కడప-సామెతలు-ఇ

కడప సామెతలు – ‘ఆ’తో మొదలయ్యేవి

‘ఆ’తో మొదలయ్యే కడప సామెతలు …

‘ఆ’ అనే అక్షరంతో తెలుగు సామెతలు. కడప జిల్లాతో పాటుగా రాయలసీమ నాలుగు జిల్లాలలో వాడుకలో ఉన్న/ఉండిన సామెతలు.

  • ‘ఆ’ అంటే ఆరునెల్లు
  • ఆ ఊరుకు ఈ ఊరు ఎంత దూరమో, ఈ ఊరుకు ఆ ఊరూ అంతే దూరం
  • ఆకలి రుచెరగదు, నిద్ర సుఖమెరుగదు
  • ఆకు ముళ్ళు మీద బడినా, ముళ్ళు ఆకు మీద పడినా బొక్క ఆకుకే
  • ఆకార పుష్టి, నైవేద్య నష్టి
  • ఆగం అడివప్పా అంటే మడిగ తెరువప్పా అన్నదంట
  • ఆడకాడక సమర్తాడితే సాకలోడు కోక ఎత్తకపోయినాడంట
  • ఆడోళ్ళ నోట్లో నువ్వు గింజ నానదు
  • ఆడది తిరిగి చెడితే, మొగోడు తిరగక చెడతాడు
  • ఆడది బొంకితే గోడబెట్టినట్లు, మొగోడు బొంకితే తడికబెట్టినట్లు
  • ఆడదై పుట్టేకంటే అడివిలో మానై పుట్టేది మేలు
  • ఆడపడుచు ఉసురు తగిలితే ఆరు తరాలు అరిష్టం
  • ఆడపిల్ల ఆశ, మూలవాసం గుంజకపోయే వరకు తీరదు
  • ఆడ పెత్తనం, తురక పెత్తనం పనికి రావు
  • ఆడలేనమ్మ మద్దెల దరువెందుకనిందంట
  • ఆడి నెలలో ఆకులు రాలినట్టు
  • ఆడింది ఆట, పాడింది పాట
  • ఆడేది అడ్డ నామాలు తీసుకొంటే పాడేది పంగనామాలు తీసుకొందట
  • ఆ తానులోదే ఈ పేలిక
  • ఆతుగాడి కింద జీతగాడు
  • ఆత్రానికి పొతే ఆడపిల్ల పుట్టిందంట
  • ఆదిలోనే హంసపాదు
  • ఆపదలో అడ్డుపడే వాడే సుట్టము
  • ఆయప్పే ఉంటే మంగలాయప్పతో పనేమీ  అన్నదట
  • ఆయుస్సు తీరినోడు ఆరు నెలలకు చస్తే, అనుమాన పడిన వాడు అప్పుడే చస్తాడు
  • ఆరికకు చిత్త గండం, ఆడదానికి పిల్ల గండం
  • ఆరిక కోస్తే ఇల్లంతా గింజలు, దంచితే దొడ్డి అంతా పొట్టు
  • ఆరిక చల్లిన రెడ్డికి, ఆలుమగలకు ఒకటే చీర
  • ఆరు కార్తెలకు పోతు ఆరుద్ర కార్తె
  • ఆరుద్రతో అదును సరి
  • ఆరుద్రలో వాన కురిస్తే, ఆరు కార్తెలు కురుస్తాయి
  • ఆరు నెల్లు సావాసం చేస్తే వాడు వీడవుతాడు
  • ఆరె, కత్తి లేని ఆరూళ్ళ మాదిగతనం
  • ఆర్చేవాళ్ళు గాని, తీర్చే వాళ్ళు గాని లేరు
  • ఆలు ఆత్మకూరులో, మొగుడు బోయపల్లిలో, కుండా చట్టి కుణుతూరులో , తలంబ్రాలు తాడిపత్రిలో
చదవండి :  మాజీ హోంమంత్రి మైసూరారెడ్డి

ఇదీ చదవండి!

దూరం సేను

వదిమాను సేనుకాడ : జానపదగీతం

అత్త కూతురుతో మనువు కుదిరింది మల్లన్నకు. ఆ చనువుతో మల్లన్న మరదలిని తనతో కోతకు రమ్మని పిలిచినాడు. పెళ్లి కాకుండా …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

CAPTCHA * Time limit is exhausted. Please reload CAPTCHA.

error: