రాచపాళెం దంపతులకు అరసం సత్కారం

సిపి బ్రౌన్ భాషా పరిశోధనా కేంద్రం భాద్యులు ఆచార్య డాక్టర్ రాచపాలెం చంద్రశేఖర్‌రెడ్డి దంపతులను కడప జిల్లా అభ్యుదయ రచయితల సంఘం మంగళవారం సత్కరించింది. రాచపాలెం రాసిన ‘మన నవలలు – మన కథానికలు’ పుస్తకానికానికి గాను కేంద్ర సాహిత్య అకాడెమీ అవార్డుకు ఎంపికైన నేపధ్యం అరసం స్థానిక సిపి బ్రౌన్ భాషా పరిశోధనా కేంద్రంలో అభినందన సభను జరిపింది.

rachapalem arasamఈ సందర్భంగా అరసం రాష్ట్ర కార్యవర్గ సభ్యలు శ్రీమతి పి సంజీవమ్మ మాట్లాడుతూ రాచపాలెం సాహితీ విమర్శకు గురింపు కలిగేటట్లు కృషి చేశారన్నారు. విమర్శలో ఆయన చేసిన యువరచయితలకు మార్గదర్శకం కాగలదని ఆమె ఆశాభావం వ్యక్తం చేశారు. సీనియర్ పాత్రికేయులు, సాహిత్యనేత్రం సంపాదకులు శశిశ్రీ మాట్లాడుతూ సాహిత్యం, సమాజాభివృద్ధి ధ్యేయంగా రాచపాలెం చేసిన కృషి అభినందనీయమన్నారు.

చదవండి :  కడప జిల్లా కలెక్టర్‌గా భాద్యతలు తీసుకున్న బాబురావు నాయుడు

సిపిఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు ఓబులేశు మాట్లాడుతూ రాచపాలెం రచనలు తమ పోరాటాలకు స్పూర్తినిచ్చాయని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో విద్వాన్ కట్టానరసింహులు, తక్కోలు మాచిరెడ్డి, డాక్టర్ మల్లెమాల వేణుగోపాల్ రెడ్డి, డాక్టర్ ఆవుల రామచంద్రయ్య, డాక్టర్ మూలె మల్లిఖార్జునరెడ్డి, ఎన్సీ రామసుబ్బారెడ్డి, తవ్వా ఓబులరెడ్డి, మొగిలిచెండు సురేష్, భూతపురి గోపాలకృష్ణ,  శివారెడ్డి తదితరులు రాచపాలెంకు కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు దక్కటం పట్ల హర్షం ప్రకటించారు.

ఇదీ చదవండి!

సిద్దేశ్వరం ..గద్దించే

దావలకట్టకు చేరినాక దారిమళ్ళక తప్పదు (కవిత)

పౌరుషాల గడ్డన పుట్టి పడిఉండటం పరమ తప్పవుతుందేమో కాని ..! కుందేళ్ళు కుక్కలను తరిమిన సీమలో ఉండేలులై విరుచుకపడటం తప్పే …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

CAPTCHA * Time limit is exhausted. Please reload CAPTCHA.

error: