వైఎస్ జగన్ అరెస్టు

ఎట్టకేలకు సిబిఐ ఊహాగానాలకు తెరదించింది. కొద్దిసేపటి క్రితం వైఎస్ జగన్ అరెస్టు చేసింది.ఈ మేరకు వైఎస్ జగన్ కుటుంబ సభ్యుల సిబిఐ సమాచారం అందించింది. రేపు జగన్ కోర్టుకు హాజరు కావాల్సిన నేపధ్యంలో విచారణ పేరుతొ సిబిఐ జగన్ను అదుపులోకి తీసుకుంది. నా అరెస్టుకు రంగం సిద్ధమైన్దంటూ జగన్ చేస్తున్న ఆరోపణలను నిజమయ్యాయి. జగన్ అరెస్టు సమాచారాన్ని ముందస్తుగా అందుకున్న ప్రభుత్వమూ, పోలీసు శాఖ నిముషాల వ్యవధిలో భారీగా పోలీసు బలగాలను మోహరించింది.

చదవండి :  కడపలో గ్రూప్-2 అభ్యర్థులకు ఉచిత శిక్షణ

రాష్ట్రమంతటా పోలీసులు నిషేదాజ్ఞలు నడుమ ఉద్రిక్త వాతావరణం నెలకొని ఉంది. కడప జిల్లాలో పలుచోట్ల శాంతియుతంగా ప్రజలు ఆందోళన చేస్తుండాగా అక్కడక్కడా విధ్వంసం జరుగుతున్నట్లు వార్తలను బట్టి తెలుస్తోంది.

కడప, ప్రొద్దుటూరు, మైదుకూరు, బద్వేల్, రాజంపేట, రాయచోటి, పులివెందుల బస్సు ప్రాంగణాలను పోలీసులు ఇప్పటికే తమ అదుపులోకి తీసుకున్నారు. పలు ప్రాంతాలకు ఇప్పటికే బస్సు సర్వీసులను నిలిపి వేయటంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు.

ఇదీ చదవండి!

వైఎస్సార్

దైవత్వాన్ని నింపుకున్న మానవుడు వైఎస్సార్

డాక్టర్ వైఎస్సార్ (వైఎస్ రాజశేఖరరెడ్డి) ను నేను చూసింది కేవలం నాలుగు సార్లు. ఒంగోలుకు ఇందిరా గాంధీ వచ్చినపుడు ఆ …

Leave a Reply

Your email address will not be published.

CAPTCHA * Time limit is exhausted. Please reload CAPTCHA.

error: