2013లో కడప జిల్లాలో IPC (Indian Penal Code) కింద నమోదైన నేరాల రేటు 222.4గా ఉంది. నేరాల రేటును లక్ష మంది జనాభాను ప్రాతిపదికగా తీసుకుని లెక్కిస్తారు. అదే సంవత్సరం ఆం.ప్ర రాష్ట్రంలో సగటు నేరాల రేటు 244.5గా ఉంది.
2013వ సంవత్సరంలో కృష్ణా (254.1), గుంటూరు అర్బన్ (388.1), నెల్లూరు (232.6), విశాఖపట్నం (297.3), చిత్తూరు (తిరుపతితో కూడిన), రాజమండ్రి నగరం(239.4), విజయవాడ నగరం (416.2), రంగారెడ్డి, నిజామాబాద్ (269.6), నల్గొండ (277.0), ఖమ్మం (353.7), హైదరాబాదు నగరం (377.1), వరంగల్ అర్బన్ (346.9), రూరల్ (217) జిల్లాలు కడప జిల్లా కన్నాఅధిక నేరాల రేటును నమోదు చేశాయి.
కడప జిల్లాలో నేర నిర్దారణ శాతం (Conviction percentage) అంటే మోపబడిన నేరాలలో కోర్టుల వరకూ వెళ్లి నిరూపితం అయిన వాటి శాతం 19.6 (ఇది ఆం.ప్ర సగటు నేర నిర్ధారణ శాతం 26.9 కన్నా చాలా తక్కువ).
కడప జిల్లాలో వివిధ నేరాలకు సంబంధించి 2011, 2012 మరియు 2013లలో నమోదైన కేసుల గణాంకాలు.
[table id=3 /](ఆధారం: ఆం.ప్ర పోలీసు శాఖ వారి 2013 నేర గణాంకాలు)