జగన్ మెజార్టీ 5,45,672 ఓట్లు

కడప పార్లమెంట్ స్థానం నుంచి పోటీ చేసిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జగన్మోహన రెడ్డి రాష్ట్ర స్థాయిలో రికార్డు మెజార్టీతో ఘనవిజయం సాధించారు. తన సమీప ప్రత్యర్థి, కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి మంత్రి డిఎల్ రవీంద్రారెడ్డిపై ఆయన భారీ ఆధిక్యత సాధించారు. జగన్మోహన్ రెడ్డి 545672 ఓట్ల మెజార్టీతో ఘన విజయం సాధించారు. ఆయనకు అన్ని నియోజకవర్గాలలో అరవై వేలకు పైగా ఓట్ల మెజార్టీ రావడం విశేషం.

 

కడప లోక్ సభ పరిధిలోని ఏడు అసెంబ్లీ సెగ్మెంట్ల లో మెజార్టీలు ఇలా ఉన్నాయి.బద్వేలు-60914 కమలాపురం- 63969 కడప- 67500 జమ్మలమడుగు- 69149 మైదుకూరు-68992 ప్రొద్దుటూరు -74504 పులివెందుల- 108133 ఓట్ల ఆధిక్యత తెచ్చుకుని జగన్ తనకు ఎదురు లేదని నిరూపించుకున్నారు. ఆయన సమీప ప్రత్యర్ధులైన కాంగ్రెస్ అబ్యర్ధి , రాష్ట్ర ఆరోగ్యశాఖ మంత్రి డాక్టర్ డి.ఎల్.రవీంద్ర రెడ్డి కి 1,46,579 ఓట్లు రాగా,తెలుగుదేశం అభ్యర్ధి డాక్టర్ ఎమ్.వి.మైసూరారెడ్డికి 1,27,565 ఓట్లు లభించాయి.

చదవండి :  దేవుని కడప బ్రహ్మోత్సవంలో ఈ రోజు

 

వీరిద్దరూ డిపాజిట్లు కోల్పోవడం సంచలనంగానే భావించాలి. ఎంతో ప్రతిష్టాత్మకంగా ఈ రెండు పార్టీలు తీసుకుని తలపడినప్పటికీ జగన్ కు దరిదాపులలోకి రాలేకపోవడం గమనించదగిన అంశం.

కాంగ్రెస్,టిడిపిల చెంపచెళ్లుమనిపించిన ఓటర్లు:జగన్

కాంగ్రెస్ పార్టీకి ప్రజలు తగిన గుణపాఠం చెప్పారని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జగన్మోహన రెడ్డి అన్నారు. ఫలితాలు వెలువడిన అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడారు. ఈ ఫలితాలు రాష్ట్రంలో జరుగబోవు మార్పుకు నాంది అన్నారు. ప్రతిపక్షంగా ఉండవసిన తెలుగుదేశం పార్టీ కాంగ్రెస్ పార్టీతో కుమ్మక్కై ప్రజలను మోసం చేసిందన్నారు. తెలుగుదేశం పార్టీకి కూడా ప్రజలు లాగి చెంపదెబ్బ కొట్టారన్నారు.

చదవండి :  తెలంగాణను జగన్ కోణంలో చూస్తారా!

దేశ చరిత్రలో మరచిపోలేని విధంగా ప్రజలు తీర్పు ఇచ్చారని చెప్పారు. అపూర్వమైన తీర్పు ఇచ్చిన ప్రతిఒక్కరికీ పేరుపేరున కృతజ్ఞతలు తెలిపారు. తాను ముఖ్యంగా ముగ్గురికే కృతజ్ఞతలు తెలుపుతానని చెప్పారు. తాను దేవుడి దయవల్ల, నాన్న ఆశీస్సులతో, నాన్నను ప్రేమించే ప్రతి ఒక్కరి అండ వల్ల తాను గెలిచానని అన్నారు. వారందరికీ కృతజ్ఞలు తెలుపుతున్నానన్నారు.

జులై 8న నాన్న పుట్టిన రోజని, ఆ రోజున ఇడుపులపాయలోనే పార్టీ ప్లీనరీ ఏర్పాటు చేస్తామని చెప్పారు. ఆ రోజున ప్రతి నాయకుడు, ప్రతి కార్యకర్త నుంచి అభిప్రాయాలు తీసుకుంటామన్నారు.
ఏం చేయబోతున్నామో వివరంగా చెబుతామని చెప్పారు. తమ పార్టీ జెండా చూస్తే చాలు ఎజండా చెప్పకనే చెప్పినట్లు ఉంటుందన్నారు.

చదవండి :  ఉక్కు కర్మాగారం ఏర్పాటు పరిశీలనకై వచ్చిన సెయిల్‌ బృందం

తాను ప్రజల పక్షాన ఉన్నానని చెప్పారు. ఈ ప్రభుత్వం పడిపోతే ముందుగా సంతోషించేది పేద ప్రజలన్నారు. అయితే తెలుగుదేశం పార్టీ అలయన్స్ పార్టనర్ అయిపోయిందని అందువల్ల ఈ ప్రభుత్వం పడిపోదన్నారు.

ఇదీ చదవండి!

మైసూరారెడ్డి

వైకాపాకు మైసూరారెడ్డి రాజీనామా

కడప : వైకాపాలో సీనియర్ నేతగా ఒక వెలుగు వెలిగిన మైసూరారెడ్డి ఆ పార్టీకి రాజీనామా చేశారు. ఇందుకు సంబంధించి …

2 వ్యాఖ్యలు

  1. అవినీతి అస్త్రం వికటించింది…అవినీతి పరులు ఓడిపోతారు అన్న TDP & కాంగ్రెస్ ల ప్రచారం నిజమయ్యింది!!! బాబు గారు మీరు జనాల గుండెల్లో ఇలానే నిద్రపోండి, చిరు నువ్వ్వు ఇలానే వచ్చే ఎన్నికల్లో కూడా మీసం మెలేసి, తోడగొట్టు (అది నీ అభిమానుల కు చెంపదెబ్బ) , కాంగ్రెస్ మీ దిగజారుడు ప్రవర్తన ఇలానే కొనసాగించండి….జగన్ గెలుపుని ఆస్వాదించండి ….గుడ్ లక్

  2. ఇది నా కడప జిల్లా ప్రజల విజయం,కడప న మజాకా.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

CAPTCHA * Time limit is exhausted. Please reload CAPTCHA.

error: