ముఖ్యమంత్రి కిరణ్ చెప్పిన రహస్యం!

ఉపఎన్నికల ప్రచారంలో భాగంగా కడప జిల్లాలో పర్యటిస్తున్న ముఖ్యమంత్రి కిరణ్ ఆసక్తికరమైన విషయం చెప్పారు. తన తండ్రి అమరనాధరెడ్డి రాజకీయాలలో వై.ఎస్. రాజశేఖరరెడ్డి కన్నా సీనియర్ అని , వై.ఎస్.తండ్రి రాజారెడ్డి ఒకసారి జైలులో ఉంటే అమరనాధరెడ్డి విడిపించారని కిరణ్ చెప్పడం విశేషం.ఉపఎన్నికల ప్రచారంలో ఈ విషయం చెప్పడం ద్వారా కిరణ్ వైఎస్ కుటుంబం కంటే తమ కుటుంబం గొప్ప అని చెప్పదలుచుకున్నారా! లేక వ్యూహాత్మకంగా వైఎస్ కుటుంబానికి నేరచరిత్ర ఉందని చెప్పదలుచుకున్నారా!

చదవండి :  తెలుగు సాహిత్యం తీరుతెన్నులపై జాతీయ సదస్సు

జగన్ విషయంలో కూడా గతంలో శాసనసభలో తాను వాదించానని చెప్పిన కిరణ్ ఇప్పుడు తన తండ్రి రాజశేఖరరెడ్డి తండ్రిని రక్షించారని చెప్పడం ఆసక్తికరంగా ఉంది. ఈ విషయమై కాంగ్రెస్‌లోనే కొనసాగుతున్న వైఎస్ సోదరుడు వివేకానందరెడ్డి ఎలా స్పందిస్తారో?

కాగా పిసిసి అద్యక్షుడు బొత్స సత్యనారాయణ ఉప ఎన్నికల తర్వాత ముఖ్యమంత్రి మారతారని కొందరు వ్యాఖ్యానించడం అవగాహన లోపం అని అన్నారు. మాజీ మంత్రి శంకరరావు రెండు రోజుల క్రితం ఈ విషయాన్ని బహిరంగంగా చెప్పిన నేపధ్యంలో బొత్స ఈ వ్యాఖ్య చేశారు.

చదవండి :  కడప పెద్దదర్గాలో 'అల్లరి' నరేష్

సాక్షి మీడియాకు ప్రకటనలు నిలిపివేయడాన్ని బొత్స సమర్ధించారు.

ఇదీ చదవండి!

వైఎస్సార్

దైవత్వాన్ని నింపుకున్న మానవుడు వైఎస్సార్

డాక్టర్ వైఎస్సార్ (వైఎస్ రాజశేఖరరెడ్డి) ను నేను చూసింది కేవలం నాలుగు సార్లు. ఒంగోలుకు ఇందిరా గాంధీ వచ్చినపుడు ఆ …

Leave a Reply

Your email address will not be published.

CAPTCHA * Time limit is exhausted. Please reload CAPTCHA.

error: