సీమ కోసం

సీమ కోసం గొంతెత్తిన సాహితీకారులు

రాయలసీమ స్థితిగతులపై రాష్ట్ర ప్రభుత్వం వెంటనే శ్వేతపత్రం విడుదల చేయాలని రాయలసీమకు చెందిన కవులు, రచయితలు డిమాండ్ చేశారు. తుఫానులు, భూకంపాల ప్రాంతంగా జిఎస్‌ఐ నివేదిక పేర్కొన్న విజయవాడ ప్రాంతంలో రాజధాని ఏర్పాటు అశాస్త్రీయమని వారు గుర్తు చేశారు.

కడప సిపిబ్రౌన్ గ్రంధాలయ పరిశోధన కేంద్రంలో కుందూ సాహితీ ఆధ్వర్యంలో ఆదివారం జరిగిన రాయలసీమ కవులు, రచయితలతో సమాలోచన జరిగింది. ఆచార్య రాచపాలెం చంద్రశేఖరరెడ్డి అధ్యక్షతన జరిగిన ఈ సదస్సులో ముఖ్యఅతిధిగా పాల్గొన్న కేంద్రసాహితీ అకాడమి అవార్డు గ్రహీత ఆచార్య కేతు విశ్వనాధరెడ్డి పాల్గొన్నారు.

ఈ సందర్భంగా కేతు విశ్వనాధరెడ్డి మాట్లాడుతూ చాలాకాలంగా మోసపోతున్న రాయలసీమ ఇంకా నిరసన దశలోనే ఉంటుందా? ప్రతిఘటనకు పూనుకుంటుందా అని రచయితలు ఆలోచించాలన్నారు. రాయలసీమ స్థితి గతులపై ప్రభుత్వం శ్వేతపత్రాన్ని విడుదల చేసేలా ప్రభుత్వాన్ని డిమాండ్ చేయాలన్నారు.

చదవండి :  పెద్దదర్గాలో నారా రోహిత్

  • విజయవాడలో రాజధాని ఏర్పాటు అశాస్త్రీయం

  • కర్నూలును పోగొట్టుకున్న రాయలసీమకే రాజధానిని ఇవ్వాల

  • రాయలసీమపై శ్వేతపత్రానికి డిమాండ్

Seema Sahiti
సిపిబ్రౌన్ గ్రంధాలయంలో సమాలోచన జరుపుతున్న కవులు, రచయితలు

సమావేశానికి అధ్యక్షత వహించిన ఆచార్య రాచపాళెం చంద్రశేఖరరెడ్డి మాట్లాడుతూ ప్రాచీన, ఆధునిక కాలాల్లో రాయలసీమ సాహిత్యం ఏమాత్రం వెనుకబడి లేదని పేర్కొన్నారు. అలాగే ఇంకా సదస్సుకు వచ్చిన పలువురు రచయితలు, కవులు, రాయలసీమ ఉద్యమకారులు మాట్లాడుతూ ప్రత్యేక రాయలసీమ రాష్ట్రం కావాలని డిమాండ్ చేశారు. అలాగే ప్రభుత్వంపై వత్తిడి తెచ్చి అభివృద్ధికి అవసరమైన డిమాండ్లను నెరవేర్చుకోవాలన్నారు. కర్నూలును పోగొట్టుకున్న రాయలసీమకే రాజధానిని ఇవ్వాలన్నారు. అలాగే రాజధాని విషయంలో ప్రజలతో చర్చించకుండా ప్రభుత్వమే ఏకపక్షంగా నిర్ణయం తీసుకునే నిరంకుశత్వాన్ని నిర్ద్వందంగా వ్యతిరేకించాలని పిలుపునిచ్చారు.

రాయలసీమ అధ్యయనల సంస్థ అధ్యక్షుడు భూమన్ మాట్లాడుతూ ప్రత్యేక రాయలసీమ రాష్ట్రమే సీమ సమస్యలకు పరిష్కారవౌతుందన్నారు. రాయలసీమ రచయితలు ఇంకే ప్రాంత రచయితలకు తీసి పోరని గుర్తు చేశారు.

చదవండి :  రాయలసీమ బిడ్డలం (కవిత) - సొదుం శ్రీకాంత్

కథారచయిత బండి నారాయణస్వామి మాట్లాడుతూ సమైక్య రాష్ట్రంలో కోస్తా రాష్ట్రం లాభం పొందగా, రాయలసీమ, తెలంగాణాలు తీవ్రంగా నష్టపోయాయన్నారు. వ్యవసాయాన్ని కథాసాహిత్యంలో వస్తువుగా చేసి రచనలు వెలువరించింది రాయలసీమ రచయితలేనని ఆయన గుర్తు చేశారు.

seema_sahiti

అంతకు ముందు సదస్సుకు సమన్వయకర్తగా వ్యవహరించిన కథారచయిత, కడప.ఇన్ఫో గౌరవ సంపాదకులు తవ్వా ఓబుల్‌రెడ్డి మాట్లాడుతూ రాయలసీమలో అనేక మంది రచయితలు సీమ జన జీవితాన్ని ప్రతిభావంతంగా చిత్రీకరించారని, రాయలసీమ అభివృద్ధి, సంక్షేమంపై ప్రజలను చైతన్యం చేసే రచనలు రావాలని కోరారు.

సీమ సాహితి ప్రధానకార్యదర్శి పాండురంగారెడ్డి మాట్లాడుతూ రచయితలు సంఘటితమై ఒక సంస్తను నెలకొల్పి, దానికి ఒక లక్ష్యాన్ని నిర్దేశించుకుని ముందుకు సాగాలన్నారు. రచనలకు ఉపక్రమించే ముందు ప్రజలు జీవితాలను లోతుగా అధ్యయనం చేయాలని సూచించారు.

విజయవాడ ప్రాంతంలో కొత్తరాజధానిని స్థాపించడం అశాస్ర్తియమని, అది వరదలు, తుఫానులు, భూకంపాల ప్రాంతంగా జిఎస్‌ఐ నివేదిక పేర్కొందని గుర్తు చేశారు.

చదవండి :  కడప- చిత్తూరు జిల్లాల సరిహద్దులో బయటపడ్డ మందు పాతరలు

కుందూ సాహితీ కన్వీనర్ లెక్కల వెంకటరెడ్డి మాట్లాడుతూ రాయలసీమ కరవు తీర్చేందుకు దుమ్మగూడెం, సాగర్ టెయిల్ పాండ్ ప్రాజెక్టు ఒకటే శరణ్యమని, కేంద్రం వెంటనే ఈ ప్రాజెక్టును జాతీయ ప్రాజెక్టుగా ప్రకటించడంతోపాటు దాని ద్వారా ఆదా అయ్యే కృష్ణ నీటిలో సింహభాగం రాయలసీమకు కేటాయించి, సీమ వాసుల ఆందోళనకు ఉపశమనం కలిగించాలని ఆయన డిమాండ్ చేశారు.

seema samalochana

ఇంకా ఈ సదస్సులో హరినాధరెడ్డి, వెంకటకృష్ణ, నీలవేణి, సింగారెడ్డి శ్రీరామచంద్రారెడ్డి, టక్కోలు మాచిరెడ్డి, సన్నపురెడ్డి వెంకటరామిరెడ్డి, పాలగిరి విశ్వప్రసాదరెడ్డి, ఎన్‌సి రామసుబ్బారెడ్డి, డా.జి.వి.సాయి ప్రసాద్, చంద్రశేఖర్, మొగిలిచెందు సురేష్ తదితరులు పాల్గొనగా, కళాకారులు గురువారెడ్డి, దశరధరామయ్య, ధర్మశెట్టి రమణ, చైతన్య శ్రీ రాయలసీమపై పాటలు, గేయాలు విన్పించి అందరినీ ఆకట్టుకున్నారు.

seema sadassu

ఇదీ చదవండి!

నేను - తను

నేను – తను (కవిత) – సన్నపురెడ్డి వెంకటరామిరెడ్డి

ఒక అభిప్రాయం మా మధ్య పెఠిల్లున విరిగినపుడు మేమిద్దరం చెరో ధృవం వైపు విసరేయబడతాము ఆమె మొహం నాకేదో నిషిద్ధ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

CAPTCHA * Time limit is exhausted. Please reload CAPTCHA.

error: