తిప్పలూరు శాసనము

తిప్పలూరు శాసనము

ఇదియు కమలాపురం తాలూకాలోనిదే. దీని లిపి సొగసైన పల్లవ-గ్రంథాక్షరములను పోలి యుండును. ణకారము కళింగరాజుల శాసనములందువలె నుండును.

ఎరికల్ ముతురాజు పుణ్యకుమారుడు చివన్‌లి పట్టుగాను రేనాణ్డేలుచుండగా చామణకాలు అను ఉద్యోగిక ఱెవురు(నివాసియగు) తక్కన్ ప్రోలు పారదాయ (భారద్వాజః)కత్తిశర్మకు తిప೯ లూరను ఏబది (మతరుల) పన్నస కాత్తి೯క మాసము బహుళపక్షము ద్వతీయ,పుణరు పుష్యమి (పునర్వసు) నక్షత్రము సోమవారము బృహస్పతిహోర అగు సమయమున ధర్మము చేసెను. పుణ్యకుమారునికి మరున్థ(ఇక్కడ థవత్తును θగా చదవాలి) పిడుగు; మదుముదితున్ఠు (ఇక్కడ ఠవత్తును θగా చదవాలి), ఉత్తమోత్తమున్డు (ఇక్కడ డవత్తును θగా చదవాలి). గణ్యమాన్డు(ఇక్కడ డవత్తును θగా చదవాలి) అను బిరుదాలు లేక ప్రశంసాపదములు గలవు.

శాసన మూలము

 1. స్వస్తిశ్రీ ఎరికల్ల ముతు
 2. రాజు పుణ్యకుమారున్డు((ఇక్కడ డవత్తును θగా చదవాలి)గణ్య
 3. మానున్డు(ఇక్కడ డవత్తును θగా చదవాలి)మరున్డ(ఇక్కడ డవత్తును θగా చదవాలి)మద
 4. ముదితును తమోతమున్డ(ఇక్కడ డవత్తును θగా చదవాలి)యిన వా
 5. న్డు((ఇక్కడ డవత్తును θగా చదవాలి)చి೯లియ పటుకాను రేనాణ్డే
 6. ళుచుతక్క೯ పుఱోలపారదాయ
 7. కిఱెవురు కత్తిమ೯కు తిప೯లూ
 8. రపనాళకొణ్డ కాత్తి೯య చీకు
 9. బిదియ సీమవారంబు పుణరు
 10. పుష్యంబు బృహస్పతి హోర[కా]
 11. ను ఎమ్బది యె చామణకాలధ[11*]

ఇచట దానము చేసినది చామణకాలు అను ఉద్యోగి. కనుక ‘పుణ్యకుమారుడు రేనాణ్డేళుచు’- అనుదానికి పుణ్యకుమారుడు రేనాణ్డేళుచుండగా అనిచెప్పవలెను. ‘ళ’కారములు కొన్ని యింకా ‘ల ‘కారములుగ మారలేదు. ఏవ్ళుచున్, అనేయున్నది.వేరే శాసనంలో ‘శమ్మ೯ళాకున్’ అనికూడా కలదు. ‘ఎరికల్’ అనుహలంతముపట్టుదలగా ‘ఎరికల్ల’అని అజంతంగా మార్చబడింది. ఇదే నిజమైన తెలుగుతనము. అట్లే ద్రవిడ హలంత తత్సమాలు పుణ్యకుమారన్; గణ్యమానన్, ముదముది తన్, ఉత్తమోత్తమన్, అనేపదాలు ఉకారాంత తెలుగు తత్సమాలుగ మారినవి. పుణ్యకుమారున్డు, గణ్యమానున్డు, మదముదితున్డు, ఉత్తమోత్తమున్డు(ఈ నాలుగు పదాల లోని డ వత్తును θ గా చదువవలెను) అని ‘ఉ’కారాంతములు ప్రథమైక వచన రూపము లు తయారై నవి. ఈ చివరి ‘ఉ ‘కారారము నుచ్చరించుటకు ముందున్న ప్రాతిపదికలోని ‘అ ‘కారముకూడ ‘ఉ’ కారము కావలసి వచ్చింది. అనగా చివరి ‘ఉ’కారమును నుచ్చరించుటలో కష్టము లేకపోతే ముందున్న ప్రాతిపదికలోని తుది ‘అ’కారము ‘ఉ’గా మారనక్కర లేదనుకోవలెను. అందుచేతనే ‘రంగడు’ ‘మల్లడురేవడు’అను రూపములనేకము వాడుకలోనున్నవి.

చదవండి :  కడప ప్రాంత శాసనాలలో రాయల కాలపు చరిత్ర !

ఇచట ముతురాజు అనుటచే పుణ్యకుమారుడింక మహారాజు పదవిని పొందలేదని తెలియుచున్నది. మఱున్డ(ఇక్కడ డవత్తునుθగా చదవాలి) పిడుగు అనగా శత్రురాజులకు పిడుగువంటి వాడని అర్థము.’కగ’లమధ్య భేదమింక పూర్తిగా రాలేదు.అట్లే ‘త’ ‘ద’ లమధ్యకూడ. తేనికి, దేనికి అని అభేదంగానే వాడబడుచున్నవి.పల్లవ మొదటి మహేన్ధ్ర వర్మ యొక్క ‘పగాప్పిడుగు ‘అనే బిరుదును పోలిన బిరుదీ పుణ్యకుమారుని’ మఱన్డ (ఇక్కడ డవత్తునుθగా చదవాలి) పిడుగు’లేక మార్పిడుగు ‘ అనునవి.అట్లే మదముదితున్డు'(ఇక్కడ డవత్తును θ గా చదవాలి) అనేదికూడా పల్లవరాజుయొక్క ‘మత్త విలాస’ అనేబిరుదును పోలియున్నది.చిప೯లియ అనేది చిప్పలి అనే నగర ము.పటుకాను(=పట్టుకాను)అంటే రాజధానిగా రాజ్యము చేయుచుండగా, అని అర్థము. తక్క೯పుఱోల అనగా తర్కప్రోలు అనేఊరు తకప్రోలు అనే వేరే శాసనంలో కూడ వస్తూంది.’పుఱోల’లోని ‘ఱో’అను అక్షర ము వలన ముందున్న ‘పు’కొంత్కాలమునకు ‘ప్రో’గా మార్పునొందెను. అట్లే ‘కొఱెచె’ అనునది ‘క్రొచ్చె ‘అని మారింది.’పారదాయ ‘అనగా ‘భారద్వాజ ‘ అని కత్తిశర్మ యొక్క పుణ్యకుమారుని తిప్పలూరి శాసనము.

చదవండి :  కలమళ్ళ శాసనము

గోత్రము కాదగును. ఇచట గమనించ వలసిన దేమన ;భారద్వాజ ‘ అని, పుణ్యకుమారుని సంస్కృత శాసనాల్లో అనేక మార్లు వస్తుంది.అయినా యిక్కడ తెలుగుతనము ఉండాలని ప్రాకృతరూపాన్ని అనుకరించి ‘పారదాయ ‘అని వాడెను.

‘కిఱెవురు ‘అనే పదానికి అర్థము తెలియుట లేదు.తిప్పలూరు లోనే భూమిదానం చేయబడింది.ఇట్లు బ్రాహ్మణులకు దానంగా ఇచ్చే భూమిని ‘పన్నస’అంటారు.పన్నాస,పన్నవిస అనురూపములలో కూడనిది ప్రాచీన తెలుగు శాసనములందు కనుపించును.

‘కొణ్డకాత్తి೯క ‘అను పదంలో ‘కొణ్డ’అంటే సరిగా తెలియదు.తిథి, వరాలు, నక్షత్రము, హోర చెప్పబడినవి.పుణరుపుష్యం అంటే పునర్వసు నక్షత్రమని అర్థము.తమిళంలో కూడా దీనిని ‘పునర్పూశం’అంటారు. సీమవారమనిన్నీ ,బృగస్పతిహోర అనిన్నీ చెప్పబడి నవి. శాసనాల్లో వారము,హోర చెప్పుట యిదే మొదలనిపిస్తుంది.కనీసం వారము పేరు చెప్పుట కూడ ఇంతకు ముందు శాసనాల్లో కానరాదు.

చదవండి :  తంగేడుపల్లి శాసనము

ఏబది అని సంఖ్య మాత్రమే చెప్పబడింది.సందర్భమును బట్టి ‘మఱుతర్లు ‘అను భూపరిమాణముగా గ్రహించవలెను.చామణకాలు అనే ఉద్యోగియొక్క ‘ధ ‘ అంటే ‘ధర్మము ‘అని ప్రాకృతశాసనాల్లో సూక్ష్మముగా వ్రాయుట కలదు.కనుక అట్లే యిక్కడకూడ గ్రహించవచ్చును.

‘రేనాణ్డేళుచుండగా’ అనుటను బదులు ‘రేనాణ్డేళుచు’అని వ్రాయటము, తుదిలో ‘చామణకాల(ధర్మము)’అని క్రియ లేకుండా వాక్యం ముగియుట ఇవి రచనలోని లోపములు. వాక్యరచన సరిగా రూపొందలేదని స్పష్టంగా తెలుస్తోంది.వీరిశాసనాలన్నీ యించుమించుగా ఇట్లే యుండును.కొన్నిపదా లకి సరిగా అర్థం తెలియక పోవటమేగాక వాక్యాల్లో కర్త,క్రియ,కర్మలను తెలుపు పదాలు కూడ స్పష్టంగా ఉండవు.క్రొత్తగా భాషను తయారు చేసు కొనే కాలమది.ఈ మాత్రం శాసనం వ్రాయటమే చాలా గొప్ప ఆనాడు.

ఈ పుణ్యకుమారుని కొడుకు మొదటి విక్రమాదిత్యుడు,ఇతని కొడుకు శక్తి కుమారుడు,ఇతని కొడుకు రెండవ విక్రమాదిత్యుడు.ఇతని కొడుకు సత్యాదిత్యుడు.’విక్రమాదిత్య’ అను పేర్లు వచ్చినప్పుటినుండి వీరు బాదమి చాళుక్యులకు సామంతులైనట్లు తెలుస్తుంది.బాదామి చాళుక్య రెండవ పులకేశి వల్లభుని(611-643) కొడుకు మొదటి విక్రమాదిత్యుడు క్రీ.శ.678 వరకు రాజ్యమేలెను.తరువాత అతని కొడుకు వినయాదిత్యుడు,ఇతని కొడుకు రెండవ విజయాదిత్యుడు వరుసగా రాజ్యమేలిరి.విజయాదిత్యుని కొడుకు రెండవ విక్రమాదిత్యుడు క్రీ.శ732 లో రాజయ్యెను.

జి. పరబ్రహ్మశాస్త్రి

(సౌజన్యం: తెలుగు శాసనాలు, ఆం.ప్ర సాహిత్య అకాడమీ ప్రచురణ)

ఇదీ చదవండి!

మాలెపాడు శాసనము

మాలెపాడు శాసనము

ప్రదేశము: మాలెపాడు గ్రామము, ఎర్రగుంట్ల మండలం, కమలాపురం తాలూకా, కడప జిల్లా శాసన కాలం: క్రీ.శ. 725 శాసన పాఠం: మొదటి …

Leave a Reply

Your email address will not be published.

CAPTCHA * Time limit is exhausted. Please reload CAPTCHA.

error: