నేడు మొయిళ్లకాల్వ ఉరుసు

కడప: పెండ్లిమర్రి మండలంలోని మొయిళ్లకాల్వ గ్రామంలో వెలసిన హజరత్ హుస్సేని వల్లీదర్గాలో శుక్రవారం ఉరుసు ఉత్సవం జరుగుతుందని దర్గాకమిటీ సభ్యులు ఒక ప్రకటనలో తెలిపారు.

శుక్రవారం రాత్రి 9గంటలకు గంధం, శ్రీనివాసరావు బృందంచే శ్రీవీరబ్రహ్మేంద్రస్వామి జీవిత చరిత్ర నాటకం ఉంటుందని, రాత్రి అన్న సంతర్పణ నిర్వహిస్తున్నామని వారు పేర్కొన్నారు.

10గంటలకు పూలచాందినితో గ్రామపురవీధుల్లో ఫకీర్ల మేళతాళాలతో చదివింపులు సమర్పిస్తామన్నారు.

బండలాగుడు పోటీలు

మద్యాహ్నం 2గంటల నుంచి వృషభరాజములచే బండలాగుడు పోటీలు నిర్వహిస్తున్నామన్నారు. గెలుపొందిన ఎడ్ల యజమానులకు ప్రథమ బహుమతిగా రూ.25,116, రెండవ బహుమతిగా రూ.15,116లు, తృతీయ బహుమతిగా రూ.10,116లు, నాల్గవ బహుమతిగా రూ.5,116లు ఐదవ బహుమతిగా రూ.3,116లు అందిస్తామన్నారు.

చదవండి :  ఈ రోజూ రేపూ కమలాపురం చిన్నదర్గా ఉరుసు

ఇదీ చదవండి!

tirunaalla

రేపూ…మన్నాడు ఆస్థానే మురాదియాలో ఉరుసు ఉత్సవాలు

కడప: స్థానిక వన్‌టౌన్‌ పోలీస్‌స్టేషన్‌ దగ్గర గల హజరత్‌ ఖ్వాజా సయ్యద్‌షామొహర్‌ అలీ (మొరి సయ్యద్‌సాహెబ్‌ వలి) 417వ ఉరుసు …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

CAPTCHA * Time limit is exhausted. Please reload CAPTCHA.

error: