చెట్టూ చేమల పేర్లు కలిగిన ఊర్లు

కడప జిల్లాలో వివిధ రకాలయిన చెట్ల పేర్లను సూచించే 131 ఊర్లు ఉన్నాయి. ఈ 131 ఊర్లూ 57 రకాల చెట్టూ చేమల పేర్లు కలిగి ఉండడం ఆసక్తికరమైన విశేషం.

 అత్తి: అత్తిరాల

అనుము: హనుమనగుత్తి

ఇప్ప: ఇప్పట్ల, ఇప్పపెంట లేదా ఇప్పెంట

ఈదు: ఈదులపల్లె, ఈదుళ్ళపల్లె

ఊడవ: ఊడవగండ్ల

ఏపె: ఏప్పిరాల, ఏపిలమిట్ట, ఏపిలవంకపల్లె

ఒడిశ: ఒడిశలగొంది

కనుము: కనుపర్తి

కలే: కలికిరి

కానుగ: గానుగపెంట

గార: గారాలమడుగు

గురిగింజ: గురిగింజకుంట

గొట్టి: గొట్లమిట్ట

గోనుమాకు: గోనుమాకులపల్లె

చదవండి :  నంద్యాలంపేట

చండ్ర: చండ్రపల్లి, చండ్లూరు, సన్నుపల్లె

చాగ: చాగలేరు, చాగలగుట్టపల్లె

చింత: చింతకుంట, చింతలచెలక, చింతకొమ్మదిన్నె

చిగర: సిరిగెపల్లె

చిటిమిటి: చిటిమిటిచింతల

జంబు: జమ్మలమడుగు

జాల: జాలపర్తి

జిల్లేడు: జిల్లెల్ల, జిల్లేళ్ళమడక

జువ్వి: జువ్వలపల్లె

జెముడు: చెముడూరు, చెముల్లపల్లె

టెంకాయ చెట్టు: టెంకాయచెట్లపల్లె

తంగేడు: తంగేడుపల్లె

తక్కలి: తక్కలపల్లె

తాటి: తాటిమాకులపల్లె, తాడిగొట్ల, తాళ్ళపల్లె, తాళ్ళపాక, తాళ్ళప్రొద్దుటూరు

తుమ్మ: తుమ్మకొండ (రాజంపేట తాలూకా), తుమ్మచెట్లపల్లె (కడప తాలూకా, రాజంపేట తాలూకా), తుమ్మలఅగ్రహారం (రాజంపేట తాలూకా), తుమ్మలపల్లె (కమలాపురం, బద్వేలు, ప్రొద్దుటూరు, పులివెందుల తాలూకా (3)), తుమ్మలపాడు (ప్రొద్దుటూరు తాలూకా) , తుమ్మలూరు (కడప తాలూకా)

చదవండి :  కేతు విశ్వనాథరెడ్డి ఇంటర్వ్యూ...

తూడు: తూడూరు

తొగరు: తొగరుపల్లె

దిరస: దిరసవంచ

దొండ: దొండపాడు, దొండ్లవాగు

నానబాలు: నానబాలపల్లె

నువ్వు: నూలివీడు

నేరేడు: నేరెల్లవంక

పాల: పాలగిరి

పూలి: పూలికుంట

పొట్ల: పోట్లదుర్తి

పొన్న: పొన్నతోట

బండారు: బండారుపల్లె

బూరగ: బూరగమానిపల్లె

మద్ది: మద్దిమడుగు, మద్దిరాల, మద్దులపాయ, మద్దూరు, మద్దులేటిగడ్డ

మర్రి: మర్రిపల్లె, మర్రిమాకులపల్లె, మర్లబయలు

మల్లె: మల్లెమడుగు

మేడి: మేడిదిన్నె, పొట్టిమేడిపల్లె

మొగిలి: మైలపల్లె, మైలవరం

మొయిలి: మొయిళ్లకాల్వ, మొయిళ్లచెరువు

రాగి లేదా రావి: రాగికుంట, రాగిమాకులపల్లె, రాగిమానుపల్లె, రాగిమానుబిడం, రావులకొలను, రావులకొల్లు, రావులపల్లె

చదవండి :  జమ్మలమడుగులో తమిళ హీరో విజయ్

రేగు: రేకలకుంట

కాకిరేణి: కాకిరేనిపల్లె

వద్ది: వద్దిరాల

వావిలి/ వాయిలి: నున్నవావిల్లపల్లె, వాయిలచెట్లపల్లె, వాయిల్ల సుగాలిబిడెం

వెదురు: వెదురూరు

వెలగ: వెలగచెర్ల

వేము: వేంపల్లె, వేపరాల, వేమగుంట, వేమలూరు, వేముల

సారమాను: సారమానిపాడు

సుంకేసుల: సుంకేసుల

సోమిమాకు: సోమిమాకులపల్లె

పైన పేర్కొన్న గ్రామనామాలే కాకుండా పేరు చివరన చెట్టూ చేమల పేర్లు కలిగిన ఊర్లు 213 ఉన్నాయి. ఉదా: నిడుజువ్వి, సిద్దవటం.

(సౌజన్యం: కడప ఊర్లు పేర్లు, డా. కేతు విశ్వనాథరెడ్డి)

ఇదీ చదవండి!

ప్రాణుల పేర్లు

కడప జిల్లాలో ప్రాణుల పేర్లు కలిగిన ఊర్లు

కడప జిల్లాలో 16 రకాలయిన ప్రాణులను (Animals, Birds, reptiles etc..) సూచించే ఊర్ల పేర్లున్నాయి. ప్రాణుల పేర్లు సూచించే …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

CAPTCHA * Time limit is exhausted. Please reload CAPTCHA.

error: