‘వాస్తు కోసం దక్షిణ ద్వారం మూయండి’: కలెక్టర్

ఒంటిమిట్ట: వాస్తు రీత్యా దక్షిణద్వారం అనర్థదాయకం కావడంతో కోదండ రామాలయ దక్షిణ ద్వారాన్ని మూసి వేయాలని జిల్లా సర్వోన్నత అధికారి కేవిరమణ అధికారులకు సూచించారు.

ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామి బ్రహ్మోత్సవ ఏర్పాట్లను శనివారం జిల్లాకలెక్టరు కేవీ రమణ పరిశీలించారు. కల్యాణం నిర్వహించే ప్రదేశాన్ని పరిశీలించారు. బ్రహ్మోత్సవాల సమయంలో బారికేడ్లతో భక్తులకుఇబ్బందులు కలగకుండా పటిష్టమైన వరుసలు ఏర్పాటు చేయాలని అధికారులకు చెప్పారు.

కల్యాణం నిర్వహించే ప్రాంత వంకను పూడ్చాలని జెడ్పీవైస్‌ఛైర్మన్ ఇరగంరెడ్డి సుబ్బారెడ్డి కలెక్టరు సూచించారు. ప్రస్తుతం సమయంతక్కువగా ఉందని వంకను పూడ్చడం కష్టమైన పని అని కలెక్టరు తెలిపారు.

చదవండి :  ఆదివారం పోలియో చుక్కల కార్యక్రమం

రామకుటీరం సమీపంలో 50 మీటర్ల వెడల్పుతో వంకను బుధవారం లోపు పూడ్చాలని అధికారులను ఆదేశించారు. కల్యాణ సమయంలో ఎటువంటి ప్రమాదాలు జరగకుండా వంకకు చుట్టూ రెండువరుసల్లో బారికేడ్లను ఏర్పాటు చేసేలా చర్యలను తీసుకోవాలని జిల్లా దేవాదాయశాఖ సహాయకమిషనరు శంకర్‌బాలాజీని ఆదేశించారు.పనులను వేగవంతం చేయాలని ఆదేశించారు.

కలెక్టరు వెంట అడిషనల్ జాయింట్ కలెక్టరు చంద్రశేఖర్‌రెడ్డి, రాజంపేట ఆర్డీవో ప్రభాకర్‌పిళ్త్లె, తహసీల్దారు కనకదుర్గయ్య తదితరులు ఉన్నారు.

ఎప్పటి నుంచో తెరిచి ఉన్న దక్షిణ ద్వారం వాస్తు కారణంగా మూత పడబోతోంది అన్న మాట. ఆగమ శాస్త్రాలకు అడ్డు కాని దక్షిణ ద్వారాన్ని వాస్తు పేరు చెప్పి మూసేయమని కలెక్టర్ చెప్పడం ఏమిటో? ఇది ప్రభుత్వం వారి ఆదేశామా ? లేక కలెక్టర్ గారి నిర్ణయమా?

చదవండి :  ఆ మహనీయుడికిది మా నివాళి!

ఇదీ చదవండి!

ramana ias

‘కొప్పర్తి పరిశ్రమలవాడలో భూముల ధరలు ఎక్కువ’: కలెక్టర్

గతంలో ఏ కలెక్టరు ఇలా ఉండరనేది నిజమే కడప :  కొప్పర్తి పరిశ్రమల పార్కులో పెద్ద, మధ్యతరహా పరిశ్రమల ఏర్పాటుకు …

Leave a Reply

Your email address will not be published.

CAPTCHA * Time limit is exhausted. Please reload CAPTCHA.

error: