పిచ్చుకలకు

ఆధునిక సాంకేతికతే పిచ్చుకలకు శాపం

మారుతున్న ప్రజల జీవన విధానాలే మనుషుల్లో ఒకటిగా బతుకుతున్న పిచ్చుకలు కనుమరుగయ్యేలా చేస్తున్నాయని, జీవ వైవిధ్యానికీ , పర్యావరణ సమతుల్యానికి ఎంతగానో మేలు చేసే పిచ్చుకలను కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని ప్రముఖ రచయిత, పప్పన్నపల్లె పాఠశాల ప్రధానోపాధ్యాయుడు తవ్వా ఓబుల్ రెడ్డి పేర్కొన్నారు. కడప జిల్లా, మైదుకూరు మండల పరిధిలోని పప్పన్నపల్లె గ్రామ పంచాయతీలోని పప్పన పల్లె గ్రామంలో గల మండల ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల (H.W), అమ్మ సేవా సమితి ప్రపంచ పిచ్చుకల దినోత్సవం సందర్భంగా అవగాహనా సదస్సు నిర్వహించారు.

ఎన్నో తరాలుగా పిచ్చుకలు మనకు ప్రియమైన నేస్తాలని, పెరట్లో, ఇంట్లో స్వేచ్ఛగా తిరుగాడుతూ సందడి చేసేవి, పిచ్చుకల ప్రస్తుత దుస్థితికి చాలా వరకు మానవ తప్పిదాలు ఉన్నాయని, ప్రకృతికి హాని చేసే ప్రతీ పనీ జీవసమతుల్యాన్ని దెబ్బతీసే అంశంగా పరిణమిస్తుందని పర్యావరణవేత్తలు చెపుతూనే ఉన్నారు. కానీ పెరుగుతున్న కాలుష్యం, వ్యవసాయంలో పురుగుల మందులకు వాడకం, సెల్‌టవర్‌ రేడియేషన్, తరిగిపోతున్న వృక్షాలు, ఆహార కొరత, వాతావరణంలో మార్పులు వల్ల ఆ చిన్ని ప్రాణాలకు ముప్పువాటిల్లింది. ప్రకృతిలోని అందమైన జివులలో పిచ్చుక జాతి ఒకటి పిచ్చుకలు మానవుడి జీవితంలో ఒక భాగం అందుకే మనమందరం పిచ్చుకలను పరిరక్షించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది అని విద్యార్థులకు వివరించడం జరిగింది.

చదవండి :  అమెరికా జీవనమే సుఖమయమైనది కాదు - సొదుం గోవిందరెడ్డి

అమ్మ సేవా సమితి అధ్యక్షులు వి. శివశంకర్ మాట్లాడుతూ ఒకప్పుడు మనం నిద్రలేవగానే మన కళ్ల ముందు కనిపించే చిన్ని నేస్తం పిచ్చుక. పెరట్లోని చెట్లపై ఎన్నో రకాల పక్షులు కిలకిల రావాలు చేసినా ఇంటి చూరుల్లో, గోడల నెర్రెల్లో గూడు కట్టుకుని కళ్లు తెరవగానే కనిపించే ఈ చిట్టి గువ్వలు చేసే కిచకిచలు నేడు పల్లెల్లోనే కరువయ్యాయని, గుప్పెడు గింజలు వేస్తే చాలు కలకాలం పిచ్చుకలు మనకు తోడుగా ఉంటాయని, అంతరించిపోతున్న పిచ్చుకలు మరియు ఇతర పక్షులను సంరక్షించాలన్న బాధ్యత ప్రతి ఒక్కరిపైన వుందని, కిటికీలు, వెంటిలేటర్‌, డాబాలు, చెట్లు, వరండాల్లో కృత్రిమ గూళ్లను ఉంచి వాటికి ఆశ్రయం కల్పించమని, ఇంటి బయటా, బాల్కనీ, మేడపైన గుప్పెడు జొన్నలు, సజ్జలు, బియ్యం, గోధుమలు వంటి ధాన్యాలను వెదజల్లి వాటి ఆకలిని తీర్చమని, వేసవిని కాలం కావున ప్రతి ఒక్కరు వరండాలొ, బాల్కనిలలొ, పాఠశాల, కార్యాలయాలు, ఇళ్లు, పార్కులలో మట్టి పాత్రలు పెట్టి నీళ్లు పోసి వాటి దాహన్ని తీర్చేయాలని పిలుపునిచ్చారు.

చదవండి :  సియ్యల పండగ (కథ) - తవ్వా ఓబుల్‌‌రెడ్డి

పిచ్చుకలకు

ఉపాధ్యక్షులు వై. హరేరామ్ మాట్లాడుతూ ఒక్కప్పుడు గ్రామాల్లో, పట్టణాల్లో కనిపించే పిచ్చుకలు నేడు అంతరించిపోతున్నాయని కిచకిచమంటూ ప్రేమతో అరుస్తూ, ముక్కున పీచు పట్టుకుని ఆత్మీయుల్లా ఇంట్లోకి వచ్చే పిచ్చుకలు మచ్చుకైనా ఎక్కడా కనపడటం లేదనీ . రివ్వురివ్వున ఎగిరే ఆ పిట్టలను చూస్తే అందిరికీ ఆనందమే. చెట్లన్నీ ఆ గిజిగాడి గూళ్లతో ఎంతో అందంగా కనిపించేవని. పర్యావరణానికి మేలు చేసే పిచ్చుకలు అంతరించిపోవడం చాల బాధకరంగా వుందని, పిచ్చుక జాతి సంరక్షిచడానికి మనం పెద్దగా శ్రమ పడవసరంలేదని పిచ్చుకల నివాసంకోసం పెట్టెలను ఏర్పాటు చెయ్యడం, ఒక పాత్రలో నీటిని పక్షులకు అందుబాటులో ఉంచడం, నీటిని ప్రతీరోజూ మార్చడం, ఆహారాన్ని అందుబాటులో ఉంచడం, మొక్కల్ని పెంచడం ద్వార పిచ్చుక జాతిని కాపాడవచ్చుని, త్వరలోనే మళ్ళీ పిచ్చుకల కిచకిచలు విరివిగా వినే అదృష్టం కలగాలని ప్రపంచ పిచ్చుకల దినోత్సవం సాక్షిగా కోరుకొందాం అని వివరించారు .

చదవండి :  బహుళజాతి చిలుకలు (కవిత) - తవ్వా ఓబుల్ రెడ్డి

ఈ కార్యక్రమానికి మైదుకూరు అమ్మ సేవా సమితి అధ్యక్షులు వి. శివశంకర్, ఉపాఅధ్యక్షులు వై. హరేరామ్, కార్యదర్శి పి.బాలనాగి రెడ్డి, అమ్మ సేవా సమితి సభ్యులు కె. కొండారెడ్డి, ప్రసన్న కూమార్, తిరుమలయ్య, మరియు గ్రామ పెద్దలు, గ్రామస్తులు తదితరులు పాల్గోన్నారు. మరియు ముసన్నాయ పల్లె మండల ప్రాథమిక పాఠశాల లో కూడా అమ్మ సేవాసమితి ఈ కార్యక్రమాన్ని నిర్వహించించింది. , ప్రధానోపాధ్యాయుడు యన్. ప్రసాద్ రావు, విద్యా కమిటి చైర్మన్ తదితరులు పాల్గొన్నారు .

ఇదీ చదవండి!

రాయలసీమ వైభవం

రాయలసీమ వైభవం – Rayalaseema Vaibhavam

‘రాయలసీమ వైభవం’ – రాయలసీమ ఉత్సవాల సావనీర్ . సంపాదకత్వం: తవ్వా ఓబుల్ రెడ్డి, ప్రచురణ : రాయలసీమ ఆర్ట్ …

Leave a Reply

Your email address will not be published.

CAPTCHA * Time limit is exhausted. Please reload CAPTCHA.

error: