ఆభరణాలను చూపిస్తున్న కాజల్ అగర్వాల్
ఆభరణాలను చూపిస్తున్న కాజల్ అగర్వాల్

కడపలో కథానాయిక కాజల్‌ అగర్వాల్

మలబార్‌ గోల్డ్‌, డైమండ్‌ షోరూం ప్రారంభం

ప్రముఖ కథానాయిక కాజల్‌ అగర్వాల్‌ ఆదివారం కడపకొచ్చారు. స్థానిక కోటిరెడ్డిసర్కిల్‌ వద్ద ఏర్పాటు చేసిన మలబార్‌ గోల్డ్‌, డైమండ్‌ షోరూంను సాయంత్రం ఆరు గంటలకు ప్రారంభించారు.  షోరూం ప్రారంభ కార్యక్రమానికి హాజరైన కాజల్‌ను చూసేందుకు  అభిమానులు తరలివచ్చారు.

షోరూంను ప్రారంభించి అక్కడ ఏర్పాటు చేసిన పలు డిజైన్ల ఆభరణాలను కస్టమర్లకు చూపించారు. దాదాపు అరగంట షోరూంలోనే సందడి చేశారు.

అనంతరం మీడియాతో మాట్లాడిన కాజల్ అగర్వాల్ మలబార్‌ గోల్డ్‌, డైమండ్‌ భారతీయ సంప్రదాయం ఉట్టిపడేలా పలు రకాల డిజైన్‌ ఆభరణాలను ప్రజలకు అందు బాటులోకి తెచ్చిందన్నారు. కళాత్మక నైపుణ్యంతో రాచరిక వైభవానికి, పురాతన భారతీయ సంస్కృతి, జీవనశైలి ప్రతిబింబించేలా డిజైన్లను అందుబాటులో ఉంచారన్నారు. ప్రపంచ వ్యాప్తంగా ఎనిమిది దేశాల్లో 122 మలబార్‌ గోల్డ్‌, డైమండ్‌ షోరూంలు ఏర్పా టు చేసి కోట్లాది ప్రజల నమ్మకానికి నిదర్శనంగా నిలుస్తోందన్నారు. అందులో కడప నగరంలో ఏర్పాటు ఇక్కడి ప్రజలకు ఎంతో ఉపయుక్తమన్నారు.

చదవండి :  సివిల్స్ లో మళ్ళీ మనోల్ల మెరుపులు

మలబార్‌ గోల్డ్‌, డైమం డ్స్‌ నిజాయితీ, పారదర్శక వ్యవహారాలను విశ్వసిస్తుందన్నారు. ప్రతి ఆభరణానికి ఖచ్చితమైన ధర ట్యాగ్‌తో పాటు, తరుగు, బంగా రం బరువు, రాళ్ళబరువు, రాళ్లచార్జి మొదలైనవి వివరించబడి ఉంటాయన్నారు. 22 క్యారెట్ల బంగారంలో నగిషీ చెక్కిన ఆభరణా లు కళానైపుణ్యంతో తొణికిసలాడుతున్నాయన్నారు.

బంగారు ఆభరణాల కొనుగోలుపై ఏడాది పాటు ఉచిత బీమా సౌకర్యం కూడా కల్పిస్తున్నారని తెలిపారు. ప్రారంభ కార్యక్రమంలో మలబార్‌ షోరూంకు సంబంధించిన స్టోర్‌ హెడ్‌ తన్వీర్‌, అసోసియేట్‌ డైరెక్టర్‌ శ్యాంసుందర్‌, జోనల్‌ డైరెక్టర్‌ సరాజ్‌, మార్కెటింగ్‌ మేనేజర్‌ దీపక్‌, రీజనల్‌ మార్కెటింగ్‌ మేనేజర్‌ షోపి తదితరులు పాల్గొన్నారు.

చదవండి :  గండికోటలో తిరిగుతోంది చిరుతపులులే!

ఇదీ చదవండి!

మేడిదిన్నె హనుమంతాలయం

అన్నమయ్య దర్శించిన మేడిదిన్నె హనుమంతాలయం

అన్నమయ్య, కడప జిల్లాలో చాలా దేవాలయాలని దర్శించి, అక్కడి దేవుళ్ళ మీద కీర్తనలు రచించారు. వీటిలో కొన్ని ప్రదేశాలని కొంతమంది …

Leave a Reply

Your email address will not be published.

CAPTCHA * Time limit is exhausted. Please reload CAPTCHA.

error: