జిల్లా స్వరూపాన్ని మార్చడానికి పథకరచన చేస్తున్నారా!

కోడూరు: ఒకప్పుడు మత్స్యకారుల గ్రామంగా ఉన్న విశాఖపట్టణంలో ఉక్కు కర్మాగారాన్ని ఏర్పాటు చేయడంతో అంతర్జాతీయస్థాయిలో గుర్తింపు సాధించిందని అదేస్థాయిలో కడపలోనూ ఉక్కు కర్మాగారాన్ని నిర్మించి జిల్లా స్వరూపాన్నే మార్చేయడానికి ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు పథకరచన చేస్తున్నట్లు జిల్లాకు ఇంచార్జిగా వ్యవహరిస్తున్న రాష్ట్ర సాంఘిక, సంక్షేమశాఖ మంత్రి రావెల కిషోర్‌బాబు పేర్కొన్నారు. రైల్వేకోడూరు నియోజకవర్గంలో గురువారం నిర్వహించిన జన్మభూమి కార్యక్రమంలో పాల్గొన్న  మంత్రి మాట్లాడుతూ.. పదేళ్లపాటు రాష్ట్రాన్ని పరిపాలించిన గత పాలకులు కడప జిల్లాతో పాటు రాష్ట్రాన్ని కూడా భ్రష్టుపట్టించారన్నారు. ఇక్కడి ప్రజలను తమ స్వార్థప్రయోజనాలకు వాడుకోవడం తప్ప జిల్లాను అభివృద్ధి చేసింది ఏమీ లేదన్నారు.

చదవండి :  కడప జిల్లా పేరు మార్పు

ప్రస్తుతం చంద్రబాబు కడప జిల్లాకు అనేక విద్యా సంస్థలు, పరిశ్రమలు, తాగు, సాగునీటి వనరులను, వైద్య సదుపాయాలను తీసుకురావడానికి ప్రయత్నం చేస్తున్నారని చెప్పారు. ఉక్కు కర్మాగారం ఏర్పాటుతో ప్రత్యక్షంగా నలభైవేలమందికి, పరోక్షంగా అరవైవేల మందికి వెరసి లక్షమందికి ఉపాధి అవకాశాలు ఏర్పడతాయన్నారు.

ఈ నెల 14న విమానాశ్రయాన్ని ప్రారంభి స్తుండడంకూడా జిల్లా అభివృద్ధికోసమేనని ఆయన చెప్పారు.

మంత్రిగారు భలేగా చెబుతున్నారు. గతంలో ఎన్నికల ప్రచారం సమయంలోనే ఇప్పటి ముఖ్యమంత్రి జిల్లాకు ఏమి చేయాలనేది తమ పార్టీ ఆలోచించిందని ఆ మేరకే ఎన్నికల ప్రచారంలో హామీలు ఇస్తున్నానని చెప్పారు. ఆనక రాజధాని ప్రకటన సమయంలో అంతకు ముందు ఇచ్చిన హామీల ఊసు లేకుండా కొత్త హామీలు గుప్పించారు.  ఇంతకీ ఈ పథక రచన ఎప్పటికి ముగుస్తుందో.. మన కడప జిల్లా రూపు రేఖలు ఏ విధంగా మారతాయో!

చదవండి :  ఉప ఎన్నికలకు టీడీపీ అభ్యర్థుల ఖరారు

ఇదీ చదవండి!

బిందు సేద్యం

బిందు సేద్యం చేయండి: చంద్రబాబు

ఊటుకూరు వద్ద రైల్వే ఫ్లైఓవర్  నిర్మాణానికి శంకుస్థాపన కడప: జిల్లా రైతులు బిందు సేద్యం ద్వారా పంటలు సాగు చేయాలని …

ఒక వ్యాఖ్య

  1. Every thing is bushit and bogus no body is trusting this bulshit news and minister statment.Nothing is going to happen or as we are Kadapa peoples should not expect any good things from Mr. Chandra babu he will just time pass and waste the time as it is happen to Kadapa airport.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

CAPTCHA * Time limit is exhausted. Please reload CAPTCHA.

error: