హోమ్ » వార్తలు » రాజకీయాలు » వెంట్రుక కూడా పీకలేకపోయారని చెబుతున్నా..

వెంట్రుక కూడా పీకలేకపోయారని చెబుతున్నా..

వైకాపా ప్లీనరీలో జగన్ చేసిన ప్రసంగంలో ఒక భాగం ….

ఓట్లకోసం,సీట్ల కోసం ఏ గడ్డి అయినా తినే కార్యక్రమాన్ని చూశాం..ఓట్ల కోసంసీట్ల కోసం కేసులు పెట్టడం చూశాం..ఓట్లకోసం,సీట్ల కోసం అడ్డగోలుగా రాష్ట్రాన్ని విడదీయడానికి జరుగుతున్న ప్రయత్నాలు చూస్తున్నాం..రెండు న్నర సంవత్సరాలలో పదహారు నెలలపాటు జైలులో పెట్టారు.అన్యాయమైన రాజకీయాలు ఇంత అన్యాయంగా ఉంటాయని అనుకోలేదు.ఓట్ల కోసం,సీట్ల కోసం చంద్రబాబు,కాంగ్రెస్ కలిసికట్టుగా ఒకటే కేసు పెట్టిన రోజు చూశాం.

మూడు నెలల్లో బెయిల్ ఇచ్చి పంపాలి. అయినా దర్యాప్తు పేరుతో విచారణ కూడా జరపకుండా ఒక వ్యక్తిని పదహారు నెలలు జైలులో ఉంచిన అన్యాయపు రాజకీయం చూశాం..పదహారు నెలలపాటును వై.ఎస్.ఆర్.కాంగ్రెస్ ను లేకుండా చేయాలని చూశారు.జైలులో కూడా జగన్ ను ఎవరూ కలవకుండా ప్రయత్నాలు,.ఇంత చేసినా జగన్ ను వై.ఎస్.ఆర్.కాంగ్రెస్ ను వెంట్రుక కూడా పీకలేకపోయారని చెబుతున్నా..ఆ పదహారు నెలలు జైలులో పెట్టినప్పుడు రాష్ట్రం రాజకీయం చూసి గుండె తల్లడిల్లింది.ఎఫ్.డి.ఐ అంటే చిన్న వర్తకులు, రైతుల కు సంబంధించిన విషయం. ఆ సమయంలో జగన్ ను జైలులో పెట్టారు..భయపెట్టారు.జగన్ తీహారు జైలులోకి పంపుతారట. జగన్ అసలు బయటకు రారట..అని భయపెట్టారు. కాని జగన్ ఎఫ్.డి.ఐ వ్యతిరేకంగా నిజాయితీతో కూడిన రాజకీయం చేశాడు జగన్.కాని చంద్రబాబు మాత్రం బయటే ఉన్నాడు.చంద్రబాబు సిగ్గులేకుండా ఎమ్.ఆర్.,ఐ.ఎమ్.జి కేసులో విచారణ రాకుండా ఎఫ్.డి.ఐ బిల్లులో తన ఎమ్.పిలతో గైర్హాజరయ్యేలా చేశారు.

కిరణ్ ప్రభుత్వం పై అవిశ్వాస తీర్మానం పెడితే జగన్ జైలులో ఉన్న పార్టీ ఎమ్మెల్యేలు అంతా వ్యతిరేకంగా ఓటు వేశారు.కాని చంద్రబాబు తనపై విచారణలు రాకుండా కిరణ్ ప్రభుత్వానికి అనుకూలంగా విప్ జారీ చేసి మద్దతు ఇచ్చారు. చంద్రబాబు ఏ రకంగా కాంగ్రెస్ కుమ్మక్కయ్యాడో చెప్పకనే చెబుతున్నది. ఇవన్ని జైలులో ఉండే చూశా.

నేను జైలులో ఉన్నా ప్రజల విశ్వాసాన్ని , నిజాయితీని వమ్ము చేయలేదు…అని జగన్ పేర్కొన్నారు.ఇక్కడ ఉన్న పార్టీ శ్రేణులంతా, అమ్మ , సోదరి షర్మిల,భార్య భారతి,కార్యకర్తలు, కోట్లాది ప్రజల ఆత్మీయత ందరూ అండగా ఉన్నారని జగన్ అన్నారు.

చదవండి :  ఒక ప్రాంతానికి, ఒకే వర్గానికి మేలు చేసేలా ప్రభుత్వ నిర్ణయాలు

ఇదీ చదవండి!

గొంతెత్తిన జగన్

సీమ విషయంలో ప్రభుత్వ దాష్టీకాలపై గొంతెత్తిన జగన్

రాయలసీమ ప్రజలకు తీరని అన్యాయం చేస్తున్న బాబు కరెంటు కోసం సీమ ప్రాజెక్టులను గాలికొదిలేస్తారా? హైకోర్టును వేరే చోట ఏర్పాటు …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

CAPTCHA * Time limit is exhausted. Please reload CAPTCHA.

error: