త్యాగానికి మరోపేరు …

టంగుటూరి ప్రకాశం పంతు లుగారిని స్ఫూర్తిగా తీసు కొని దేశం కోసం ఏ త్యాగం చేయ డానికైన సిద్ధపడిన వీరవనిత కడప రామ సుబ్బమ్మ. కడప జిల్లా, జమ్మలమడుగు తాలూకాలోని సుద్దపల్లె వీరి జన్మస్థలం. 1902లో కొనుదుల రామచంద్రారెడ్డి, అచ్చమాంబల కుమార్తెగా జన్మిం చారు.ఆమె 15వ ఏట, 19 17లో కడప కోటిరెడ్డితో వివాహం అయింది. ఆయన లండన్‌ యూని వర్సిటీలో ఎల్‌.ఎల్‌.బి.,ఆక్స్‌ఫర్డు యూనివర్సిటీలొ బి.సి.ఎల్‌. పట్టాలు పోంది బార్‌ఎట్‌లా అయినారు.

విదేశాలకు వెళ్లి చదివివచ్చిన ఆనాటి యువకులు అనేకమంది మాదిరి ఆయనకూడా దేశభక్తి, జాతీయా భిమానం పుష్కలంగా సమకూర్చుకున్నారు.ఆ సద్భావాలన్నీ రామసుబ్బమ్మకీ కలిగించారు. ఫలితంగా ఆమె 1921నాటినుంచే కాంగ్రేసులో చేరి జాతీయోద్యమంలో పాల్గొ న్నారు.

1928ఫిబ్రవరి 3న సైమన్‌ కమిషన్‌ బహిష్కరణ,నిరసన ప్రదర్శనాలు మద్రాసులో జరిగినవి. మద్రాసు పౌరులు వెల్లువలాగ వీధులలో ప్రవేశించి నిరసన ప్రదర్శనాలు జరుపుతున్నారు. హైకోర్టు సమీ పాన ఈ ప్రదర్శన ఆపటానికి తెల్ల సోల్జర్లు కాల్పులు ఆరంభించారు. ఒక అజ్ఞాత వీరుడు నెలకొరిగాడు. రామసుబ్బమ్మగారు, కోటిరెడ్డిగారు, టంగు టూరి ప్రకాశం పంతులుగారు వంటి ఆంధ్ర ప్రముఖులంతా ఆ జనసందోహంలోనే వున్నారు.

చదవండి :  యోగిపుంగవులు "జ్యోతి" శ్రీ కాశిరెడ్డి నాయన !

సోల్జర్ల దురాగతాన్ని మరి చూడలేక గాంధీజీ శాంతి సమర యోధుడయిన ప్రకాశం పంతులుగారు‘‘ఎవరురా నా ప్రజలను కాల్చుతున్నది. నన్నుకాల్చిన తరువాత ధైర్యముంటే నా ప్రజలను కాల్చండి’’ అంటూ చొక్కా గుండీలువిప్పి ఛాతీని తుపాకులకు అడ్డుపెట్టారు. ఆగర్జనే, ఆ నిస్వార్థ శౌర్య ప్రదర్శనే ఆయనను ఆంధ్రకేసరిగా ఆంధ్రుల హృదయాలలో నిల్పింది.ఆ దృశ్యం రామసుబ్బమ్మగారి హృదయంలో చెరగని ముద్ర వేసింది. దేశంకోసం యెంతటి త్యాగం చేయవలసివచ్చినా వెనుకాడలసిన అవసరం లేదని నిశ్చయించు కున్నారు.

1930లో ఉప సత్యాగ్రహం ఆరంభమయింది. దువ్వూరి సుబ్బమ్మ, ఉన్నవ లక్ష్మీబాయమ్మ, పోణకా కనకమ్మ, దుర్గా బాయమ్మ, ద్రోణంరాజు లక్ష్మీబాయమ్మలతోను బులుసు సాంబమూర్తి, భోగరాజు పట్టాభిసీతా రామయ్య, ప్రకాశంపంతులు, కళావెంకట్రావుల వంటి దేశభక్తులతో, అగ్ర ఆంధ్రనాయకులతో వలసి ఉద్యమంలో పాల్గొనగలగటమే కాక పొటీలుపడి అత్యుత్సాహంతో వుద్యమం నడిపించిన ఘట్టాలు రామసుబ్బమ్మ జ్ఞాపకాల పేటికలో అమూల్యంగా దాచుకున్నారు.

1941లో జరిగిన వ్యక్తిగత సత్యాగ్రహంలో భర్తతోపాటు ఆమె పాల్గొన్నారు. ఆయనను అరెస్టుచేసి జైలు శిక్షవేశారు. 1938డిసెంబరులో ఆమె కాంగ్రెసు తరపున కడపజిల్లా బోర్డు ప్రెసిడెంటుగా ఎన్నికయినారు. ఆపదవికి భారతదేశం మొత్తం మీద ఎన్నికయిన మొదటి మహిళ ఆమె. 15 ఆగష్టూ 1943 వరకు ఆ పదవిని సమర్ధవంతంగా నిర్వహించి ఆంధ్ర మహిళల దక్షతకు మరోక నిదర్శనం కల్పించారు.క్విట్టిండియా సందర్భంలో పూజ్య బాపు ఆదేశానుసారం ఆ హోదాను ఆమె త్యజించారు.ఆంధ్రుల చర్త్రిలో ఆంధ్రోద్యమం చాలా ప్రధాన ఘట్టం. దేశవ్యాప్తంగా స్వరాజ్య వుద్యమ ప్రచారంలోకి రాకముందే ఆంధ్రులు తమదంటు ఒక రాష్ర్టం తమకుకావాలని తపించారు. 1918నాటికే పోణకా కనకమ్మ, ఉన్నవ లకీబాయమ్మ ,ఆచంట లకీపతి, కాశీనాథుని నాగేశ్వరరావుగార్లు తరచు నెల్లూరులో సమావేశమై తీవ్రచర్చలు జరుపుతుండేవారు.

చదవండి :  సహృదయ శిరోమణి డాక్టర్ బాలశౌరిరెడ్డి

ఇంతలో గాంధీ మహాత్ముని స్వాతం్త్ర్యసమర పిలుపు వినవచ్చింది.అదరూ జాతీయోద్యమంలో పాల్గో న్నారు. నిరవధికంగా కృషి చేస్తున్నా అవకాశం కలిగినప్పడు ఆంధ్ర రాష్ర్టం గురించిన ఆలోచనలు జరుపు తునే వున్నారు. రామసుబ్బమ్మ, కోటిరెడ్డి పుట్టి పెరిగిన రాయలసీమను ఆనాడు దత్త మండలం అని పిల్చేవారు. అది ఆంధ్రుల పౌరుషానికి తక్కువగా అనిపించిన కారణంగా గాడిచర్ల హరిసర్వోత్తమరావు, కల్లూరి సుబ్బారావు, కోటిరెడ్డి, నివర్తి మృత్యుంజయశాస్త్రీ మరి అనేకులు పాల్లోన్న నంద్యాల రాజకీయ మహాసభలో దత్తమండలాలు అనేపేరు శాశ్వతంగా తొలగించి, రాయలుయేలిన రత్నాలసీమ కావటాన రాయలసీమ అని నామకరణం చేశారు. అదే శాశ్వతమై నిల్చింది.

చదవండి :  సర్ థామస్ మన్రో - 2

ఆదినుంచి ఆంధ్రోద్యమంతో గట్టి సంబంధం పెట్టుకున్న కారణంగా రామసుబ్బమ్మ ఆంధ్ర రాష్ట్రోద్యమానికి ఉపాధ్యక్షులుగా దేశమంత తిరిగి మహాసభలు యేర్పాటు చేసి ప్రజలలో జాగృతిని కలిగించారు. ఆమెను ఏకబిగిన 40 సంవత్సరాలపాటు కడప పురపాలక సంఘసభ్యురాలుగా ఎన్నుకున్నారు. కడపలో స్త్రీల కళాశాలస్ధాపనలో ఆమె ప్రధాన భూమిక పోషించారు. లక్షరూపాయలు స్వయంగా విరాళం యిచ్చారు.

అంధుల కోసం కడపలో ఒక హైస్కూలు నెలకొల్పటంలోకూడ ఆమె పాత్ర ఎంతో ఉంది. ఆమె ఆలిండియా సోషల్‌ వెల్‌ఫేర్‌ బోర్డు సభ్యురాలుగా, రాష్ట్ర సంఘ సంక్షేమ సంఘంలో సభ్యులుగా, గిల్డు ఆఫ్‌ సర్వీస్‌ అధ్యక్షులుగా వున్నారు.ఉమ్మడి రాష్ట క్రాంగ్రెసు సంఘ సభ్యులుగా 20 సంవత్సరాలు పనిచేశారు. అఖిలభారత స్ర్తీల కాంగ్రెసు కార్యనిర్వహక వర్గ సభ్యురాలుగా, ఆంధ్ర రాష్ట్ర సంఘ అధ్యక్షురాలుగా సేవ చేశారు.

– షేక్‌ అబ్దుల్‌ హకీం జాని

ఇదీ చదవండి!

డాక్టర్‌ ఆవుల చక్రవర్తి

జిల్లాలో చరిత్ర సృష్టించిన మహానుభావులెంతోమంది వున్నా ఫ్యాక్షన్‌ సినిమాల పుణ్యమా అని కడప పేరు వింటేనే గుండెలు పేలిపోతాయి… కడప …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

CAPTCHA * Time limit is exhausted. Please reload CAPTCHA.

error: