ttd kalyanotsavam

కమనీయం… కోనేటిరాయుని కళ్యాణం

వీరబల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఆవర ణలో ఆదివారం అంగరంగ శ్రీనివాసుని కల్యాణం కన్నుల పండువగా జరిగింది. తిరుమల, తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో భారీ ఏర్పాట్లు, వేదపండితుల వేదమంత్రోచ్చారణల మధ్య కోనేటిరాయుని కల్యాణమహోత్సవం వైభవంగా జరిగింది. ఈ సందర్భంగా భక్తుల గోవిందనామస్మరణలతో  జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ప్రాంగణం పులకించింది.

కల్యాణానికి ముఖ్యఅతిధులు గా ప్రభుత్వ విప్ మేడా మల్లికార్జునరెడ్డి, జాయింట్ కలెక్టర్ రామారావులు హాజరయ్యారు. కార్యక్రమంలో తిరుమల, తిరుపతి దేవస్థానం జాయింట్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ భాస్కర్ మాట్లాడుతూ ధర్మప్రచారంలో భాగం గా రాష్ట్రంలో, దేశంలో, ఇతర దేశాల్లో కూడా ఇటువంటి కార్యక్రమాలు జరుపుతున్నట్లు తెలిపారు.

చదవండి :  మల్లూరమ్మ జాతర వైభవం

ముఖ్యంగా మారుమూల ప్రాంతాల్లో హిందూ మతం గురించి తెలిపే కార్యక్రమంగా కూడా ఇలాంటి ప్రాంతాల్లో ఈ కార్యక్రమాలు నిర్వహిస్తున్నామన్నారు. విద్యార్థులకు కూడా ఇటువంటి కార్యక్రమాలు ఏర్పాటు చేసి మానవ విలువలు, వికాస విద్య, భక్తి భావన, సేవా దృక్పధం వంటివి అలవర్చేందుకు ధర్మప్రచార పరిషత్ ఆధ్వర్యంలో కృషి చేస్తున్నట్లు తెలిపారు.

ఇదీ చదవండి!

నేడు ఒంటిమిట్ట సీతారాముల పెళ్లి ఉత్సవం

ఒంటిమిట్ట: కౌసల్య దశరథమహారాజు తనయుడు శ్రీరామచంద్రమూర్తికి జనక మహారాజు తనయ సీతామహాదేవితో స్వస్తిశ్రీ శ్రీనందననామ సంవత్సర ఉత్తరాయణే, వసంత రతువే, …

Leave a Reply

Your email address will not be published.

CAPTCHA * Time limit is exhausted. Please reload CAPTCHA.

error: