బ్రహ్మణి ఉక్కు పరిశ్రమకు శంకుస్థాపన చేస్తున్న నాటి ముఖ్యమంత్రి వైఎస్

బ్రహ్మణీకి ప్రత్యామ్నాయంగా ఉక్కు కర్మాగారం ఏర్పాటు చేయాలి

బ్రహ్మణీకి కేటాయించిన స్థలంలోనే సెయిల్ ఆధ్వర్యంలో ప్రభుత్వం వెంటనే ఉక్కు కర్మాగారం నిర్మాణం చేపట్టాలని కోరుతూ త్వరలో ఉద్యమానికి శ్రీకారం చుట్టనున్నట్లు రాయలసీమ జాయింట్ యాక్షన్ కమిటీ ప్రెసిడెంట్, మాజీ ఎమ్మెల్యే డాక్టర్ ఎంవీ రమణారెడ్డి తెలిపారు. స్థానిక తన స్వగృహంలో రాయలసీమ జాయింట్ యాక్షన్ కమిటీ ప్రతినిధుల సమావేశం ఆదివారం నిర్వహించారు.

సమావేశం అనంతరం వివరాలను ఆయన మీడియాకు వెల్లడించారు. 2 లక్షల మంది నిరుద్యోగులకు ఉపాధి కల్పించాలనే లక్ష్యంతో బ్రహ్మణీ ఉక్కు కర్మాగారం నిర్మాణాన్ని చేపట్టడం జరిగిందన్నారు. ప్రస్తుత ప్రభుత్వం ఈ భూములను స్వాధీనం చేసుకోవడంతో నిరుద్యోగుల ఆశలు అడియాశలయ్యాయన్నారు.

చదవండి :  'ఉక్కు' నివేదిక ఏమైంది?

ఉక్కు కర్మాగారం కోసం ఇప్పటికే సుమారు రూ. 1200 కోట్లు ఖర్చుచేశారన్నారు. అలాగే ఈ కర్మాగారం కోసం ఓబులాపురం గనులను కేటాయించడంతోపాటు ప్రభుత్వం 2 టీఎంసీల నీటిని కూడా కేటాయించిందన్నారు. ఈ కారణంగా స్వాధీనం చేసుకున్న భూములను ప్రభుత్వం వెంటనే స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా (సెయిల్)కు అప్పగించి అన్ని విధాలా అనువైన ఈ ప్రదేశంలోనే ఉక్కుకర్మాగారాన్ని నిర్మించాలని డిమాండ్ చేశారు. ఈ విషయమై పూర్తి సమాచారాన్ని సేకరించి త్వరలో జాయింట్ యాక్షన్ కమిటీ బృందం ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డిని కలవనున్నట్లు ఆయన వివరించారు.

చదవండి :  'పాయలోపల్లి'లో చిరుతల సంచారం

సీఎం స్పందనను బట్టి ఉక్కు కర్మాగారం నిర్మాణంపై గ్రామీణ స్థాయి నుంచి ప్రజలను చైతన్యపరచి ఉద్యమం చేయాలని సమావేశంలో నిర్ణయించామన్నారు. వైస్ ైఛైర్మన్ భూమన్ మాట్లాడుతూ నిరుద్యోగుల కోసం ప్రభుత్వం వెంటనే బ్రహ్మణీ ఉక్కు కర్మాగారాన్ని నిర్మించాలని కోరారు. రాయలసీమ ప్రాంతంలోని యువత ఈ కర్మాగారం కోసం ఎన్నో ఆశలు పెట్టుకుందన్నారు. కార్యదర్శి, మాజీ ఎమ్మెల్సీ వెంకట శివారెడ్డి మాట్లాడుతూ ఇదే విషయంపై సోమవారం కడపలో అఖిల పక్ష కమిటీ సమావేశాన్ని నిర్వహించి ఉద్యమాన్ని ముందుకు తీసుకు వెళతామని తెలిపారు.

చదవండి :  ఉక్కు పరిశ్రమను తరలిస్తే అడ్డుకుంటాం : సిపిఎం

కమిటీ వైస్ ప్రెసిడెంట్‌గా ఉన్న కుంచెం వెంకట సుబ్బారెడ్డి తన పదవికి రాజీనామా చేశారని, ఏకగ్రీవంగా ఆయన రాజీనామాను ఆమోదించినట్లు ఈ సందర్భంగా వారు తెలిపారు. సమావేశంలో జేఏసీ వైస్ ప్రెసిడెంట్ లెక్కల వెంకటరెడ్డి, సెక్రటరీ బొజ్జా దశరథ్‌రెడ్డి, చీఫ్ కో ఆర్డినేటర్‌లు తమ్మడపల్లి విజయరాజ్, కే.వేణుగోపాల్‌రెడ్డి, ఎగ్జిక్యూటివ్ మెంబర్లు డాక్టర్ మల్లిఖార్జునరెడ్డి, తాటిపాడు మాబుసాహెబ్, శ్రీకాంత్ (ఎస్‌వీ యూనివర్సిటీ), పోలు కొండారెడ్డి, వీరనారాయణరెడ్డి, సుధాకర్‌రావు, హుసేనయ్యపాల్గొన్నారు.

ఇదీ చదవండి!

Steel Authority of India

ఉక్కు కర్మాగారం ఏర్పాటు పరిశీలనకై వచ్చిన సెయిల్‌ బృందం

కడప: జిల్లాలో ఉక్కు కార్మాగారం ఏర్పాటుకు ఉన్న అనుకూల, అననుకూల పరిస్థితులపరిశీలకై జిల్లాకు వచ్చిన 8 మంది సెయిల్‌(Steel Athority …

Leave a Reply

Your email address will not be published.

CAPTCHA * Time limit is exhausted. Please reload CAPTCHA.

error: