తెదేపా పరిస్థితి దయనీయం

కడప లోక్‌సభ, పులివెందుల శాసనసభనియోజకవర్గాలకు జరిగిన ఉప ఎన్నికల్లో సైకిల్‌ పంక్చర్ అయ్యింది. ఫ్యాన్‌ హోరుకు సైకిల్‌ ఎదురు నిలువలేకపోయింది.

జమ్మలమడుగు నియోజకవర్గంలో మాత్రం తెదేపా నియోజకవర్గ బాధ్యులు రామసుబ్బారెడ్డి డిపాజిట్ దక్కే స్థాయిలో ఓట్లు సాధించగలిగారు. కడప, మైదుకూర్‌, బద్వేల్‌ నియోజకవర్గాల్లో తెదేపా అత్యంత దయనీయమైన స్థితికి పడిపోయింది.

 

లోక్‌సభ పరిధిలో 10,29,423 ఓట్లు పోలయ్యాయి. వీటిలో పదహారోవంతు.. అంటే 1,71,570 ఓట్లు వస్తే డిపాజిట్ సాధించినట్లే.

చదవండి :  జూన్ 1కి వాయిదా పడ్డ యో.వే.వి ఇన్ స్టంట్ పరీక్షలు

మైసూరారెడ్డికి 1,27,183 ఓట్లు అంటే 12.35 శాతం మాత్రమే వచ్చాయి. పులివెందుల శాసనసభ నియోజకవర్గంలో తెదేపా అభ్యర్ధి బిటెక్‌ రవి ఘోర పరాజయం పాలయ్యారు. ఆయనకు 12050 ఓట్లు మాత్రమే వచ్చాయి. అక్కడ డిపాజిట్‌ దక్కించుకోవాలంటే 26046 ఓట్లు తెచ్చుకోవాలి. ఆయనకు కేవలం 7.7 శాతం ఓట్లు మాత్రమే వచ్చాయి.

 

లోక్‌సభ పరిధిలోని ఏడు నియోజకవర్గాల వారీగా తెదేపాకు వచ్చిన ఓట్లను పరిశీలిస్తే కేవలం జమ్మలమడుగు నియోజకవర్గంలో మాత్రమే ఆ పార్టీకి డిపాజిట్‌ దక్కింది. మిగిలిన ఆరు సెగ్మెంట్లలో పరిస్థితి కనిష్ఠ స్థాయికి పడిపోయింది.

చదవండి :  సీమ సమస్యలపై ప్రశ్నించినందుకు దాడి

బయలుదేరు సమయంనుండి వరకురైలు నెంబర్ రైలు పేరుచేరు సమయంప్రయాణ సమయంప్రయాణించే రోజులు

ఇదీ చదవండి!

రాయలసీమపై టీడీపీ

రాయలసీమపై టీడీపీ కక్ష తీర్చుకుంటోంది : బిజెపి

కడప : రాయలసీమ కోసం తెలుగుదేశం నేతలు దొంగ దీక్షలు, యుద్ధాలు చేయాల్సిన అవసరం లేదని బీజేవైఎం అధ్యక్షుడు విష్ణువర్థన్‌ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

CAPTCHA * Time limit is exhausted. Please reload CAPTCHA.

error: