కన్నుల మొక్కేము నీకుఁ గడపరాయ – అన్నమయ్య సంకీర్తన

పదకవితా పితామహుడి ‘కడపరాయడు’ జగదేక సుందరుడు, అందగాడు. వాని అందచందాలు చూసి కన్నెలు పరవశించినారు. వాని చేతలకు బానిసలైనారు. కడపరాయని వశీకరణకు గురైన ఒక నాయిక  ఆ ‘మాయగాడి’ని మోహిస్తూ.. వచ్చి వలపులందుకొమ్మని ఇట్లా పిలుస్తోంది…

వర్గం: శృంగార సంకీర్తన
రాగము: సామంతం
రేకు: 0879-5
సంపుటము: 18-472


‘కన్నుల మొక్కేము…’ సంకీర్తన వినడానికి పైనున్న ప్లే బటన్ నొక్కండి.

కన్నుల మొక్కేము నీకుఁ గడపరాయ నన్నుఁ
గన్నెనాఁడె యేలితివి కడపరాయ ॥పల్లవి

చదవండి :  ఇందరికి నభయంబు లిచ్చుచేయి - అన్నమయ్య సంకీర్తన

కందర్పగురుఁడ వో కడపరాయ మాకు
గంద మీయఁ గదవోయి కడపరాయా
కందము నీగుణములు కడపరాయా తొంటి-
కందువకు రాఁ గదోయి కడపరాయా ॥కన్నుల మొక్కేము

కలువపూవుల వేసి కడపరాయా నేఁ
గలికి నంటా మెచ్చేవు కడపరాయా
కలకాలముఁ బాయకు కడపరాయా నీ-
కలపుకో లెరుఁగుదుఁ గడపరాయా ॥కన్నుల మొక్కేము

గరిమ శ్రీ వేంకటాద్రి కడపరాయా నన్నుఁ
గరుణించి కూడితివి కడపరాయా
గరిమేలు నేరుతువు కడపరాయా నా-
గరువ మీడేర్చితివి కడపరాయా ॥కన్నుల మొక్కేము

చదవండి :  అన్నమయ్య కథ : 4వ భాగం


‘కన్నుల మొక్కేము…’ సంకీర్తన వినడానికి పైనున్న ప్లే బటన్ నొక్కండి.

ఇదీ చదవండి!

సింగారరాయుడ

కరుణించవయ్య యిఁక కడు జాణవౌదువు – అన్నమయ్య సంకీర్తన

ప్రొద్దుటూరు చెన్నకేశవుని స్తుతించిన అన్నమాచార్య సంకీర్తన ప్రొద్దుటూరు లేదా పొద్దుటూరు, వైఎస్ఆర్ జిల్లాలోని ఒక ప్రముఖ పట్టణము. రెండవ బొంబాయిగా …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

CAPTCHA * Time limit is exhausted. Please reload CAPTCHA.

error: