కడప వెబ్ సిరీస్

ఆం.ప్ర ప్రభుత్వం వర్మ పైన కేసు పెడుతుందా?

కడపవెబ్సిరీస్

ఫ్యాక్షనమ్మ రాయలసీమ అయితే ఆ అమ్మ గర్భగుడి కడప’ – వెబ్ సిరీస్ టీజర్లో వోడ్కా మరియు తొడల వర్మగా ఖ్యాతి గడించిన వీర ఫ్లాపు సినిమాల దర్శకుడి వ్యాఖ్యానం. ఇలాంటి విపరీత వ్యాఖ్యానాలకు తెగబడిన రామూది కోస్తా ప్రాంతం కావడం కాకతాళీయం కాదు.

వివాదాల్లో చిల్లర వెదుక్కునే రామూ అలియాస్ రాంగోపాల్ వర్మ అనబడే ఫ్లాపు చిత్రాల దర్శకుడూ, సోషల్ మీడియా మేధావి గారూ తన కంపెనీ పేరుతో ఒకానొక పనికిమాలిన వెబ్ సిరీస్తో ‘You Tube’ ద్వారా చిల్లర సంపాయించే పని మొదలు పెట్టినాడు. ఆ పనికి మాలిన పనికి ప్రచార యావతో ‘కడప’ పేరు పెట్టి, అర్థం పర్థం లేని వ్యాఖ్యానాలు జోడించి ఒక  టీజర్ను ఆ యూట్యూబ్ వేదికగా జనాల మీదికి వదిలినాడు.

రాక్షసంగా మనుషులను చంపి ఆనందించే సన్నివేశాలనూ, ఆడవారిని చెరబట్టే సన్నివేశాలనూ ఏర్చి కూర్చి, మధ్యలో కొందరి పేర్లతో కొన్ని క్యాప్షన్లు జత చేసి దానికి సొంత గొంతుకతో విపరీత వ్యాఖ్యానం చెప్పి కడప పేర విషబీజాలు నాటే ప్రయత్నం చేశాడు నిషాలో తేలియాడే వోడ్కా వర్మ గారు.

ఎప్పుడో ఎక్కడో జరిగిన నేరాలకు పుక్కిటి పురాణాల తాలూకు మషాలానూ, బూతునూ జోడించి వీక్షకులను ఆకట్టుకునేందుకు వర్మ చేసిన ప్రయత్నంగానే  వర్మ విడుదల చేసిన  కడప వెబ్ సిరీస్ టీజర్ను చూడాల్సి ఉంటుంది. ఆ ప్రయత్నాన్ని తప్పు పట్టాల్సిన పని కూడా లేదు.  కానీ వివాదమంతా ఆ చిల్లర కోసం వర్మ ఎంచుకున్న పేరుతోనూ, దానికి జోడించిన విపరీత వ్యాఖ్యానాలతోనూ. ‘కడప’ అనే టైటిల్ లోని అక్షరాలకు గొడ్డలిని, కొడవలిని, సుత్తిని తలకాయలుగా  ఎంచుకోవడంలో వర్మ గారు అపారమైన వెకిలి మేధోశక్తిని, సృజనాత్మకతను ప్రదర్శించారు. అందుకు వారికి జోహార్లు.

చదవండి :  అభివృద్ధికి అంటరానివాళ్ళమా? -2
kadapa web series
విపరీత వ్యాఖ్యకు ఉదాహరణ

వెబ్ సిరీస్ కోసం ‘కడప’ పేరును ఎంచుకునే ముందు వర్మ లాంటి ‘నిషా’ మేధావి గారు కడప జిల్లా చరిత్రనూ, సంస్కృతినీ ఇక్కడి సామాజిక స్థితిగతులనూ కనీసం అధ్యయనం చేసి ఉండాల్సింది. కనీసం కడప జిల్లాకు సంబంధించిన నేరగణాంకాలను (కడప జిల్లా నేర గణాంకాలు ఇక్కడ చూడవచ్చు: https://www.kadapa.info/category/సమాచారం/నేరగణాంకాలు/) పరిశీలించి ఉండాల్సింది.

కడప వెబ్ సిరీస్

కడప జిల్లాకు చెందిన కొంతమంది (వీరెవ్వరూ ఇప్పుడు బతికి లేరు) పేర క్యాప్షన్లు తగిలించి వీళ్ళు చెప్పిందే కడప జిల్లా, తను చూపే కామోద్రేక, వికృత విధ్వంసకర సన్నివేశాలే వాస్తవిక కడప జిల్లా చరిత్ర అన్నట్లు వీర డైలాగులు చెప్పటం కాలం చెల్లిన ఈ పిచ్చి దర్శకుడూ,  మేతావి గారికే చెల్లింది. పైగా ఇవన్నీ పచ్చి నిజాలు, యదార్థ సంఘటనలూ అంటూ  డబ్బా రాతలు.

వ్యక్తుల తాలూకు చీకటి కోణాలనో, వారి జీవితాలలోని నేరపూరిత కుట్రలనో బయట పెట్టాలనుకున్నప్పుడు సదరు వ్యక్తుల లేదా ఘటనల పేర్లనే తన వీర డబ్బా సిరీస్ కు పేరుగా ఎంచుకుని ఉండవచ్చు. వర్మ గప్పాలు కొట్టినట్లుగా ఇది రాయలసీమలోని లేదా కడప జిల్లాలోని కొందరు రెడ్ల చరిత్రే అయితే ధైర్యంగా ఆయా కుటుంబ సభ్యుల అనుమతి తీసుకుని వారి పేర్లే పెట్టుకోవాల్సింది, అలా అడిగే ధైర్యం లేకపోయినా మిగతా సినిమా గాళ్ళ మాదిరిగా  ఏ సమరసింహా రెడ్డి పేరునో, ఏ నరసింహనాయుడి లాంటి పేరునో పెట్టుకోవాల్సింది . అలా కాకుండా ‘కడప’ పేరు పెట్టటం ఏమిటి?

చదవండి :  నాగేశ్వరి అసలు వుందా లేదా?

కడప జిల్లాకు చెందిన విపక్ష నేత నిర్వహిస్తున్న పాదయాత్ర ముఖ్యమంత్రి సొంత జిల్లాలోకి ప్రవేశిస్తున్న సమయంలో ఆయన కుటుంబ సభ్యుల పేర్లను, వారి సామాజిక వర్గాన్ని లక్ష్యంగా చేసుకుని ఇలాంటి వెబ్ సిరీస్ ప్రారంభించడం వెనుక రాజకీయ కుట్రలకూ తావుండే ఆస్కారం లేకపోలేదు. ఏదో రకంగా విపక్ష నేత నేపధ్యాన్ని బలహీనం చేయడానికి, ఆయన ప్రాతినిధ్యం వహిస్తున్న ప్రాంతం పేర మిగతా ప్రాంతాలలో భయాందోళనలు రేకెత్తించడానికి కూడా తలతిక్క వర్మ ఒక పావుగా మారి ఉండవచ్చు.  ఇటువంటి వ్యూహాలు రచించడంలో తెదేపాను గాని, ఆ పార్టీ కోసం అహరహం శ్రమించే సినిమా స్లీపర్‌సెల్స్‌ని గాని చరిత్ర ఎరిగిన వారెవ్వరూ తక్కువగా అంచనా వెయ్యటానికి వీల్లేదు. ఈ నేపధ్యంలో గత కొద్దికాలంగా విపక్ష నేత మీద అక్కసుతో రాయలసీమ, కడప జిల్లాల (ప్రజల) మీద పాలకులు ఒడిగడుతున్న విషప్రచారానికి కొనసాగింపుగానే ఈ  వెబ్ సిరీస్‌ను చూడాల్సి ఉంటుంది.

కడప వెబ్ సిరీస్

ఇటువంటి సమయంలో కుట్రల విషయంలో జాగురూకతతో వ్యవహరించాల్సిన వైకాపా అధినేత కుటుంబ సభ్యులకు సంబంధించిన సాక్షి దినపత్రిక వెబ్ సిరీస్ వార్తలకు కవేరేజీ ఇచ్చుకుంటూ స్తబ్దుగా ఉండిపోయింది.  ఈ నేపథ్యంలో సోషల్ మీడియాలో కొంతమంది మిత్రులు వ్యాఖ్యానించినట్టు సాక్షి తెదేపా కోసం పని చేస్తోన్న వారి చేతుల్లోకి వెళ్లిపోయిందేమో అన్న అనుమానం రాక మానదు.

చదవండి :  దమ్ముంటే నా మీదకు రా? కడప నడిబొడ్డులో తేల్చుకుందాం ...

కడప పేరు పెట్టి అక్కడి వాళ్ళు రాక్షసులు అన్నంత హైప్ క్రియేట్ చేసే పనికి పూనుకున్న వర్మ పైన రాష్ట్ర ప్రభుత్వం సుమోటోగా కేసు పెట్టాలి. కంచ ఐలయ్య అనే అయన ఒక పుస్తకానికి పెట్టిన పేరు విషయంలో చట్టాన్ని కాదని మరీ కేసు పెట్టేందుకు పూనుకున్న ఆం.ప్ర ప్రభుత్వం, కడప పేరును, అక్కడి ప్రజలను అవమానిస్తూ విపరీత వ్యాఖ్యానాలు చేసిన వర్మ పైన కేసు పెడుతుందా?

ఇంత జరుగుతున్నా కడప జిల్లాకు చెందిన అధికార, విపక్ష పార్టీల నాయకులు కానీ, ఆయా పార్టీల అనుబంధ సంఘాలు గానీ, కోస్తా ‘తెలుగు’ ప్రయోజనాల సేవలో తరించే ప్రచార, ప్రసార మాధ్యమాలు గాని నోరెత్తిన పాపాన పోలేదు. సందు దొరికినప్పుడల్లా కడప జిల్లా సంస్కృతినీ, కడప జిల్లా ప్రజలను కించపరుస్తూ వ్యాఖ్యానాలు చేసే కొన్ని తెలుగు పత్రికలూ (పచ్చపాత పత్రికలు), వాటిని నియంత్రించే ప్రభువులూ బహు బాగా నిద్ర నటిస్తున్నారు.

ఇలాంటి విపరీత పోకడలకు పోయే ఒక ప్రాంతం వేరుపడేట్లు చేశారు. ఇప్పుడిక చైతన్యమవుతున్న రాయలసీమ సమాజం వంతు!!

కడపజిల్లాప్రజలగురించిపలువురుప్రముఖులువ్యక్తంచేసినఅభిప్రాయాలు….

ఇదీ చదవండి!

రాయలసీమలో హైకోర్టు

హైకోర్టు రాయలసీమలో ఎక్కడ? – రెండో భాగం

రాయలసీమలో హైకోర్టు కుండల్లో నీళ్ళు పొరుగు జిల్లాలకు, మబ్బుల్లో నీళ్ళు కడపకు గ్రోత్ సెంటర్స్‌గా ఎంపిక చెయ్యడానికి రాయలసీమలో ఎక్కడైనా …

Leave a Reply

Your email address will not be published.

CAPTCHA * Time limit is exhausted. Please reload CAPTCHA.

error: