రాయలసీమకు మిగిలేదేమిటి?

‘నీటి యుద్ధాలు’ నిజమేనా? (సెప్టెంబర్ 9, ఆంధ్రజ్యోతి) ఆర్. విద్యాసాగర్ రావు ప్రశ్నించారు. ఆయన తన వ్యాసాన్ని ఒక సాగునీటి నిపుణునిగా కాకుండా ఒక రాజకీయ నాయకుడిగా రాశారు. దీనికి ప్రత్యక్ష నిదర్శనం ఆ వ్యాసంలోని రెండవ పేరాలో ఆయన వాడిన పదజాలమే. ఇది విద్యాసాగర్‌రావు పక్షపాత ధోరణికి ప్రత్యక్ష నిదర్శనం – సీమాంధ్ర ప్రాంతం మదరాసు రాష్ట్రంలో అని, అదే విధంగా తెలంగాణ ప్రాంతం హైదరాబాదు రాష్ట్రంలో అనకుండా గూఢార్థం వచ్చే విధంగా ‘తెలంగాణ’ హైదరాబాద్ రాష్ట్రంగా ఉండేవని రాశారు.

హైదరాబాద్ రాష్ట్రంలో మూడు భాషలు మాట్లాడే ప్రాంతాలున్నాయనేది మనం మరవకూడదు. హైదరాబాద్ రాష్ట్రం ఆంధ్రప్రదేశ్‌గా రూపాంతరం చెందినప్పుడు హైదరాబాద్‌లోని తెలుగేతర భాషా ప్రాంతాలను ఆయా రాష్ట్రాలలో కలిపి, మద్రాస్ రాష్ట్రం నుంచి విడిగా వచ్చిన తెలుగువారిని, హైదరాబాద్ రాష్ట్రంలోని తెలుగువారిని (తెలుగు-తెలంగాణ) కలపటం జరిగింది. హైదరాబాద్ పట్టణం కాస్మోపాలిటన్ సిటీగా ఉండేది. సికిందరాబాద్‌లో బ్రిటిష్ సైన్యం (నవాబు ఈ ప్రాంతాన్ని బ్రిటిష్ వారికివ్వడం జరిగింది) ముఖ్యంగా సీమాంధ్రవారు ఉండేవారు. నీటి విషయానికి వస్తే, విద్యాసాగర్‌రావు వాదనలోనే చూడవచ్చు రాష్ట్ర అవతరణకు ముందు ఉన్న పరిస్థితి-రాష్ట్ర అవతరణ తరువాత జరిగిన అన్యాయం. ఈ అంశంపై కొన్ని విషయాలను చూద్దాం.

చదవండి :  ఆత్మద్రోహం కాదా?

– ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంగా హైదరాబాద్ రాష్ట్రం రూపాంతరం చెందడం మూలంగానే రాయలసీమకు రావలసిన నీటి కేటాయింపులు జరుగలేదు.. అదే 1969 తరువాత విభజన జరిగి ఉంటే రాయలసీమ ఇప్పటికే సస్యశ్యామలంగా అభివృద్ధి చెంది ఉండేది, వారికి రావలసిన నీరు వచ్చేది.

– 1980 వరకు నికర జలాలు వాడుకునే దిశలో ప్రాజెక్టుల నిర్మాణ చేపట్టడం జరిగింది. మిగులు జలాల వాడకానికి సంబంధించిన ప్రాజెక్టులకు పునాది రాళ్ళతో సరిపెట్టి శ్రీశైలంకు దిగువన మిగులు జలాలను విచ్చలవిడిగా (=260 టీఎంసీలకు పైన సగటున) వాడుకోవటం జరుగుతున్నది.

– బచావత్ ట్రిబ్యునల్ చెప్పిన విధంగా మిగులు జలాలలను వాడుకునే దిశలో ప్రాజెక్టుల నిర్మాణం జరిగి ఉంటే, బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ నీటి కేటాయింపులు వేరుగా ఉండేవి.

– కేసీఆర్ అంటారు జూరాల నుంచి హైదరాబాద్‌కు నీటిని తరలిస్తామని, కృష్ణా నదిపై కొత్త ప్రాజెక్టులకు జాతీయ హోదా తెచ్చుకుని నిర్మిస్తామని అంటారు. అంటే దీనర్థం, ముఖ్యమంత్రి అన్నట్లు నీటి యుద్ధాలు జరుగుతాయనేగదా?;

– ఇదే జరిగితే రాయలసీమకు మిగిలేదేమిటి?;

– విద్యాసాగర్ రాయలసీమకు నీటి భిక్ష పెడ్తామంటారు. ఇలాంటి పదజాలం (టీఆర్ఎస్ పదజాలం) వాడటం తప్పుడు సంకేతాలిస్తాయి. ఈయన బ్రిజేష్‌కుమార్ ట్రిబ్యునల్ తీర్పు సమర్థించారు కానీ దీని వల్ల రాష్ట్రానికి నష్టం అని ప్రభుత్వ వాదనలు చేస్తున్నది.

చదవండి :  విభజన తర్వాత సీమ పరిస్థితి ...

– దీని అర్థం ఉత్తర తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర వాదులకు కృష్ణా నీరు వారి ప్రాంతానికి రాదు కాబట్టి మన రాష్ట్రం నష్టపోయి కర్ణాటక-మహారాష్ట్ర లాభం పొందడమే వారికి కావాలి. ఇక్కడ మనం ముఖ్యంగా గమనించాల్సిన విషయం బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ తీర్పు వల్ల మన రాష్ట్రానికి వారు అనుమతించిన నీరు 50 శాతం సంవత్సరాలు రావు. అప్పుడు విభజన జరిగితే వచ్చేవి నీటి యుద్ధాలు గాక మరేమిటి?

– రాష్ట్రం కలిసుంటే సీమకు ‘లేని’ నీళ్ళు ఎక్కడ నుంచి వస్తాయి అని విద్యాసాగర్ రావు అంటున్నారు. ఆయన వాదనలో మనకు అర్థమవుతున్నది, రాయలసీమను దెబ్బతీసే దిశలో ప్రాజెక్టు నిర్మాణాలు జరిగాయి… పరివాహక ప్రాంతం విస్తీర్ణాన్ని బట్టి, నీటి కేటాయింపులు జరగవు, అవే జరిగితే మన రాష్ట్రానికి నీరు చాలా తక్కువే వస్తుంది.

దీనిని సరిదిద్దే దిశలో డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి మిగులు జలాలను రాయలసీమ జిల్లాలు, మహబూబ్‌నగర్-నల్గొండ జిల్లాలు, ప్రకాశం-నెల్లూరు జిల్లాలు వాడుకునే దిశలో ప్రాజెక్టుల నిర్మాణాన్ని చేపట్టడం జరిగింది. వీటి నిర్మాణానికి 1980 ప్రాంతంలోనే భూమి పూజ జరిగాయి. ప్రాజెక్టు రిపోర్టులు తయారుచేశారు. ఈ దిశలోనే శ్రీశైలం నుంచి ఈ ప్రాజెక్టులకు నీరందించే దిశలో పోతిరెడ్డిపాడును మార్చడం జరిగింది. అంటే ఇంతవరకు శ్రీశైలం దిగువన దోచుకుంటున్న నీటిని ఎవరికి చెందాలో వారికి చెందే దిశలో ప్రాజెక్టుల నిర్మాణాలు జరిగాయి. జరుగుతున్నాయి. రాష్ట్ర విభజన జరిగితే ఈ విషయంగా నీటి యుద్ధాలు గాక ఇంకేమి జరుగుతాయి? అవతలివారిని దోచుకునే దిశలో, ఇవతలవారిని రెచ్చగొట్టే ధోరణితో వ్యాసాలు రాయడం మానుకోవాల్సిన అవసరమెంతైనా ఉంది.

చదవండి :  'శివరామక్రిష్ణన్'కు నిరసన తెలిపిన విద్యార్థులు

– సమైక్యంగా ఉన్నా రేపు కిరణ్‌కుమార్ రెడ్డి స్థానంలో మరో తెలంగాణ వ్యక్తి లేక కోస్తాంధ్ర ప్రాంత వ్యక్తో ముఖ్యమంత్రి అయితే ‘కిరణ్’ అనుసరించే విధానాన్ని అనుసరించడా? అని విద్యాసాగర్ రావు అంటారు. ఇలాంటి తప్పిదాల వల్లే ఇప్పటి దుస్థితి ఈ రాష్ట్రానికి దాపురించింది. వైఎస్ఆర్ ఆ తప్పిదాలను సరిదిద్దే దిశలో జలయజ్ఞం ప్రాజెక్టుల నిర్మాణం చేపట్టడం జరిగింది. ఇక్కడ మూడు ప్రాంతాల ప్రజలకు సమన్యాయం చేసే దిశలో ముందుకు వెళ్ళారు. కానీ ఇప్పుడు రాష్ట్ర విభజన ఖాండవ దహనం హైదరాబాద్ చుట్టుప్రక్కల రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసుకొని వేల కోట్లు గడించాలనే గానీ సామాన్య ప్రజల బాగోగులకు కాదనేది ఐఐఐటీ బాసరలో విద్యార్థుల పాట్లే నిదర్శనం.

– డాక్టర్ సజ్జల జీవానంద రెడ్డి

(సెప్టెంబర్ 18, ఆంధ్రజ్యోతి)

ఇదీ చదవండి!

రాయలసీమ జీవన్మరణ సమస్య

ఇది రాయలసీమ జీవన్మరణ సమస్య

ఇది రాయలసీమ జీవన్మరణ సమస్య రెండు తెలుగు రాష్ట్రాలు కృష్ణా జలాల వినియోగంలో సమస్యలు రాకుండా ఉండడానికి కేంద్ర ప్రభుత్వం …

ఒక వ్యాఖ్య

  1. anna,

    ma naayana sannabillode katha bhalega undi

Leave a Reply

Your email address will not be published.

CAPTCHA * Time limit is exhausted. Please reload CAPTCHA.

error: