వీళ్ళు పన్ను ఎందుకు కట్టటం లేదో?

కడప కార్పోరేషన్ పరిధిలో గత కొద్ది సంవత్సరాలుగా పన్ను కట్టకుండా తిరుగుతున్న కొంతమంది వ్యక్తులు, సంస్థల పేర్లను ఒక దినపత్రిక ఈరోజు ప్రచురించింది. సదరు కధనం ప్రకారం పన్ను కట్టనివాళ్ళ జాబితా ఇదే…

ఫాతిమా మెడికల్‌ కాలేజ్‌ రూ.81 లక్షల 77వేల 282,

ఫాతిమా ఇంజనీరింగ్‌ కాలేజ్‌ రూ.14 లక్షల 77 వేల 392

నిర్మలా హాస్పిటల్‌ అండ్‌ క్వార్టర్స్‌ రూ.19 లక్షల 11 వేలు

సరస్వతి విద్యాలయం రూ.12 లక్షల 86 వేల 714

దేశం నేత గోవర్ధన్‌రెడ్డి ఒక సంస్థకు రూ.10 లక్షల 38 వేల 877 + మరో ఆస్తి పన్ను రూ.7లక్షల 73వేల 951

చదవండి :  దేవగుడిలో 35 మందిపై రౌడీషీట్

 జిల్లా కాంగ్రెస్‌ పార్టీ కార్యాలయం రూ.3 లక్షల 98వేల 646,

దేశం నేత విఎస్‌ నవాబ్‌జాన్‌(అమీర్‌బాబు) రూ.3 లక్షల 63 వేల 921

హరిప్రియ లాడ్జి రూ.3 లక్షల 98 వేల 135

అప్సర థియేటర్స్‌ రూ.2 లక్షల 80వేల 593

మదీనా ఇంజనీరింగ్‌ కళాశాల రూ.3 లక్షల 81 వేల 232

సరస్వతీ విద్యాలయానికి చెందిన హాస్టల్‌ బకాయి రూ.3 లక్షల 75 వేల 594

రాయల్‌ ఇంగ్లీషు మీడియం స్కూలు రూ.లక్షా 50వేల 380

చదవండి :  మంత్రి పదవిపై ఆశలేదంట!

యునైటెడ్‌ క్లబ్‌ రూ.2లక్షల 19వేల 753

మాజీమంత్రి సి.రామచంద్రయ్యకు సంబంధించిన గోడౌన్‌ రూ.లక్షా 16 వేల 678

కడప బెరైటీస్‌ రూ.89వేల 580

సామాన్యులెవరైనా ఆస్తిపన్ను, నీటిపన్ను చెల్లించకపోతే వెంటనే కనెక్షన్లు రద్దు చేస్తారు. అయితే లక్షలాది రూపాయలు బకాయిబడ్డ రాజకీయ నేతలు, కళాశాలలు, వ్యాపారసంస్థల జోలికి అధికారులు వెళ్లేందుకు సాహసించలేకపోతున్నారు.వీళ్ళంతా నోటీసులు జారీ చేసిన 15 రోజులలోపు పన్ను చెల్లించాల్సి ఉంది. అయితే ఏళ్ళ తరబడి బకాయిలు చెల్లించకుండా దర్జాగా తిరుగుతున్నారు. రాజకీయ నేతలు నేరుగా వారి పేరుపై ఉన్న వాటికి, వారి కుటుంబీకుల పేరుపై ఉన్న సంస్థలు, లాడ్జిలకు బకాయిలు చెల్లించకపోవడం విశేషం. పలువురికి ఆదర్శంగా ఉండాల్సిన వాళ్లే ఇలా నిర్లక్ష్యంగా వ్యవహరించడం ఎంతవరకు సబబనే ప్రశ్న తలెత్తుతుంది.

చదవండి :  లెజెండ్‌ సినిమా చేయడం పూర్వజన్మ సుకృతం

ప్రభుత్వ బకాయిలు

డెంటల్‌ కళాశాల రూ. రూ.58,11,669,

గ్రంథాలయ సంస్థ రూ.31 లక్షల 38వేల 528,

రిమ్స్‌ నర్సింగ్‌ కళాశాల రూ.18 లక్షల 59వేల 280,

కలెక్టర్‌ ఆఫీసు ప్రధాన బిల్డింగ్‌ రూ.15 లక్షల 98 వేలు,

పోలీసు గెస్ట్‌హౌస్‌ రూ.4 లక్షల 40వేల 465,

ఎస్పీ ఆఫీసు రూ.3లక్షల 96వేల 16లు

Leave a Reply

Your email address will not be published.

CAPTCHA * Time limit is exhausted. Please reload CAPTCHA.

error: