అందమైన దాన
యువతి వర్ణ చిత్రము (గూగుల్ నుండి స్వీకరించబడినది)

కదిరి చిన్నదానా …. జానపదగీతం

వర్గం: యాలపాట

పాడటానికి అనువైన రాగం: మాయా మాళవ గౌళ (త్రిశ్ర ఏకతాళం)

కదిరి చిన్నదానా
కదిరేకు నడుముదానా
నిన్నెట్ల మరచుందునే
మరదల మాణిక్యమా ||కదిరి||

నీ సిల్కు సీరెకు
రేణిగుంట్ల రేయికాకు
నిన్నెట్ల మరచుందునే
మరదల మాణిక్యమా ||కదిరి||

నీ సైజు చేతులకు
సైదాపురం గాజులకు
నిన్నెట్ల మరచుందునే
మరదల మాణిక్యమా ||కదిరి||

పులివెందుల పూలాకు
నీ వాలు జడలాకు
నిన్నెట్ల మరచుందునే
మరదల మాణిక్యమా ||కదిరి||

ముద్దనూరి ముద్దులకు
నీ సన్న పెదవులకు
ముద్దెట్ల మరచుందునే
మరదల మాణిక్యమా ||కదిరి||

చదవండి :  పాలెగాళ్ల పాలనకు సజీవ సాక్ష్యం "దుర్గం కోట "

తిరుపతి పోదాము
తిరుణాల చూపిస్తా
నిన్నెట్ల మరచుందునే
మరదల మాణిక్యమా ||కదిరి||

పాటను సేకరించినవారు: కీ.శే.కలిమిశెట్టి మునెయ్య

ఇదీ చదవండి!

మామరో కొండాలరెడ్డి

మామరో కొండాలరెడ్డి – జానపదగీతం

మామరో కొండాలరెడ్డి మామిడీ పూవంటిదాన్ని పాయముంటే ఏలుకుంటావా కొండాలరెడ్డి-సేసుకొని సూసుకుంటావా అంతనైతి ఇంతనైతి సంతలో నెరవాజి నైతి తగులుకొని నీయంట …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

CAPTCHA * Time limit is exhausted. Please reload CAPTCHA.

error: