న్యూఢిల్లీ: తన సంస్థలలో పెట్టుబడులు, తన ఆస్తులపై సీబీఐ విచారణకు ఆదేశిస్తూ ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఇచ్చిన తీర్పును నిలిపివేయాలని కోరుతూ వై.ఎస్.ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, కడప ఎంపి జగన్‌మోహన్‌రెడ్డి దాఖలు చేసిన పిటీషన-ని సుప్రీం కోర్టు తోసిపుచ్చింది. దీనిపై సుప్రీం కోర్టులో రెండు గంటలసేపు వాదనలు జరిగాయి. జగన్ తరపున ప్రముఖ న్యాయవాదులు రామ్ జెఠ్మాలనీ, ముకుల్ రోహత్గీ వాదించారు. సిబిఐ విచారణపై స్టే ఇచ్చేందుకు సుప్రీం కోర్టు నిరాకరించింది. విచారణ జరుగుతున్న ఈ సమయంలో తాము జోక్యం చేసుకోలేమని సుప్రీం కోర్టు తెలిపింది. మీరు చెప్పే వాదనలు ఏమైనా ఉంటే సిబిఐకే వినిపించాలని కోర్టు తెలిపింది.
ట్యాగ్లుcbi probe kadapa ys jagan
ఇదీ చదవండి!
సీమ విషయంలో ప్రభుత్వ దాష్టీకాలపై గొంతెత్తిన జగన్
రాయలసీమ ప్రజలకు తీరని అన్యాయం చేస్తున్న బాబు కరెంటు కోసం సీమ ప్రాజెక్టులను గాలికొదిలేస్తారా? హైకోర్టును వేరే చోట ఏర్పాటు …