కడపజిల్లా పోలింగ్ విశేషాలు

Review Overview

మైదుకూరు - 84%
ప్రొద్దుటూరు - 77.94%
కడప - 59%
కమలాపురం - 82.21%
రాయచోటి - 75.73%
రాజంపేట - 78.11%
జమ్మలమడుగు - 85.66%
పులివెందుల - 79.84%
రైల్వే కోడూరు - 77.34%
కడప పార్లమెంటు - 76.4%
రాజంపేట పార్లమెంటు - 74%
బద్వేలు - 72.73%

77%

మొత్తం పోలింగ్

కడప జిల్లా వ్యాప్తంగా ఈ రోజు సాయంత్రం 6గంటల వరకు నమోదైన పోలింగ్

User Rating: Be the first one !

– పులివెందులలో ఎస్వీ సతీష్ రెడ్డి వాహనం ధ్వంసం చేసిన వైకాపా కార్యకర్తలు

– చింతకొమ్మదిన్నె మండలం చిన్నమాచుపల్లెలో కందుల శివానందరెడ్డి వాహనం ధ్వంసం చేసిన తెదేపా కార్యకర్తలు.

చదవండి :  తెదేపా నేతపై కేసు నమోదు

– చెన్నూరు మండల కేంద్రంలో సాయంత్రం నాలుగు గంటల సమయంలో మొరాయించిన ఈవీఎంలు.

– ఖాజీపేట మండలం నాగాసానిపల్లెలో తెదేపా రిగ్గింగ్ యత్నం. వైకాపా ఏజంట్లను బయటకు లాగిన తెదేపా అభ్యర్తి.

– రైల్వే కోడూరు మండలంరెడ్డివారిపల్లిలో తెదేపా, వైకపా కార్యకర్తల మధ్య ఘర్షణ

– చెదురుమదురు ఘటనలు మినహా జిల్లా వ్యాప్తంగా పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతోంది.

– పులివెందుల నియోజకవర్గంలోని తొండూరు మండలంలోని గోటూరు పోలింగ్ బూత్లో ఇరు పార్టీల ఏజంట్ల మధ్య ఘర్షణ. పోలీసుల లాఠీచార్జి.

చదవండి :  కడప గడపలో సీమ ఆకలి 'కేక' అదిరింది

–  పులివెందుల నియోజకవర్గంలోని తొండూరు మండలం చేర్లోపల్లిలో వైకాపా తెదేపా కార్యకర్తల మధ్య స్వల్ప ఘర్షణ. పోలీసుల లాఠీచార్జి.

 – దేవగుడిలో నాలుగు రౌండ్లు కాల్పులు జరిపిన పోలీసులు …

– జమ్మలమడుగు నియోజకవర్గంలోని దేవగుడిలో వైకాపా అభ్యర్థి ఆదినారాయణ కుమారుడి పై చేయి చేసుకున్న జమ్మలమడుగు ఎఎస్పీ అప్పలనాయుడు. పోలీసులపై దాడికి దిగిన దేవగుడి గ్రామస్తులు. మూడు పోలీసు కార్ల ధ్వంసం.

– ప్రొద్దుటూరులో వైకాపా కార్యకర్త ముక్తియార్ కు చెందిన కారును ధ్వసం చేసిన తెదేపా కార్యకర్తలు

చదవండి :  జమ్మలమడుగు శాసనసభ స్థానానికి నామినేషన్లు వేసిన అభ్యర్థులు

– మైదుకూరు నియోజకవర్గంలోని నక్కలదిన్నె (వైకాపా అభ్యర్థి రఘురామిరెడ్డి స్వగ్రామం)లో తెదేపా అభ్యర్థి పుట్టా సుధాకర్ ను అడ్డుకున్న వైకాపా కార్యకర్తలు. ఇరు వర్గాల మధ్య ఘర్షణ. ఘర్షణలో సుధాకర్ కారు అదాలు ధ్వంసం.

– ఎర్రబల్లెలో వైకాపా అభ్యర్థి రఘురామిరెడ్డి కారును ధ్వంసం చేసిన పుట్టా అనుచరులు.

– మైదుకూరు నియోజకవర్గంలోని ఎన్ ఎర్రబల్లెలో వైకాపా ఏజంట్లను బయటకు పంపిన తెదేపా ఏజంట్లు. పోలింగ్ కేంద్రానికి చేరుకుని పరిస్థితిని అదుపులోకి తెచ్చిన మైదుకూరు డిఎస్పీ

ఇదీ చదవండి!

అష్టదిగ్గజాలు

మట్లి (సిద్ధవటం) రాజుల అష్టదిగ్గజాలు

సిద్ధవటం రాజుల అష్టదిగ్గజాలు నా నీతిని వినని వానిని – వానను తడవని వానిని కననురా కుందవరపు కవి చౌడప్పా- …

error: