అలాంటి ప్రశ్న అడగవచ్చునా?

కడప జిల్లాకు కలెక్టర్ గా నియమితులైన కే.వీ. రమణ గారిని ఒక పాత్రికేయ మిత్రుడు అడిగిన ప్రశ్న చూడండి.

ప్ర: రాయలసీమలో తొలిసారిగా పనిచేస్తున్నారు. రాజకీయ ఒత్తిళ్లను ఎదుర్కొనగలరా?

స: మొదటి నుంచి కోస్తా, తెలంగాణ జిల్లాల్లో నా సర్వీసు అంతా కొనసాగింది. 2000 సంవత్సరంలో సత్యసాయిబాబా 75వ జన్మదిన వేడుకల సమయంలో రెండున్నర నెలలపాటుఅనంతపురం జిల్లా పుట్టపర్తిలో ఓఎస్డీగా పనిచేశాను. అది మినహా రాయలసీమలో ఎక్కడా పని చేయలేదు. అధికారులు, ప్రజలతోపాటు, పార్టీలతో సంబంధం లేకుండా ప్రజాప్రతినిధులందరిని సమన్వయం చేసుకుంటూ పనిచేస్తా.

చదవండి :  కాంగ్రెస్‌ సమర్పించు.. హైప్‌ మీడియా డ్రీమ్‌ ప్రొడక్షన్స్‌.. జైల్లో జగన్‌ - 2

ఇలాంటి ప్రశ్నలు అడగడం ద్వారా సదరు పాత్రికేయుడు రాయలసీమలో రాజకీయ ఒత్తిళ్లు ఎక్కువని ముందే తేల్చేస్తున్నారు. ఈ ప్రశ్న ఒక ప్రాంతంపైన దురభిప్రాయం కలిగించేదిగా ఉంది.   మరోరకంగా చెప్పాలంటే ఈ ప్రశ్న అడిగిన పాత్రికేయుడు రాయలసీమ కన్నా మిగతా ప్రాంతాలలో రాజకీయ ఒత్తిళ్లు తక్కువ అని కలెక్టర్ గారికి సూచిస్తున్నట్లుగా ఉంది.ఇందంతా ఒక ఎత్తైతే ఈ ప్రశ్నను ఒక పెద్ద దినపత్రిక యధాతదంగా ప్రచురించటం విశేషం.

పాత్రికేయుడు ఉద్దేశపూర్వకంగా ఇలాంటి ప్రశ్న అడిగి ఉండకపోవచ్చు. కాకపోతే ఇటువంటి ప్రశ్నలు తప్పుడు సందేశాన్ని ఇస్తాయి. ముఖ్యంగా ఒక ప్రాంతం పైన. ఇది గమనించాలని వారికి మా విజ్ఞప్తి.

చదవండి :  చౌదరి సార్ ఇకలేరు

ఇదీ చదవండి!

సీమపై వివక్ష

‘సీమ’పై వివక్ష ఇంకా ఎన్నాళ్లు?

‘వడ్డించేవాడు మనవాడైతే పంక్తిలో ఎక్కడ కూర్చున్నా ఫర్వాలేదు..’ అన్న సామెత రాయలసీమకు మాత్రం వర్తించదు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విభజన తర్వాత …

3 వ్యాఖ్యలు

  1. సాధారణంగా పాత్రికేయులకు పరిస్థితులు మిగతావారి కన్నా బాగా తెలుస్తాయి. మీ బాధలో అర్థం లేకపోలేదు కానీ ఈ రకమైన ప్రశ్నల్ని తప్పుపట్టి ప్రయోజనమేముంది? ఆ జిల్లాలో పరిస్థితులు మారనంత కాలం ఇలాంటి ప్రశ్నలు తలెత్తుతూనే ఉంటాయి. ముందు మార్చాల్సింది ఆ పరిస్థితుల్ని. ప్రశ్నల్ని నిషేధించలేం కదా!!

    • వార్తా విభాగం

      రాజకీయ ఒత్తిళ్లు అనేవి ఈ కాలంలో ఈ జిల్లాలో లేవు లేదా ఈ ప్రాంతంలో లెవ్వు అని ఎవరైనా గుండెల మీద చెయ్యి వేసుకొని చెప్పగలరా? పాత్రికేయుడు అడిగినంత మాత్రాన లేదా పత్రికలో రాసినంత మాత్రాన అది నిజమని నిర్దారించనవసరం లేదు. అది రాసే వ్యక్తీ అవగాహనా స్థాయిని, అభిప్రాయాన్ని బట్టీ ఉంటుంది.

  2. డిటెక్టివ్

    అది ఆ విలేఖరి ఇష్టం.

Leave a Reply

Your email address will not be published.

CAPTCHA * Time limit is exhausted. Please reload CAPTCHA.

error: