కడప: ఈరోజు ఉదయం 11 గంటల 15 నిముషాలకు ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు కడప విమానశ్రయ టెర్మినల్‌ను ప్రారంభించనున్నారు. కేంద్ర పౌర విమానాయానశాఖ మంత్రి అశోక్ గజపతిరాజు, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి వెంకయ్యనాయుడు, వాణిజ్య శాఖ మంత్రి నిర్మలా సీతారామన్, సైన్స్ అండ్ టెక్నాలజీ మంత్రి సుజనా చౌదరి తదితరులు ఈ కార్యక్రమానికి హాజరవుతున్నారు.
ముఖ్యమంత్రి ఎయిర్‌పోర్టు ప్రాంగణంలో ఏర్పాటు చేసిన సభలో ప్రజలనుద్దేశించి మాట్లాడతారు. ప్రారంభోత్సవానికి సంబంధించి జిల్లా యంత్రాంగం, విమానాశ్రయ అధికారులు ఇప్పటికే అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. విమానాశ్రయాన్ని విద్యుత్ దీపాలతో అలంకరించారు.

ముఖ్యమంత్రి, కేంద్ర మంత్రుల పర్యటన నేపథ్యంలో పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేశారు. ఎయిర్ పెగాసెస్ సంస్థకు చెందిన విమానం బెంగుళూరు నుంచి బయలుదేరి 11.30 గంటలకు కడపలో ల్యాండ్ కానుంది. 11.50 గంటలకు ఇక్కడ టేకాఫ్ తీసుకుని 12.35 గంటలకు బెంగళూరు చేరనుంది.