dl
డి ఎల్ రవీంద్రా రెడ్డి

డి.ఎల్ అలా చేస్తారా?

మాజీ మంత్రి డి.ఎల్ రవీంద్రా రెడ్డి గురించి ఈ మధ్య ఆయన సొంత నియోజకవర్గంలో ఒక ప్రచారం జోరందుకుంది. అదేమిటంటే … రాబోయే సార్వత్రిక ఎన్నికల బరిలో దిగినా దిగాకపోయినా తెదేపాకు సహకరిస్తారని – అందుకు నజరానాగా చంద్రబాబు తదనంతరం డిఎల్ రవీంద్రారెడ్డి గారికి రాజ్యసభ సీటు ఇస్తారని. ఇదే విషయాన్ని తెలుగు తమ్ముళ్ళు డిఎల్ కు ప్రతిపాదించారని, అందుకు ఆయన సుముఖంగా ఉన్నారని ఊహాగానాలు జోరందుకున్నాయి.

డిఎల్ కూడా ఇందుకు సిద్దమయ్యే పక్షంలో మైదుకూరు నియోజకవర్గంలో తెదేపా అభ్యర్థిగా బరిలో దిగనున్న వ్యాపారవేత్త పుట్టా సుధాకర్ యాదవ్ (ఈయన తెదేపా నేత యనమల రామకృష్ణుడుకు వియ్యంకుడు) వైకాపా అభ్యర్థి అయిన రఘురామిరెడ్డికి గట్టి పోటీ ఇస్తారని చెప్పుకుంటున్నారు. ఎందుకంటే ఆర్దికంగా బలవంతుడైన సుధాకర్ యాదవ్ కోట్లాది రూపాయలను వెచ్చించేందుకు సిద్ధంగా ఉన్నారంట.

చదవండి :  వైకాపా ధర్నా విజయవంతం

సమైక్యాంధ్ర నేపధ్యంలో కాంగ్రెస్ గెలిచే పరిస్తితి లేనందున ఈ ప్రతిపాదనకు అంగీకరిస్తే రాజ్యసభకు వెల్లోచ్చంటూ డిఎల్ ను ఒప్పించేందుకు తెలుగు దేశానికి చెందిన కీలక నేతలు ప్రయత్నిస్తున్నారట.

రాజకీయంగా సుదీర్ఘ అనుభవం, చురుకైన వ్యూహ చతురత, స్థిరమైన ఓటు బ్యాంకు కలిగిన డి.ఎల్ స్థానికంగా తన ఉనికిని ప్రశ్నార్ధకం చేసుకొని కొత్తగా బరిలోకి దిగుతున్న తెదేపా అభ్యర్తికి సహకరిస్తారా? – అదీకాక తెదేపా అధినేత ఎన్నికల వేళ గుప్పిస్తున్న హామీలను నమ్మి…?

చదవండి :  ‘ఉప’ ప్రచారానికి హనుమంతుడు

ఇదీ చదవండి!

telugudesham

తెదేపా ఆహ్వానాన్ని పట్టించుకోవట్లేదా?

డీ ఎల్ కి తెలుగు దేశం నేతలు గాలమేసే ప్రయత్నాలు చేస్తున్నారని పుకార్లు షికార్లు చేస్తున్నాయి. ఇప్పటికే తెదేపా డీఎల్‌కు …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

CAPTCHA * Time limit is exhausted. Please reload CAPTCHA.

error: