ప్రాణుల పేర్లు

కడప జిల్లాలో 15 చిరుతపులులు…

ప్రొద్దుటూరు అటవీశాఖ డివిజన్‌ పరిధిలో ఏడు చోట్ల చిరుతపులి పాదాల గుర్తులను సేకరించినట్లు అటవీశాఖాధికారులు పేర్కొన్నారు. ప్రొద్దుటూరు రేంజిలో 10,264.07 హెక్టార్లు, బద్వేలు రేంజిలో 9,786 హెక్టార్లలో లంకమల అభయారణ్యం విస్తరించి ఉంది. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు ఈనెల 2-8 వరకు లంకమలలో వన్యప్రాణులు, వన్యమృగాల సంచారం, సంతతిపై అటవీశాఖాధికారులు క్ష్రేతస్థాయిలో సర్వే చేశారు.

బద్వేలు రేంజి పరిధిలోని బాలాయపల్లె బీటులో సాకుడుచెల ప్రాంతంలో నాలుగు చిరుతలు సంచరించినట్లు గుర్తించారు. అదేవిధంగా బట్టమానుచెల, ముల్లెద్దుచెల ప్రాంతాల్లో వీటి పాదాల గుర్తులు కనిపించాయి. ఇక్కడికి సమీపంలోనే రెడ్డిబావి బేస్‌ క్యాంపు ప్రాంతంలో అరుపులను బట్టి మూడు చిరుతలు సంచరించినట్లు అటవీశాఖాధికారులు నిర్దారణకొచ్చారు.

చదవండి :  రాయలసీమకు ఏం చేసింది?

బద్వేలు డివిజన్‌లో గోపవరం మండలం తూర్పు కొండలో 4,687.23 హెక్టార్లు, మల్లెంకొండలో 4,765.10 హెక్టార్లల మేర పెనుశిల నరసింహాస్వామి అభయారణ్యం విస్తరించి ఉంది. ఈ ప్రాంతంలో రామాపురం బీటు ఎద్దులబోడు అడవిలో మరో చిరుత ఉన్నట్లు అధికారులు ఆధారాలు సేకరించారు.

చిరుత జాడ, సంచారం, కదలికలపై సేకరించిన పాదాలు, పెంటికల నమూనాలను కర్నూలు ముఖ్య అటవీ సంరక్షణాధికారి కార్యాలయానికి అధికారులు పంపనున్నారు.

జిల్లాలోని ఇతర అటవీ డివిజన్‌లలో కూడా చిరుతల సంఖ్య బాగానే ఉన్నట్లు తెలుస్తోంది. మొత్తం మీద జిల్లా పరిధిలోని అడవిలో సుమారు 15 చిరుతలు ఉండవచ్చని ఒక అంచనా. చిరుతల పరిరక్షణకు అధికారులు చర్యలు చేపట్టినట్లైతే వీటి సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది.

చదవండి :  కడప నగరంలో తితిదే ఈ-సేవ కౌంటర్

ఇదీ చదవండి!

పాస్‌పోర్ట్ సేవలు

ఏప్రిల్ 3 నుండి కడపలో పాస్‌పోర్ట్ సేవలు

కడపలో పాస్‌పోర్ట్ సేవా కేంద్రం ఏర్పాటు విదేశాంగ మరియు తపాల శాఖల మధ్య అవగాహనా ఒప్పందం జిల్లా వాసులకు తిరుపతి …

Leave a Reply

Your email address will not be published.

CAPTCHA * Time limit is exhausted. Please reload CAPTCHA.

error: