ముఖ్యమంత్రి సుముఖంగా లేరు

  • రాయలసీమ అభివృద్ధిపై వివక్ష
  • రాష్ర్టానికి, జిల్లాకు ఒరిగిందేమీ లేదు
  • టీడీపీకి ఎక్కువ స్థానాలు రాలేదన్న అక్కసుతోనే
  • ఆర్భాటాలు తప్ప ప్రజా సంక్షేమం పట్టడం లేదు
  • ఎర్రచం’ధనం’ సీమ కోసం ఖర్చు చేయాల

కడప: రాయలసీమ ప్రాంత అభివృద్ధి గురించి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వివక్ష చూపుతున్నారని శాసనమండలిలో విపక్షనేత సి.రామచంద్రయ్య ఆరోపించారు. ఈ రోజు (శుక్రవారం) స్థానిక కాంగ్రెస్‌ పార్టీ (జిల్లా) కార్యాలయంలో ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ…

జిల్లాలో స్టీలు ప్లాంటు ఏర్పాటు చేసే అంశంలోనూ అలాగే ఎయిర్‌పోర్టు ప్రారంభోత్సవం చేసేందుకు కూడా ముఖ్యమంత్రి సుముఖంగా లేరన్నారు. కేంద్ర ప్రభుత్వంతో చంద్రబాబుకు సత్సంబంధాలున్నా రాష్ర్టానికి, జిల్లాకు ఒరిగిందేమీ లేదన్నారు. రైల్వే జోన్‌ సీమలో ఏర్పాటు చేయకుండా వైజాగ్‌ ప్రాంతంలో ఏర్పాటు చేసే ఆలోచనలో వున్నారన్నారు. రాయలసీమలో టీడీపీకి ఎక్కువ స్థానాలు రాలేదన్న అక్కసుతో సీమ ప్రాంత అభివృద్ధి గురించి కావాలనే ముఖ్యమంత్రి దాటవేస్తున్నారన్నారు.

చదవండి :  కడప జిల్లా పేరు మార్పు

రాయలసీమకు సాగు, తాగు నీటి ప్రాజెక్టులకు నీరందించే విషయం అటకెక్కించారన్నారు. సోమశిల బ్యాక్‌వాటర్‌ను జిల్లాకు తెప్పించే విషయంగా ప్రభుత్వం ప్రపోజల్‌ పంపిందే కాని అమలు చేయడంలో అలసత్వం ప్రదర్శిస్తున్నదన్నారు.

హంద్రీనీవా ప్రాజెక్టు ద్వారా అనంతపురానికి నీరు తెప్పిస్తే అక్కడి ప్రజల కష్టాలు గట్టెక్కుతాయన్నారు. కానీ ఆ విషయంలో శ్రద్ధ పెట్టడం లేదన్నారు.

జిల్లాలోని మంగంపేటలో 174 పల్వరైజింగ్ మిల్లులు వున్నాయన్నారు. వాటికి సకాలంలో ఖనిజం అందకుండా చంద్రబాబు అడ్డుపడుతున్నారన్నారు. ఇప్పటికైనా చంద్రబాబు స్పందించి మిల్లులు రన్‌ అయ్యేలా చర్యలు తీసుకోవాలన్నారు. లేదంటే సుమారు 30 వేల మంది కార్మికులు రోడ్డున పడే అవకాశాలు వున్నాయన్నారు.

చదవండి :  వైకాపాకు మైసూరారెడ్డి రాజీనామా

లక్ష కోట్ల బడ్జెట్‌ ప్రవేశపెట్టిన బాబు రాయలసీమ అభివృద్ధికి అందులో 200 కోట్లు ఖర్చు పెట్టేందుకు కూడా సిద్ధంగా లేరన్నారు. రైతు రుణమాపీ, డ్వాక్రా రుణమాపీ విషయంలో అదిగో చేస్తాం, ఇదిగో చేస్తామంటూ ప్రజలను నమ్మించే ప్రయత్నాలు చేయడం తప్ప చేసిందేమీ లేదన్నారు. రైతు రుణమాఫీలో అన్ని షరతులేనన్నారు. దీంతో రై తులకు చంద్రబాబుపై నమ్మకం పోయిందన్నారు.

ఎంతసేపు నవ్యాంధ్ర రాజధాని అంటూ విదేశీ ప్రయాణాలు, పారిశ్రామికవేత్తలతో భేటీలు, 40 అంతస్తుల భవనాలు, మెట్రోరైలు, కారిడార్‌లు అంటూ తీరికలేని సమావేశాలతో ఆర్భాటాలు చేయడం తప్ప ప్రజల సంక్షేమం, అభివృద్ధి గురించి మరచిపోయారన్నారు.

చదవండి :  శ్రీశైలం నీటిని ‘సీమ’కు తరలించాలి

ఇప్పటికైనా చంద్రబాబు మేల్కొని సీమ ప్రజలు తిరగబడకముందే ఈ ప్రాంత అభివృద్ధి పనులను త్వరిగతిన చేపట్టాలన్నారు. ఎర్రచందనం అమ్మకాల ద్వారా వచ్చే కోట్లాది రూపాయలను సీమప్రాంత అభివృద్ధికి మాత్రమే ఖర్చు చేయాలని డిమాండ్‌ చేశారు.

ఇదీ చదవండి!

అన్నమయ్య దర్శించిన

అన్నమయ్య దర్శించిన ఆలయాలు

ఆహోబిల మఠ సంస్తాపనాచార్యులైన శ్రీమాన్ శఠగోప యతీంద్రుల దగ్గర సకల వైష్ణవాగమాలను అభ్యసించిన పిదప దారి వెంబడి పలు ఆలయాలను …

Leave a Reply

Your email address will not be published.

CAPTCHA * Time limit is exhausted. Please reload CAPTCHA.

error: