” సీమ” భూమి పుత్రుడు “మాసీమ”కు జోహార్..!

రాయలసీమ ఉద్యమనేత, సీనియర్ పాత్రికేయుడు మాసీమ రాజగోపాల్ రెడ్డి గురువారం (19-05-2011) తెల్లవారుఝామున కడపలోని తమ స్వగృహంలో కన్ను మూశారు. రాయలసీమ జనబాహుల్యంలో “మాసీమ” గా ప్రసిద్ధుడైన రాజగోపాల్ రెడ్డి  వయస్సు 80 సంవత్సరాలు. వెనుకబడిన రాయల సీమ అభివృద్ధి పట్ల, ఈ ప్రాంత ప్రజ సమస్యల పట్ల ఎనలేని శ్రద్ధతో పోరు సాగించిన ఈ ధీరోదాత్తుని మరణం రాయల సీమ ప్రజానీకానికి పిడుగు పాటు లాంటిదే! ..Rajagopal Reddy

కడప జిల్లా చెన్నూరు మండలం రామనపల్లె లో పెద్ద రైతు కుటుంబంలో రాజగోపాల్ రెడ్డి జన్మించారు. న్యాయవాద విద్యను అభ్యసించిన రాజగోపాల్ రెడ్డి “మాసీమ” పేరుతో పక్షపత్రికను స్తాపించిన సోషలిస్టు భావజాలంతో ప్రజాసమస్యలను, రాయలసీమ వాసుల కన్నీటి కడగండ్లను వెలుగులోకి తెచ్చేందుకు అవిశ్రాంతంతంగా కృషి చెశారు.

 

ఎమర్జెన్సీ కాలంలో ” మాసీమ”  పత్రికను ఆయుధంగా మలచి ప్రభుత్వ దమననీతి పై సమరం సాగించారు.  యెమర్జెన్సీలో ప్రభుత్వ అరాచకాలకు నిరసనగా తన పత్రిక సంపాదకీయపు పేజీని ఖాళీ గా ఉంచుతూ ఆ ఖాళీ పేజీకి ” సత్యం వధ..ధర్మం చెర” అనే శీర్షికను పెట్టారు. యెమర్జెన్సీలో ప్రజల బాధలకు దోసిళ్ళు పడుతూ వ్యాసాలను ప్రచురించారు. మాసీమ పత్రికలో వచ్చే రాతలపై కినుక వహించిన ఇందిరాగాంధీ ప్రభుత్వం “మాసీమ” అరెస్టు చేసి 18 నెలల పాటు ముషీరాబాదు సెంట్రల్ జైలులో నిర్భంధించిం ది.

 

శ్రీయుతులు జానుమద్ది హనుమచ్చాస్త్రి, పి.రామ కృష్ణా రెడ్డి , ముండ్ల  నారాయణ రెడ్డి సహకారంతో  ‘మాసీమ” ను ఒక శక్తివంతమైన పత్రికగా తీర్చిదిద్దారు. జానుమద్ది సంపాదకత్వంలో ” మాసీమ కవులు” అనే  గ్రంథాన్ని ప్రచురించారు.   తాను జైలులో ఉంటూ వీరి సాయంతో పత్రికను నడిపారు.

చదవండి :  పీసెట్‌లో మొదటి, ఆరవ ర్యాంకు మనోల్లకే..

 

రెండు దశాబ్దాల కిందట ఉవ్వెత్తున ఎగిసిపడిన రాయలసీమ ఉద్యమంలో డాక్టర్ వై.ఎస్. రాజశేఖర రెడ్డి, డాక్టర్  ఎంవీ మైసూరా రెడ్డి, డాక్టర్ ఎంవీ రమణా రెడ్డి , సి.హెచ్. చంద్ర శేఖర రెడ్డి, ఎం.జె.సుబ్బరామి రెడ్డి తదితరులతో కలసి ప్రధాన భూమికను పోషించారు.

 

కె.సి.కెనాల్ ఆయకట్టుదారుల సంఘం ఏర్పాటు చేయడంలో అగ్రభాగాన నిలవడమే కాకుండా తన జీవిత పర్యంతం కె.సి.కాలువ రైతాంగ సమస్యలపై తన గళాన్ని వినిపిస్తూనే వచ్చారు. 30 ఏళ్లుగా కేసీ కెనాల్ ఆయకట్టుదారుల సంఘం అధ్యక్షునిగా సేవలందిస్తూ వచ్చారు. రాయలసీమకు కృష్ణా జలాల సాధన కోసం కమ్యూనిస్టులతో పోరాటం చేయడానికీ ఆయన వెనుకాడలేదు .ప్రజలకు ఏదైనా సమస్య వస్తే సంబంధిత కార్యాలయం ఎదుట ఉద్యమం చేసే ప్రక్రియకు జిల్లాలో మొట్ట మొదట శ్రీకారం చుట్టింది ఆయనే. ఒక్క మాటలో చెప్పాలంటే మాసీమను జిల్లా ఉద్యమ పితామహుడిగా పేర్కొనడం అతిశయోక్తి కాదు.

 

” మాసీమ” ఒక దశలో ప్రత్యక్ష రాజకీయాల్లొకి రావాలనుకున్నారు. 1978, 1983లో రెండుసార్లు కడప ఎమ్మెల్యే స్థానానికి పోటీ చేశారు. 1978లో జనతా పార్టీ తరఫున పోటీ చేసి రంగారెడ్డి (కాంగ్రెస్) చేతిలో కేవలం 700 ఓట్లతో ఓటమి పాలయ్యారు. తిరుపతిలో ఎస్.వి.యూనివర్సిటీ స్థాపనకు, కడపలో రేడియో కేంద్రం ఏర్పాటుకు, కడప రైల్వే స్టేషన్ అభివృద్ధికీ పోరాటాలు నిర్వహించారు.

చదవండి :  ముగిసిన అనంతపురం గంగ జాతర

 

కడప జిల్లా రచయితల సంఘం ఏర్పాటులో “మాసీమ” కృషి మరువలేనిది.  స్టూడెంట్ సోషలిస్టు క్లబ్‌లను స్థాపించారు. సోషలిస్టు పార్టీలో రెండుసార్లు రాష్ట్ర కమిటీ సభ్యుడిగా ఎంపికయ్యారు. కడప పట్టణ అభివృద్ధి కోసం ‘కడప సేవా సమితి’ని స్థాపించి ప్రజాహిత కార్యక్రమాల్లో పాల్గొన్నారు. సోషలిస్టు ఉద్యమ నాయకులు రామమనోహర్ లోహియా, ఎన్‌సీ గంగిరెడ్డి, భుజంగరావు వంటి నాయకులతో కలిసి పనిచేశారు. ప్రత్యేక ఆంధ్ర ఉద్యమంలో కూడా ప్రధాన పాత్ర పోషిం చారు. అప్పుడు ఒకటిన్నర నెలపాటు జైలు జీవితం గడిపారు. 1964లో అదనపు భూమి శిస్తు కోసం రైతులతో కలిసి ఉద్యమం నడిపి నెలపాటు జైలుకెళ్లారు. ప్రజలకు ఏదైనా సమస్య వస్తే సంబంధిత కార్యాలయం ఎదుట ఉద్యమం చేసే ప్రక్రియకు జిల్లాలో మొట్ట మొదట శ్రీకారం చుట్టింది ఆయనే. ఒక్క మాటలో చెప్పాలంటే మాసీమను జిల్లా ఉద్యమ పితామహుడిగా పేర్కొనడం అతిశయోక్తి కాదు. నిరాహార దీక్ష చేసి 1993లో ఏపీ ఇండస్ట్రీయల్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఆధీనంలో ఉన్న లింగంపల్లె వాటర్ వర్క్స్‌ను కడప మున్సిపాలిటీ పరమయ్యేలా చేశారు. ప్రభుత్వ ఆస్పత్రుల్లో రోగుల పట్ల వైద్యుల నిర్లక్ష్య వైఖరికి నిరసనగా ‘ఛలో ఆస్పత్రి’ ఆందోళనకు నాయకత్వం వహించారు. సమకాలిన రాజకీయాల్లో ఇమడలేక కొన్నాళ్లుగా ఆయన రాజకీయాలకు దూరంగా ఉంటున్నారు. ఈయనకు ముగ్గురు కుమారులు, ఒక కుమార్తె ఉన్నారు.
ప్రముఖుల నివాళి

చదవండి :  తుమ్మలపల్లె యురేనియం శుద్ధి కర్మాగారం ప్రారంభం

కాగా మాసీమ ఆకస్మిక మృఖ సాహితీ వేత్త జానుమద్ది హనుమచ్చాస్త్రి, ప్రముఖ రచయిత పి.రామ కృష్ణా రెడ్డి, తి పట్ల మాసీమ మృతదేహాన్ని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి డాక్టర్ కె.నారాయణ, ఎమ్మెల్సీ సి నారాయణరెడ్డి, తులసిరెడ్డి, ఎమ్మెల్యే ఆకేపాటి, రైతు సంఘం రాష్ట్ర కార్యదర్శి కె. రామకృష్ణ, మాజీ ఎమ్మెల్యేలు రఘురామిరెడ్డి, కందుల సందర్శించారు. అలాగే ఏఐటీయూసీ రాష్ట్ర నాయకులు జి.ఓబులేసు, జెడ్పీ మాజీ చైర్మన్ కె.సురేష్‌బాబు, సీపీఎం జిల్లా కార్యదర్శి నారాయణ, రాయసీమ పౌరహక్కుల సంఘం కన్వీనర్ ఎం.జె.సుబ్బరామి రెడ్డి, కథారచయిత,సీనియర్ జర్నలిస్టు తవ్వా ఓబుల్ రెడ్డి, సీపీఐ జిల్లా కార్యదర్శి పులి కృష్ణమూర్తి, పీఆర్పీ జిల్లా అధ్యక్షుడు హరిప్రసాద్,లింగమూర్తి, చంద్రమౌళీశ్వర్‌రెడ్డి, జానమద్ది హనుమచ్ఛాస్త్రి, కట్టా నరసింహులు, జానకిరాం, సీహెచ్, మంత్రి అహ్మదుల్లా సోదరుడు హబీబుల్లా, ఆయన కుమారుడు హఫీజుల్లా, మైనార్టీ నాయకులు ఎస్‌బీ అంజాద్‌బాష, అఫ్జల్‌ఖాన్, మాజీ కార్పొరేటర్లు ఎంవీఆర్ ప్రసాద్‌రెడ్డి, పాకా సురేష్, షంషీర్, హరినారాయణ, వేణుగోపాల్‌రెడ్డి, కాంగ్రెస్ నాయకులు శంకర్‌రెడ్డి, రాజోలి వీరారెడ్డి, మధుసూదన్‌రెడ్డి, నజీర్ అహ్మద్, నవనీశ్వర్‌రెడ్డి, ఎస్‌ఏ కరీముల్లా, సీపీఎం నాయకులు రవిశంకర్‌రెడ్డి, సీపీఐ నాయకులు నాగసుబ్బారెడ్డి సందర్శించి నివాళులర్పించారు. వారి కుటుంబ సభ్యులకు సానుభూతి తెలిపారు.
మైదుకూరు రైతు సేవా సంఘం అధ్యక్షుడు డి.ఎన్.నారాయణ, తమ ప్రగాఢ సంతాపం వ్యక్తం చేశారు. కాగా మాసీమ భౌతిక కాయానికి  ( 20-05-2011 ) శుక్రవారం కడపలో అంత్యక్రియలు జరుగుతాయి.

 

” సీమ”  భూమి పుత్రుడు మాసీమకు జోహార్..! జోహార్..!!

ఇదీ చదవండి!

kadapa district map

ఎలెక్ట్రానిక్ వార్‌ఫేర్ ల్యాబూ పోయే!

DRDO వాళ్ళు ఎలెక్ట్రానిక్ వార్‌ఫేర్ లాబ్ నెలకొల్పడానికి ఒకేచోట 3,400 ఎకరాలు అవసరమై, ఏరికోరి కడప నగర శివార్లలోని కొప్పర్తిలో …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

CAPTCHA * Time limit is exhausted. Please reload CAPTCHA.