హోమ్ » వార్తలు » జవివే ఆధ్వర్యంలో ‘దోమకాటు’ కరపత్రం ఆవిష్కరణ
దోమకాటు కరపత్రం ఆవిష్కరణ
దోమకాటు కరపత్రం ఆవిష్కరణ

జవివే ఆధ్వర్యంలో ‘దోమకాటు’ కరపత్రం ఆవిష్కరణ

ప్రొద్దుటూరు: దోమకాటు వలన వ్యాప్తి చెందే జబ్బుల  గురించి ప్రజలలో అవగాహన కలిగించేందుకు జనవిజ్ఞాన వేదిక కడప జిల్లా కమిటీ ‘దోమకాటు – మనిషికి చేటు’ పేర రూపొందించిన కరపత్రం ఆవిష్కరణ బుధవారం పట్టణంలో జరిగింది.

స్థానిక రవి నర్సింగ్ హోంలో జరిగిన ఈ కార్యక్రమంలో డా.రామ్మోహన్ రెడ్డి, డా.చంద్రమోహన్ లు మాట్లాడుతూ… ఒక్క డెంగ్యూ జ్వరం వచ్చినప్పుడే కాకుండా ఇతర జ్వరాలు వచ్చినపుడు కూడా రక్తకణాల  (ప్లేట్లెట్స్) సంఖ్య తగ్గుతుందని, ఈ విషయంపైన ప్రజలు అవగాహన్ పెంచుకోవాలన్నారు. అన్ని సందర్భాలలో రక్తకణాలు ఎక్కించాల్సిన అవసరం లేదన్నారు. చర్మంపై ఎర్రని మచ్చలు, మలం నల్లగా రావడం, ముక్కు నుండి, చిగుర్ల నుండి రక్తం రావడం వంటి లక్షణాలు ఉన్నప్పుడే రక్తకణాలు ఎక్కించాలన్నారు. దోమల ద్వారా జ్వరాలతో పాటు బోదకాలు, మెదడువాపు వంటి వ్యాధులు కూడా వస్తాయన్నారు. పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవడం, దోమతెరలను వాడడం ద్వారా దోమకాటు వలన కలిగే వ్యాధులను నివారించవచ్చన్నారు.

చదవండి :  యోగివేమన విశ్వవిద్యాలయానికి నూతన ఉపకులపతి

జవివే రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు తవ్వా సురేష్ రెడ్డి మాట్లాడుతూ… ముందు జాగ్రత్త కోసమని అవసరం లేని సందర్భాల్లో రక్తకణాలు ఎక్కించడం మానుకోవాలన్నారు. జ్వరాల బారిన  పడ్డవారు అర్హత లేని వైద్యులు ఇచ్చే మందులను వాడి ప్రాణాల మీదికి తెచ్చుకోవద్దన్నారు. దోమలను అరికట్టేందుకు పురపాలక సంఘం వారు తగిన చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.

కార్యక్రమంలో జవివే సభ్యులు ఖలందర్, సూర్యనారాయరెడ్డి, ఎడిటర్ ఉత్తమారెడ్డిలు పాల్గొన్నారు.

విడుదల చేసిన కరపత్రం ఇదే:

దోమకాటు

దోమకాటు

ఇదీ చదవండి!

మురళి వూదే పాపడు

‘మురళి వూదే పాపడు’ని ఆవిష్కరించిన రమణారెడ్డి

మురళి వూదే పాపడు కథల సంపుటి ఆవిష్కరణ సామాజిక మార్పును ప్రతిబింబించే దాదా హయాత్ కథలు : సింగమనేని  ప్రొద్దుటూరు …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

CAPTCHA * Time limit is exhausted. Please reload CAPTCHA.

error: