తెలుగు సాహిత్యం తీరుతెన్నులపై జాతీయ సదస్సు

యోగివేమన విశ్వవిద్యాలయం తెలుగుశాఖ ఆధ్వర్యంలో ’21వ శతాబ్దిలో తెలుగు సాహిత్యం తీరుతెన్నులు’ అనే అంశంపై జాతీయ సదస్సు సి.వి.రామన్ విజ్ఞాన భవన్‌లోని సదస్సుల గదిలో బుధవారం మొదలైంది. ఆచార్య రాచపాళెం చంద్రశేఖర్‌రెడ్డి అధ్యక్షోపన్యాసం చేస్తూ సమాజ కోణం నుంచి సాహిత్యాన్ని అధ్యయనం చేయాల్సిన అవసరాన్ని వివరించారు.

ఈ సదస్సులో పాల్గొన్న ఆచార్య కుసుమకుమారి మాట్లాడుతూ వికీపిడియా వంటి వెబ్‌సైట్‌లు వేల పుటల్ని సాహిత్య అభిమానులకు అందిస్తున్నాయని వివరించారు. అలాంటి మాధ్యమాలను తెలుగు రచయితలు, పరిశోధకులు తప్పక ఉపయోగించుకోవాలన్నారు.

చదవండి :  ఆయన మొండిగా వ్యవహరిస్తున్నారు...

ముఖ్య అతిథిగా హాజరైన యోగివేమన విశ్వవిద్యాలయ ఉపకులపతి ఆచార్య బేతనభట్ల శ్యామసుందర్ మాట్లాడుతూ పరిశోధనలలో పొరబాట్లు జరిగితే ఎంతనష్టమో అలాంటి మాటలను ప్రయోగిస్తే అంతేనష్టమన్నారు. మాట ప్రాధాన్యం ఎంతుంటుందో అంతే స్థాయిలో ప్రమాదకరంగా ఉంటుందన్నారు. సాహిత్యంలో ఉపయోగించే పదాలపట్ల జాగరుకతతో వ్యవహరించాలన్నారు.

ప్రపంచీకరణ మనిషి ఉనికిని ప్రశ్నార్థకం చేసిందని- దాని ప్రభావం సాహిత్యంపై బలంగా ఉందని ఆచార్య మేడిపల్లి రవికుమార్ తన కీలకోపన్యాసంలో వివరించారు. సాహిత్య ప్రక్రియల్లో స్పష్టంగా కనిపించే మార్పుల్ని సోదాహరణంగా ఎత్తిచూపారు.

చదవండి :  కామిశెట్టి శ్రీనివాసులు ఇక లేరు

ప్రధానాచార్యుడు ధనుంజయనాయుడు, కులసచివులు ఆచార్య వాసంతి మాట్లాడుతూ అందరికీ అర్థమయ్యే రీతిలో రచనలు సాగాలన్నారు. సదస్సు కన్వీనరు డాక్టరు పి.రమాదేవి సదస్సు లక్ష్యాలు వివరించారు.

తెలుగు శాఖ సమన్వయకర్త డాక్టర్ ఎన్.ఈశ్వరరెడ్డి సదస్సు నిర్వహించారు.

బోధనారంగ ప్రముఖులు టి.రామప్రసాద్‌రెడ్డి, జి.పార్వతి, ఎం.ఎం.వినోదిని, విద్వాన్ కట్టానరసింహులు, పరిశోధక విద్యార్థులు, ఎంఏ విద్యార్థులు, ఇతరా శాఖల అధ్యాపకులు పాల్గొన్నారు. పొట్టిశ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయ ప్రముఖుడు చిగిచర్ల కృష్ణారెడ్డి జానపద పరిశోధనావశ్యకతను వివరించారు.

ఇదీ చదవండి!

రాయలసీమ మహాసభ

దుమ్ముగూడెంను జాతీయ ప్రాజెక్టుగా ప్రకటించాల

కడప: దుమ్ముగూడెం-నాగార్జునసాగర్ టెయిల్‌పాండ్ ప్రాజెక్టును కేంద్రం తక్షణమే జాతీయ ప్రాజెక్టుగా ప్రకటించాలని రాయలసీమ మహాసభ తీర్మానించింది.  స్థానిక సీపీ బ్రౌన్ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

CAPTCHA * Time limit is exhausted. Please reload CAPTCHA.

error: