కడప: నగరంలోని ప్రభుత్వ పురుషుల కళాశాలలో ఈ నెల 13న ప్రాంగణ ఎంపికలు నిర్వహిస్తున్నట్లు ప్రధానాచార్యులు డాక్టరు ఎన్.సుబ్బనర్సయ్య ఒక ప్రకటనలో తెలిపారు. ఎంపికలకు ఐసీఐసీఐ బ్యాంకు ప్రతినిధులు వస్తున్నారన్నారు. ఆ బ్యాంకులో సేల్స్ ఆఫీసరు ఉద్యోగాల కోసం ఎంపిక చేస్తారన్నారు. డిగ్రీ ఉత్తీర్ణులై 20 నుంచి 26 ఏళ్లలోపు వయసు ఉన్నవారు అర్హులన్నారు. ఆసక్తి ఉన్నవారు అన్నీరకాల అర్హతాపత్రాలతో నేరుగా హాజరుకావాలని సూచించారు.
ట్యాగ్లుarts college campus recruitment kadapa కడప
ఇదీ చదవండి!
మట్లి (సిద్ధవటం) రాజుల అష్టదిగ్గజాలు
సిద్ధవటం రాజుల అష్టదిగ్గజాలు నా నీతిని వినని వానిని – వానను తడవని వానిని కననురా కుందవరపు కవి చౌడప్పా- …