సిద్దేశ్వరం ..గద్దించే స్వరం
రాయలసీమకు ఇది వరం
పాలకుల వెన్నులో జ్వరం
కడితే అది సిద్దేశ్వరం
కాదంటే అది యుద్దేశ్వరం
సాగునీటి ఉద్యమ శరం
తోకతొక్కిన సీమ నాగస్వరం
కృష్ణా-పెన్నార్ ను తుంగలోతొక్కి
కరువు జనుల ఆశలను కుక్కి
సాగరాలను నిర్మించుకుని
మూడుకార్లు పండించుకుని
గొంతెండుతోందని గోస పెడితే
అరెస్టులతో అణచేస్తారా ?
అదిగదిగో కదులుతోంది దండు
ద్రోహులగుండెల్లో ఫిరంగి గుండు
నలుదిశలా కనబడలేదా ?
రాయలసీమ ఉద్యమ జండా
సాగుతోంది సన్నని దారుల గుండా !
ట్యాగ్లుతవ్వా ఓబుల్‌రెడ్డి తవ్వా ఓబుల్‌రెడ్డి కవితలు తవ్వా ఓబుల్‌రెడ్డి రచనలు తవ్వా ఓబుల్‌రెడ్డి సాహిత్యం తవ్వా ఓబుళరెడ్డి తవ్వా ఓబుళరెడ్డి కవితలు తవ్వా ఓబుళరెడ్డి రచనలు తవ్వా ఓబుళరెడ్డి సాహిత్యం రాయలసీమ సాహిత్యం సిద్దేశ్వరం సిద్దేశ్వరం ..గద్దించే సిద్దేశ్వరం అలుగు సిద్దేశ్వరము
ఇదీ చదవండి!
రాయలసీమ వైభవం – Rayalaseema Vaibhavam
‘రాయలసీమ వైభవం’ – రాయలసీమ ఉత్సవాల సావనీర్ . సంపాదకత్వం: తవ్వా ఓబుల్ రెడ్డి, ప్రచురణ : రాయలసీమ ఆర్ట్ …