వివిధ రకాలైన నేరాల సంఖ్య ఎక్కడ ఎక్కువ?

నిన్న ‘పారిశ్రామికవేత్తలు భయపడుతున్నారా?’ అని మేము ప్రచురించిన విశ్లేషణను చదివిన కొంతమంది ఇలా చెబుతున్నారు, నేరాల రేటు కాదు కడపలో హత్యలూ, మానభంగాలు లాంటి వాటిలో కడప జిల్లా స్థానం సంగతి చెప్పండి  అనీ. వీటి ప్రాతిపదికగానే గౌరవ ముఖ్యమంత్రి గారు కడప జిల్లాకు సదరు కీర్తిని కట్టబెట్టారు అనీ. 2013 నేర గణాంకాల ప్రకారం అం.ప్ర లో వివిధ రకాల నేరాల తీవ్రతను అధికంగా కలిగిన జిల్లాలు…

మానభంగాలు లేదా అత్యాచారాలు:

మొదటి స్థానం సైబరాబాద్ (131), రెండో స్థానం తూర్పుగోదావరి (117), మూడో స్థానం మహబూబ్ నగర్ (113)

చదవండి :  ప్రొద్దుటూరులో వరుస దొంగతనాలు

హత్యలు:

మొదటి స్థానం మహబూబ్ నగర్ (163), రెండో స్థానం అనంతపురం (147), మూడో స్థానం సైబరాబాద్ (143)

అపహరణలు:

మొదటి స్థానం సైబరాబాద్ (170), రెండో స్థానం హైదరాబాదు నగరం (120), మూడో స్థానం అనంతపురం (103)

నకిలీ నోట్ల చలామణీ:

మొదటి స్థానం హైదరాబాదు నగరం (44), రెండో స్థానం కృష్ణా జిల్లా (12), సైబరాబాద్ (12), మూడో స్థానం

మహిళల మీద జరిగిన నేరాలు:

మొదటి స్థానం సైబరాబాద్ (2317), రెండో స్థానం హైదరాబాదు నగరం (1802), మూడో స్థానం విజయవాడ నగరం (1558)

చదవండి :  కాలేజీ పిల్లోల్లకు కథ, కవితల పోటీలు

నమ్మకద్రోహం:

మొదటి స్థానం సైబరాబాద్ (149), రెండో స్థానం నెల్లూరు (113), మూడో స్థానం విజయవాడ నగరం (104)

మోసాలు:

మొదటి స్థానం హైదరాబాదు నగరం (2122), రెండో స్థానం సైబరాబాద్ (1848), మూడో స్థానం ఖమ్మం (547)

గమనిక: ఈ రకంగా ఒక ప్రాంతంలో జరిగిన ఘటనల సంఖ్య ఆధారంగా శాంతిభద్రతలు అధ్వాన్నంగా లేదా మెరుగ్గా ఉన్నాయి చెప్పడం సహేతుకం కాదు. ఎందుకంటే జనాభా ఎక్కువగా ఉన్న ప్రాంతంలో సహజంగా అధిక సంఖ్యలో నేరాలు నమోదవుతాయి. అందువల్ల అవి ఎప్పుడూ మొదటి స్థానంలోనే కనిపిస్తాయి. ఈ కారణం చేతనే జనాభాను ప్రాతిపదికను తీసుకుని నేరాల రేటును లెక్కిస్తారు. తద్వారా ఆయా ప్రాంతాలలో శాంతి భద్రతల పరిస్తితిని అంచనా వేసేదానికి ప్రభుత్వానికి, పోలీసులకు వీలుపడుతుంది. కాబట్టే నేరాల రేటును ప్రాతిపదికగా తీసుకుని శాంతిభద్రతల పరిస్తితిని అంచనా వెయ్యటం సహేతుకం.

చదవండి :  'సీమ ప్రజల గొంతు నొక్కినారు'

Leave a Reply

Your email address will not be published.

CAPTCHA * Time limit is exhausted. Please reload CAPTCHA.

error: