‘ప్రారంభోత్సవం ఎందుకు ఆపారో చెప్పాల’

కడప: వైఎస్ఆర్ జిల్లాకు రావలసిన పరిశ్రమలను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అడ్డుకుంటున్నారని వైకాపా శాసనసభ్యుడు గడికోట శ్రీకాంత్ రెడ్డి ఆరోపించారు. ఆదివారం వైకాపా జిల్లా అధ్యక్షుడు అమర్నాద్, కడప మేయర్ సురేష్ బాబులతో కలిసి ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ…

కడప  విమానాశ్రయ ప్రారంభోత్సవం ఎందుకు ఆపారో తక్షణమే చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. 1985లోనే కడప విమానాశ్రయంలో 20 సీట్లున్న వాయుదూత్ విమానం దిగేదని, ఇప్పుడు ఆ సీట్ల గల విమానం కూడా దిగేందుకు వీలు లేదని చెప్పి విమానాశ్రయం ప్రారంభించకుండా దాట వేయడం చూస్తుంటే ఆయన మనసులో జిల్లాపై ఎంత కక్ష వుందో తెలుస్తుందని అన్నారు. విమానాశ్రయం ప్రారంభిస్తే పరిశ్రమ వస్తాయనే భయంతో అడ్డుకుంటున్నారని తెలిపారు. వచ్చిన పరిశ్రమలను వెనక్కి పంపుతూ జిల్లా ప్రజలపై కక్షసాధించడం మంచి పద్ధతి కాదని శ్రీకాంత్ రెడ్డి అన్నారు. చంద్రబాబుకు కక్షసాధింపు తగదని ఆయన హితవు పలికారు. చంద్రబాబు ఇప్పటివరకూ కడప జిల్లాలో ఒక్క సమస్య కూడా పరిష్కరించలేదన్నారు.

చదవండి :  '14న బాబు విమానాశ్రయాన్ని ప్రారంభిస్తారు'

ఇదీ చదవండి!

కడప బెంగుళూరు విమానాలు

కడపకు తొలి విమానమొచ్చింది

కడప: బెంగుళూరు నుండి ఈరోజు (ఆదివారం) ఉదయం 10 గంటల 40 నిముషాలకు బయలుదేరిన ఎయిర్ పెగాసస్ విమానం ( …

ఒక వ్యాఖ్య

  1. Kadapa does not have future because we dont have good and highly efficient leadership, every leader has his own ambitions and self target at the cost of Kadapa development.When we come to Chandra babu he is traitor of RAYALA SEEMA,being a Rayalaseema person he never never care about Rayalaseema, history would show that he worked for the befit of Hyderbad and now he will work for coastal districts.The only option what we have is to get our State like TELANGANA.Then only we can develop our areas. JAI RAYALASEEMA.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

CAPTCHA * Time limit is exhausted. Please reload CAPTCHA.

error: