యోగి వేమన విశ్వవిద్యాలయానికి యూజీసీ 12-బీ గుర్తింపు

కడప: కడపలోని యోగి వేమన విశ్వవిద్యాలయానికి యూనివర్శిటీస్ గ్రాంట్స్ కమిషన్( యూజీసీ) 12-బీ గుర్తింపు మంజూరు చేసింది. ఈ మేరకు సోమవారం ఉత్తర్వులు అందాయి. దీంతో వైవీయూ పరిపూర్ణ విశ్వవిద్యాలయంగా రూపుదిద్దుకుంది. వీసీ ఆచార్య అర్జుల రామచంద్రారెడ్డి 12-బీ గుర్తింపు కోసం చేసిన కృషి ఎట్టకేలకు ఫలించడంతో వర్శిటీ వర్గాలు హర్షం వ్యక్తం చేస్తున్నాయి. అధ్యాపకులు, అధ్యాపకేతర సిబ్బంది, విద్యార్థులు సోమవారం వీసీకి అభినందనలు తెలియజేశారు. 2006 మార్చి 9న వైవీయూ ఆవిర్బవించింది. దీంతోపాటు రాష్ట్రంలో తెలంగాణ (నిజామాబాద్), పాలమూరు (మహబూబ్‌నగర్), నన్నయ్య (రాజమండ్రి), మహాత్మాగాంధీ (నల్గొండ), శాతవాహన (కరీంనగర్), రాయలసీమ (కర్నూలు), అంబేద్కర్ (శ్రీకాకుళం), కృష్ణా (మచిలీపట్నం), విక్రం సింహపురి (నెల్లూరు) విశ్వవిద్యాలయాలు ఆవిర్భవించాయి. కాగా వైవీయూకు మాత్రమే యూజీసీ గుర్తింపు రావడం విశేషం.అభివృద్ధి, పక్కా ప్రణాళికకుతోడు వీసీ తనకున్న వ్యక్తిగత పరిచయాలను సైతం ఉపయోగించడం వల్ల జులైలో యూజీసీ కమిటీ వైవీయూను సందర్శించి సంతృప్తి వ్యక్తం చేసింది. ఆగస్టు 24వ తేదీన ఢిల్లీలో జరిగిన సమావేశంలొ వైవీయూకు 12-బీ గుర్తింపు ఇవ్వాలని యూజీసీ తీర్మానించింది. ఇక్కడి చదువుకున్న విద్యార్థుల పత్రాలు భారతదేశంలో అన్ని విశ్వవిద్యాలయాలలో గుర్తింపు లభించినట్లయ్యింది. చరిత్రకలిగిన విశ్వవిద్యాలయాల జాబితాలో వైవీయూ చేరిపోయింది. ఇకపై రాష్ట్ర ప్రభుత్వం అందించే నిధులే కాకుండా పంచవర్ష ప్రణాళికల్లో కేంద్ర ప్రభుత్వ విద్యకు కేటాయించే నిధులు విశ్వవిద్యాలయానికి అందుతాయి. పరిశోధనా ప్రాజెక్టులు, ఫెలోషిప్పులు, చరిత్ర కలిగిన కళాశాలలకు ఏమి అందుతాయో అవన్నీ ఈ విశ్వవిద్యాలయానికి సమకూరుతాయి. ఈ విశ్వవిద్యాలయం సరసన రాష్ట్రంలో మరో 9 విశ్వవిద్యాలయాలు ఏర్పాటైనా ఏ ఒక్క దానికి 12 బి గుర్తింపు పొందకముందే ఈ సంస్థకు లభించటం ప్రస్తావనార్హం.ఈ గుర్తింపు వల్ల 11వ పంచవర్ష ప్రణాళిక నిధులు కూడా వైవీయూకు లభిస్తాయి. ప్రభుత్వం విడుదల చేసే అన్ని రకాల నిధులు వైవీయూకు అందుతాయి.
1977 సంవత్సరంలో కడప పోస్టు గ్రాడ్యుయేషన్‌ కేంద్రంగా ఏర్పాటై 2006 మార్చి 9వ తేదీన విశ్వవిద్యాలయంగా రూపుదిద్దుకొంది. జిల్లావాసి వై.ఎస్‌. రాజశేఖర్‌రెడ్డి విశ్వవిద్యాలయం ఏర్పాటుకు కృషి చేశారు. విశ్వవిద్యాలయం ఏడు విభాగాల నుంచి ప్రస్తుతం 27 విభాగాల్లో రమారమి 1500 మంది విద్యార్థులకు విద్యనందిస్తోంది. అనతికాలంలోనే ఎక్కువ కోర్సులను తీసుకురావటంలో, అభివృద్ధికి విశ్వవిద్యాలయం ఉపకులపతి డా. అర్జుల రామచంద్రారెడ్డి నాలుగున్నరేళ్ల కాలంలో కృషి సల్పారు. దాంతో ఈ సరస్వతి నిలయం దాదాపు 120 డిగ్రీ, పీజీ కళాశాలలను తననీడన చేర్చుకొని దిశానిర్దేశం చేస్తోంది.
 జులై 21,22 తేదీల్లో యోగివేమన విశ్వవిద్యాలయంను విశ్వవిద్యాలయ నిధుల సంస్థ (యూజీసీ) సభ్యుల బృందం సందర్శించింది. 12 అర్హతను పొందేందుకు విశ్వవిద్యాలయానికి తగిన అర్హత ఉందా లేదా అనే విషయాన్ని పరిశీలించేందుకు ప్రతినిధుల బృందం ఛైర్మన్‌ హైదరాబాదు కేంద్రీయ విశ్వవిద్యాలయ రాజనీతిశాస్త్ర ఆచార్యులు రాజన్‌హర్షే, సభ్యులు ఆచార్య బి.ఎం.జయశ్రీ, డా.హరిభజన్‌సింగ్‌ సోచ్‌, డా.శివ్‌చరణ్‌సింగ్‌, కె.ఎస్‌.వి.రెడ్డి విశ్వవిద్యాలయంలోకి అడుగిడారు. రెండు రోజుల పాటు సమగ్రంగా అధ్యయనం చేసి విశ్వవిద్యాలయ ఉపాధ్యక్షులు డా.ఎ.ఆర్‌.రెడ్డి, కులసచివులు ఆచార్య శివరామిరెడ్డితో మాట్లాడారు. విద్యార్థులు, ప్రతివిభాగ ఆచార్యులు, బోధన, బోధనేతర సిబ్బందితో కలిసి వారికి అవసరమైన సమాచారం తీసుకొన్నారు. విశ్వవిద్యాలయంలో ఉండగానే ఒక సానుకూల సందేశం వారి నుంచి రావడంతో విశ్వవిద్యాలయానికి 12బి వస్తుందని ఆ రోజే ఒక అభిప్రాయానికి విశ్వవిద్యాలయం వచ్చింది. అనుకొన్నట్లే 12 బి రావడంపట్ల విశ్వవిద్యాలయ వర్గాల్లో హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి.
చదవండి :  మే 8న కడప, పులివెందుల ఉప ఎన్నికలు

ఇదీ చదవండి!

బాబురావు నాయుడు

కడప జిల్లా కలెక్టర్‌గా భాద్యతలు తీసుకున్న బాబురావు నాయుడు

కడప: ఇటీవల కడప జిల్లా కలెక్టర్‌గా నియమితులైన బాబురావు నాయుడు బదిలీపై వెళుతున్న కలెక్టర్ సత్యనారాయణ నుంచి శుక్రవారం బాధ్యతలు …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

CAPTCHA * Time limit is exhausted. Please reload CAPTCHA.

error: