదీ ఉదయం 4 గంటల నుంచి ప్రజలు స్వామిని దర్శించుకునే వీలు కల్పించామన్నారు. ఉదయం 9 గంటల నుంచి 11 గంటల వరకు, రాత్రి 6 నుంచి 10 గంటల వరకు వాహన సేవ, అదే సమయాల్లో కూచిపూడి, రామదాసు కీర్తనలు, జాంభవతి పరిణయం, బాలనాగమ్మ, కోలాటం, రామదండు, చెక్కభజన, కత్తిసాము, కేరళ కళాకారులచే వాయిద్యం లాంటి కార్యక్రమాలుంటాయని వివరించారు.
ఏప్రిల్ 2న జరిగే కల్యాణానికి గవర్నర్, ముఖ్యమంత్రి హాజరవుతారని కలెక్టర్ తెలిపారు.
బ్రహ్మోత్సవాలలో ఉత్సవాలను తెలిపే పట్టిక:
[table id=4 /]