ఆదివారం ఇడుపులపాయలో వైకాపా రెండో ప్లీనరీ

కడప: వైఎస్సార్ కాంగ్రెస్ రెండో ప్లీనరీ సమావేశం ఫిబ్రవరి 2వ తేదీన ఇడుపుల పాయలో జరుగుతుంది. కేంద్ర ఎన్నికల కమిషన్ నిబంధనలకు లోబడి ఈ సమావేశంలో పార్టీ అధ్యక్ష ఎన్నిక జరుగనుంది. ఫిబ్రవరి 1వ తేదీన ఇడుపులపాయలో పార్టీ పాలక మండలి(సీజీసీ) సమావేశం, అధ్యక్ష పదవికి ఎన్నికల షెడ్యూలు వెలువడనుంది. 2వ తేదీన ప్లీనరీ జరుగుతున్నపుడే అధ్యక్ష ఎన్నిక ఫలితం కూడా వెల్లడిస్తారు.

పార్టీ సంస్థాగత ఎన్నికల కన్వీనర్ ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు మంగళవారం హైదరాబాదులోని పార్టీ కేంద్ర కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో సంస్థాగత వ్యవహారాల రాష్ట్ర కోఆర్డినేటర్ పి.ఎన్.వి.ప్రసాద్‌తో కలిసి మాట్లాడుతూ ప్లీనరీ, పార్టీ అధ్యక్ష ఎన్నికకు సంబంధించిన వివరాలను తెలిపారు.

YSR Congressఫిబ్రవరి 1న మధ్యాహ్నం 2.30 నుంచి 3.00 గంటల వరకు సీజీసీ సమావేశం జరుగుతుంది. 3.00 గంటలకు పార్టీ అధ్యక్ష పదవి ఎన్నికకు షెడ్యూలును విడుదల చేస్తారు. 3.00 నుంచి 4.00 గంటల వరకు అధ్యక్ష పదవికి నామినేషన్ల స్వీకరణ జరుగుతుంది. 4.00 నుంచి 4.30 వరకు నామినేషన్లను పరిశీలిస్తారు. సాయంత్రం 5.00 గంటలకు ఆమోదిత నామినేషన్ల వివరాను ప్రకటిస్తారు.

చదవండి :  తెదేపా గూటికి చేరిన వరద

ఫిబ్రవరి 2వ తేదీన ఉదయం 8.30 నుంచి 11.30 గంటల వరకు ఎన్నికల పోలింగ్, 11.30 నుంచి 12.30 వరకు ఓట్ల లెక్కింపు జరుగుతుంది. మధ్యాహ్నం 12.30 గంటలకు ఎన్నిక ఫలితాన్ని ప్రకటిస్తారు. రాష్ట్ర స్థాయి విసృ్తత సమావేశం ఓ వైపు జరుగుతూ ఉండగానే అధ్యక్ష పదవికి పోలింగ్ అవసరమైతే మరో వైపు నిర్వహిస్తారని ఉమ్మారెడ్డి తెలిపారు. ప్లీనరీలో తొలుత దివంగత వైఎస్సార్‌కు నివాళులర్పిస్తారని, పార్టీ ఆవిర్భవించినప్పటి నుంచి మృతి చెందిన నేతలకు సంతాపం ప్రకటిస్తారని ఆయన అన్నారు. పార్టీ గౌరవాధ్యక్షురాలు వై.ఎస్.విజయమ్మ ప్రారంభోపన్యాసం చేస్తారని, షర్మిల ప్రసంగిస్తారని ఆయన పేర్కొన్నారు. పార్టీ అధ్యక్షుని ముగింపు సందేశం కూడా ఉంటుందన్నారు.

చదవండి :  వైకాపా అభ్యర్థుల జాబితా

ప్లీనరీకి ఆహ్వానితులు వీరే!

ఫిబ్రవరి 2వ తేదీన ప్లీనరీలో జరిగే విసృ్తత స్థాయి సమావేశానికి పార్టీలో 27 రకాల హోదాలున్న వారిని ప్రతినిధులుగా ఆహ్వానించినట్లు పి.ఎన్.వి.ప్రసాద్ తెలిపారు. పార్టీ సలహాదారులు, సీజీసీ, సీఈసీ సభ్యులు, ఎం.పి, ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలు, లోక్‌సభా నియోజకవర్గ పరిశీలకులు, శాసనసభా నియోజకవర్గాల కోఆర్డినేటర్లు, రాష్ట్ర అధికార ప్రతినిధులు, మాజీ ఎం.పి, ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలు, ప్రాంతీయ కోఆర్డినేటర్లు, వివిధ విభాగాల రాష్ట్ర స్థాయి కమిటీల కన్వీనర్లు, కోఆర్డినేటర్లు, వివిధ విభాగాల రాష్ట్ర స్థాయి కమీటీల సభ్యులు, జిల్లా, సిటీల పార్టీ కన్వీనర్లు, రాష్ట్ర అనుబంధ కమిటీల కన్వీనర్లు,డీసీసీబీ, డీసీఎంఎస్ ఛైర్మన్లు, మాజీ డీసీసీబీ, డీసీఎంఎస్ ఛైర్మన్లు, జిల్లాల పరిశీలకులు, జిల్లాల అధికార ప్రతినిధులు, జిల్లా పరిషత్ మాజీ అధ్యక్షులు, మున్సిపల్ పరిశీలకులు, కార్పొరేషన్ మాజీ మేయర్లు, పార్టీ సంస్థాగత ఎన్నికల జిల్లాల అధికారులు, జిల్లాల స్టీరింగ్ కమిటీ సభ్యులు, మండల,మున్సిపల్,నగర డివిజన్ కన్వీనర్లు, రాష్ట్ర అనుబంధ కమిటీల సభ్యులు, మున్సిపల్ మాజీ ఛైర్మన్లు, మాజీ జడ్పీటీసీ, ఎంపీటీసీలు, జిల్లాల అనుబంధ విభాగాల కన్వీనర్లను ఆహ్వానించామని ఆయన తెలిపారు. మొత్తం 9000 మంది హాజరవుతారని ఆయన తెలిపారు.

చదవండి :  రాయచోటి శాసనసభ స్థానానికి నామినేషన్లు వేసిన అభ్యర్థులు

సంస్థాగత ఎన్నికల కన్వీనర్‌గా ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లును పార్టీ అధ్యక్షుడు వై.ఎస్.జగన్‌మోహన్‌రెడ్డి నియమించారని ప్రసాద్ వివరించారు. ప్రతి ఏటా వైఎస్సార్ జయంతి రోజున ప్లీనరీ జరుపాలని భావించినప్పటికీ ఈ దఫా మాత్రం సంస్థాగత ఎన్నికల రీత్యా ఫిబ్రవరి 1,2 తేదీల్లోనే నిర్వహిస్తున్నామని తెలిపారు. ప్లీనరీ రెండో రోజున విసృ్తత సమావేశం ఉదయం 9 గంటలకే ప్రారంభం అవుతుంది కనుక ప్రతినిధులంతా సభా ప్రాంగణానికి త్వరగా వచ్చేసి 8.30 గంటలకే రిజిస్ట్రేషన్ చేయించుకుని పాల్గొనాలని ఆయన కోరారు.

ఇదీ చదవండి!

వైఎస్ హయాంలో

వైఎస్ హయాంలో కడపకు దక్కినవి

వైఎస్ హయాంలో కడప అభివృద్ధి వైఎస్‌గా చిరపరిచితుడైన కడప జిల్లాకు చెందిన దివంగత యెడుగూరి సందింటి రాజశేఖరరెడ్డి గారు 14/05/2004 నుండి 02/09/2009 …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

CAPTCHA * Time limit is exhausted. Please reload CAPTCHA.

error: