‘పట్టిసీమ’ పేరుతో సీమను దగా చేస్తున్నారు

కడప: ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు పట్టిసీమ పేరుతో రాయలసీమను దగాచేస్తున్నారని తక్షణం పట్టిసీమకు స్వస్తి చెప్పాలని పలువురు వక్తలు డిమాండ్ చేశారు. ఇదే విషయమై ఈ నెల 20వ తేదీన జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుట ఆందోళన చేయాలని సమావేశంలో తీర్మానించారు.

బుధవారం నగరంలోని సీపీఐ జిల్లా కార్యాలయంలో ఆంధ్రప్రదేశ్ రైతుసంఘం జిల్లా అధ్యక్షుడు రామసుబ్బారెడ్డి అధ్యక్షతన ‘పట్టిసీమను పక్కనబెట్టి- రాయలసీమ ప్రాజెక్టులకు నిధులు పెంచి పూర్తిచేయాలి’ అనే అంశంపై అఖిలపక్ష రైతు సంఘాల రౌండ్‌టేబుల్ సమావేశం జరిగింది.

చదవండి :  వైఎస్సార్ క్రీడాపాఠశాలలో నాలుగో తరగతిలో ప్రవేశానికి ఎంపికలు

ఈ సందర్భంగా వక్తలు మాట్లాడుతూ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు రాయలసీమలో నిర్మాణంలో ఉన్న ప్రాజెక్టులకు నిధులు కేటాయించకుండా ఎన్నడూలేని పట్టిసీమ ఎత్తిపోతలను తెరపైకి తెచ్చారని వివరించారు. మూడు టీఎంసీల సామర్థ్యం ఉన్న ప్రకాశం బ్యారేజిలో గోదావరి వరదను నింపి కృష్ణానీటిపై ఒత్తిడి తగ్గించి శ్రీశైలం ద్వారా సీమకు నీళ్లిస్తామంటే నమ్మే స్థితిలో ప్రజలు లేరన్నారు.

ఈ అంశంపై మాట్లాడుతున్న ప్రధాన ప్రతిపక్షాన్ని, కడప జిల్లాను అవమానపరుస్తూ చంద్రబాబు తన వ్యతిరేకతను, అసహనాన్ని వ్యక్తం చేస్తున్నారని చెప్పారు. నిర్మాణ దశలో ఉన్న గాలేరు-నగరి, ఎద్దుల ఈశ్వర్‌రెడ్డి, హంద్రీనీవా, తెలుగుగంగ, వెలుగొండ ప్రాజెక్టులకు నిధులు కేటాయించి పూర్తిచేయగలిగితే సీమ సస్యశ్యామలం అవుతుందన్నారు.

చదవండి :  కోస్తా వారు చేస్తున్న మరో మోసమే 'పట్టిసీమ'

అసెంబ్లీలో ప్రవేశపెట్టిన బడ్జెట్ కేటాయింపుల్లో గాలేరు-నగరికి కేవలం రూ.169 కోట్లు కేటాయిస్తే ఎప్పటికి పూర్తవుతుందని ప్రశ్నించారు.

కార్యక్రమంలో కార్మిక, కర్షక సమితి నేత సీహెచ్ చంద్రశేఖర్‌రెడ్డి, సీపీఐ జిల్లా కార్యదర్శి ఈశ్వరయ్య, వైకాపా రైతు విభాగం జిల్లా కన్వీనర్ ప్రసాద్‌రెడ్డి, రైతు సంఘం జిల్లా కార్యదర్శి లింగమూర్తి, రైతుసంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి చంద్ర, నాయకులు రమణ, మనోహర్‌రెడ్డి, చంద్రశేఖర్‌రెడ్డి, బాలచంద్రనాయుడు, సుబ్బనారాయణ తదితరులు పాల్గొన్నారు.

ఇదీ చదవండి!

సీమపై వివక్ష

‘సీమ’పై వివక్ష ఇంకా ఎన్నాళ్లు?

‘వడ్డించేవాడు మనవాడైతే పంక్తిలో ఎక్కడ కూర్చున్నా ఫర్వాలేదు..’ అన్న సామెత రాయలసీమకు మాత్రం వర్తించదు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విభజన తర్వాత …

ఒక వ్యాఖ్య

  1. Ifully agree with yor argument.pattiseema project should be scraa
    pped,and only polavaram project should be completed.

Leave a Reply

Your email address will not be published.

CAPTCHA * Time limit is exhausted. Please reload CAPTCHA.

error: