పుష్పగిరి బ్రహ్మోత్సవాలు
పెన్నేటి గట్టున ఉన్న పుష్పగిరి చెన్నకేశవుని ఆలయం

ఈ రోజు నుండి పుష్పగిరి బ్రహ్మోత్సవాలు

కడప: ఈ రోజు నుండి పుష్పగిరి బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తున్నట్లు ఆలయ కార్యనిర్వహణాధికారి సురేష్‌కుమార్‌రెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. ఈ బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఈనెల 4వ తేదీ బుధవారం క్షేత్రాధిపతి వైద్యనాధేశ్వరస్వామి, క్షేత్రపాలకుడు చెన్నకేశవస్వాముల గర్భాలయంలో గణపతి పూజలు, పుణ్యాహవాచనం, అఖండ దీపారాధన, విశ్వక్షేనపూజ, మేధినీ పూజలతో ఉత్సవాలను ప్రారంభిస్తారు.

5వ తేదీ సాయంత్రం కొండపై వెలసిన చెన్నకేశవస్వామి ఆలయంలో ధ్వజారోహణ కార్యక్రమం, హోమాలు ఉంటాయి. 8న చందనోత్సవం నిర్వహిస్తారు.

అక్షతదియ తిరుణాల ఈ నెల 9న ప్రారంభమవుతుంది. అదే రోజు రాత్రి గరుడ వాహన సేవ మహోత్సవం ఉంటుంది. 10న హరిహరులకు కల్యాణాలు, 11వ తేదీ రథోత్సవం నిర్వహిస్తారు. 13న ఉదయం చక్రస్నానం, సాయంత్రం పుష్పయాగం నిర్వహిస్తారు.

చదవండి :  మాధవరంపోడులో గబ్బిలాలకు పూజలు

కడప: ఈ రోజు నుండి పుష్పగిరి క్షేత్రంలో బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తున్నట్లు ఆలయ ఈవో సురేష్‌కుమార్‌రెడ్డి తెలిపారు. ఈ బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఈనెల 4వ తేదీ బుధవారం క్షేత్రాధిపతి వైద్యనాధేశ్వరస్వామి, క్షేత్రపాలకుడు చెన్నకేశవస్వాముల గర్భాలయంలో గణపతి పూజలు, పుణ్యాహవాచనం, అఖండ దీపారాధన, విశ్వక్షేనపూజ, మేధినీ పూజలతో ఉత్సవాలను ప్రారంభిస్తారు.

5వ తేదీ సాయంత్రం కొండపై వెలసిన చెన్నకేశవస్వామి ఆలయంలో ధ్వజారోహణ కార్యక్రమం, హోమాలు ఉంటాయి. 8న చందనోత్సవం నిర్వహిస్తారు.

అక్షతదియ తిరుణాల ఈ నెల 9న ప్రారంభమవుతుంది. అదే రోజు రాత్రి గరుడ వాహన సేవ మహోత్సవం ఉంటుంది. 10న హరిహరులకు కల్యాణాలు, 11వ తేదీ రథోత్సవం నిర్వహిస్తారు. 13న ఉదయం చక్రస్నానం, సాయంత్రం పుష్పయాగం నిర్వహిస్తారు.

చదవండి :  కడప జిల్లాలో బౌద్ధ పర్యాటకం

Leave a Reply

Your email address will not be published.

CAPTCHA * Time limit is exhausted. Please reload CAPTCHA.

error: