తాగునీరూ కష్టమే!

కోస్తాంధ్రలో జరిగిన నీటి పారుదల సౌకర్యాల అభివృద్ధి బ్రిటిష్ కాలం నాటిది. కానీ నిజాం ప్రభుత్వం హయాంలో తెలంగాణ అలాంటి అభివృద్ధికి నోచుకోలేదు. 1957 తరువాత మిగిలిన రెండు ప్రాంతాలతో పోల్చి చూసినప్పుడు సాగునీటి పథకాల అభివృద్ధి తెలంగాణ ప్రాంతంలోనే ఎక్కువ జరిగింది.

ఆంధ్రప్రదేశ్ విభజన జరిగితే నదీ జలాల పంపీణీలో అదనం గా ఉత్పన్నమయ్యే సమస్యలు ఏమీ ఉండబోవని కొందరు తెలంగాణ ప్రాంత ప్రముఖులు వాదిస్తున్నారు. అంటే ఇప్పుడు న్న సమస్యలే తప్ప అదనంగా ఎదురయ్యే సమస్యలు ఉండ వని వారి భావన. ఇది వాస్తవం కాదు. తెలంగాణ ప్రజలను మభ్యపెట్టడానికి చేస్తున్న వాదనే ఇది. ఈ వాదన ఎంత అసంబద్ధమో చర్చించాలి. 1956లో ఆంధ్రప్రదేశ్ అవతరించినప్పుడు, రాష్ట్రం లో సాగుభూమి వివరాలు ఇవి: ఆంధ్రలో 19.37 లక్షల హెక్టార్లు, రాయలసీమలో 5.31 లక్షల హెక్టార్లు, తెలం గాణలో 9.31 లక్షల హెక్టార్లు. అదే 2008 సంవత్సరం వచ్చే సరికి సాగుభూమి ఆంధ్రలో 30.68 లక్షల హెక్టార్లు, రాయలసీమలో 7.72 లక్షల హెక్టార్లు, తెలంగాణలో 24.45 లక్షల హెక్టార్లకు పెరిగింది. అదనంగా జలాలను కేటాయించి, పథకాలను నిర్మించడంవల్ల ఈ అభివృద్ధి సాధ్యమైంది.

ఆంధ్రప్రదేశ్ అవతరణ తరువాత తెలం గాణ ప్రాంతం విశేషంగా లాభపడిన సంగతిని ఇక్కడ గమనించవచ్చు. ఆ ప్రాంతంలో 163 శాతానికి మించి సాగుభూమి విస్తరించింది. మిగిలిన రెండు ప్రాంతాలలో సాగుభూమి విస్తరించింది తక్కువే. కాబట్టి తెలంగాణకు న్యాయం జరగలేదనడం, నిర్లక్ష్యానికి గురైందని ఆరోపించ డం వాస్తవంకాదు. అలాగే సీమాంధ్ర ప్రజలు జల చౌర్యా నికి పాల్పడ్డారన్న ఆరోపణ కూడా పూర్తిగా సత్యదూరం. నిజానికి రాయలసీమ, కోస్తాంధ్రలో జరిగిన నీటి పారు దల సౌకర్యాల అభివృద్ధి బ్రిటిష్ కాలం నాటిది. కానీ నిజాం ప్రభుత్వం హయాంలో తెలంగాణ అలాంటి అభి వృద్ధికి నోచుకోలేదు. 1957 తరువాత మిగిలిన రెండు ప్రాంతాలతో పోల్చి చూసినప్పుడు సాగునీటి పథకాల అభివృద్ధి తెలంగాణ ప్రాంతంలోనే ఎక్కువ జరిగింది. కాబట్టి ఆంధ్రప్రదేశ్ అవతరణ తరువాతే తెలంగాణ అభి వృద్ధి చెందిందని నిర్ద్వంద్వంగా చెప్పవచ్చు.

చదవండి :  తప్పుదోవలో 'బస్సు ప్రయాణం'

ఇప్పుడు అన్నపూర్ణ కాదు కదా

ఒకప్పుడు అన్నపూర్ణ అని, ధాన్యాగారం అని కోస్తాంధ్రకు దేశంలోనే ఖ్యాతి ఉండేది. ప్రస్తుతం భారత ఆహార సంస్థ, ఆంధ్రప్రదేశ్ పౌరసరఫరాల కార్పొరేషన్ చెబుతున్న వివరాల ప్రకారం వ్యవసాయోత్పత్తులలో తెలంగాణ రాష్ట్రం లోని మిగిలిన రెండు ప్రాంతాలకూ తీసిపోదు. అంటే రాష్ట్ర ప్రభుత్వ చర్యలవల్ల రాయలసీమ, కోస్తాంధ్రలకంటే తెలంగాణయే ఎక్కువ లబ్ధిపొందింది. రాష్ట్రంలో గోదా వరి, కృష్ణా, పెన్నా ప్రధానమైన పరీవాహక ప్రాంతాలు. పెన్నా పరీవాహక ప్రాంతం కేవలం రాయలసీమ, నెల్లూరు జిల్లాకు చెందిన పరిమిత బేసిన్. కానీ గోదావరి, కృష్ణా బేసిన్‌లు విస్తారమైనవి. గోదావరి బేసిన్ కోస్తాంధ్ర, తెలంగాణకు చెందినది కాగా, కృష్ణ మాత్రం మన మూడు ప్రాంతాలకు సంబంధించినది. కృష్ణా జలాలకు సంబం ధించి 1976లో బచావత్ ట్రిబ్యునల్ తన తీర్పును ప్రక టించింది. అప్పుడు ఆంధ్రప్రదేశ్‌లో ఒక్క జూరాల ప్రాజె క్టుకే (17.9 టీఎంసీలు) ట్రిబ్యునల్ కేటాయింపులు చేసింది.

ఆంధ్ర, రాయలసీమలోని కొత్త ప్రాజెక్టులకు ఒక్క టీఎంసీల నీరు కూటా కేటాయించలేదు. రాయలసీమ దుర్భిక్ష ప్రాంతానికి సాగునీటి అవసరం ఇతోధికంగా ఉన్నప్పటికీ ఆ అంశాన్ని పరిగణనలోకి తీసుకోలేదు. అయితే మూడు ప్రాంతాలలో దాదాపు పూర్తి కావస్తున్న జల పథకాల కోసం మిగులు జలాలను పంచుకునే స్వేచ్ఛ ను రాష్ట్ర ప్రభుత్వానికి ట్రిబ్యునల్ ఇచ్చింది. సీమాంధ్రలో నిర్మాణంలో ఉన్న ప్రాజెక్టులకు నీటి అవసరాలు ఇలా ఉన్నాయి. తెలుగు గంగ 29 టీఎంసీలు, గాలేరు-నగరి 50 టీఎంసీలు, హంద్రీ-నీవా 40 టీఎంసీలు, వెలిగొండ 43.5 టీఎంసీ (162.5 టీఎంసీలు) నీరు అవసరం. తెలంగాణ ప్రాంతంలోని నెట్టెంపాడుకు 22 టీఎంసీలు, కల్వకుర్తికి 25 టీఎంసీలు, ఎస్‌ఎల్‌డీసీకి 30 టీఎంసీలు నీరు అవ సరం అవుతుంది. ఈ ప్రాజెక్టులన్నీ మంచి వర్షాలు పడిన కాలంలో కళకళలాడతాయి. తక్కువ వర్షపాతం నమోదైతే వెలవెలబోతాయి.

కరుణించని శ్రీబాగ్

శ్రీబాగ్ ఒప్పందం ప్రకారం కృష్ణా, పెన్నా బేసిన్‌ల నుంచి నీటిని ఉపయోగించదలిస్తే రాయలసీమతో పాటు నెల్లూరు జిల్లాకు ప్రాధాన్యం ఇవ్వాలి. 1937లో ఈ మేరకు ఒప్పందం జరిగింది. 1953లో ఆంధ్ర రాష్ట్రం అవతరించినప్పుడు కూడా కృష్ణా నది మీద ఎలాంటి ప్రాజెక్టుల నిర్మాణం చేపట్టలేదు. 1956లో ఆంధ్రప్రదేశ్ అవతరించే వరకు ఇదే కొనసాగిం ది. ఆంధ్రప్రదేశ్ అవతరించిన తరువాత కృష్ణా, పెన్నా బేసిన్‌లలో కొన్ని పథకాల నిర్మాణం చేపట్టారు. కానీ రాయలసీమను పట్టించుకోలేదు. తరువాత కూడా ప్రభు త్వాలు ఈ ఒప్పందం అమలును విస్మరించడంతో రాయ లసీమకు కృష్ణా లేదా మిగిలిన వనరుల నుంచి నీళ్లు లభిం చలేదు. ఈ నిర్లక్ష్యం వల్లే రాయలసీమ నేటి వరకు కూడా తాగు, సాగు నీటి అవసరాలు, పారిశ్రామిక అవసరాలకు నోచుకోకుండాపోయింది. మిగిలిన ప్రాంతాలు పంటలతో కళకళలాడుతుండగా రాయలసీమ మాత్రం ఒక్క మెట్ట పంటకు కూడా నోచుకోవడం లేదు. కాబట్టి మిగిలిన ప్రాం తాలను దృష్టిలో ఉంచుకుంటే అధిక కేటాయింపులు కావా లన్న రాయలసీమ కోర్కె న్యాయ సమ్మతమైనది. మిగిలిన ప్రాంతాలలో పలు పథకాలు పూర్తయ్యాయి. వారి అవస రాలు తీరాయి. 300 టీఎంసీల గోదావరి జలాలను రాయ లసీమ అవసరాల కోసం పోలవరం, దుమ్ముగూడెం, కంతానపల్లి ప్రాజెక్టుల ద్వారా కృష్ణకు తరలించడం అనివార్యం.

చదవండి :  ఉత్తుత్తి వాగ్దానాలతో మళ్ళా కడప నోట మట్టికొట్టిన ప్రభుత్వం

ఇక నియంత్రణ మండళ్ల దయ

ఆంధ్రప్రదేశ్‌ను చిన్న రాష్ట్రాలుగా విభజిస్తే నదీ జలా ల పంపిణీలోను, పథకాల నిర్వహణలోను అసంఖ్యా కంగా తీవ్ర సమస్యలు ఎదురవుతాయన్నది సుస్పష్టం. రాష్ట్రం విడిపోతే కృష్ణ మీద నిర్మించిన ప్రాజెక్టుల నిర్వ హణ కోసం నియంత్రణ మండలిని ఏర్పాటు చేయాలి. రాజోలి బండ, పోతిరెడ్డిపాడు, శ్రీశైలం, నాగార్జునసాగర్, పులిచిం తల మొదలైన ప్రాజెక్టుల విషయంలో ఇలాంటి సమస్యలు అనివార్యం. ప్రాజెక్టుల నిర్వహణ, వాటి కనిష్ట వినియో గాలకు ఈ నియంత్రణ మండళ్ల ఏర్పాటు తప్పనిసరి. ప్రయోజనాల విషయంలో వైరుధ్యాలు ఉండటంవల్ల విద్యుదుత్పాదన, వరద నివారణ చర్యలు జలాశయాల నిర్వహణ కష్టతరంగా మారుతుంది. ఆ సమస్యలను పరిష్కరించడం అంత సులభం కూడా కాదు. ఎత్తి పోతల పథకాల నిర్వహణలో కూడా ఇలాంటి సమస్యలనే ఎదు ర్కోవలసివస్తుంది. ట్రిబ్యునళ్లు ఇచ్చిన తీర్పులను అమలు చేయడానికి, నదీజలాల విడుదలకు నియంత్రణ మం డళ్లను ఏర్పాటు చేయడం తప్పనిసరి అవుతుంది. దీనితో ట్రిబ్యునళ్లు ఇచ్చిన మేరకే నియంత్రణ మండళ్లు ఆయా ప్రాంతాలకు నీటిని కేటాయిస్తాయి.

చదవండి :  'సీమకు అన్యాయం చేస్తున్నారు' - వైద్యులు

వరద మిగులు జలాల ఆధారంగా నిర్మించిన ప్రాజెక్టులకు కూడా నీటిని సరఫరా చేయడానికి నియంత్రణ మండళ్లకు విచక్షణాధికా రాలు ఉండవు. దానితో మంచి వర్షాకాలంలో కూడా నీటిని ప్రాజెక్టులకు వదలకుండా ఉండటం వల్ల సముద్రం పాలవుతాయి. దీనితో మిగులు జలాల ఆధారంగా నిర్మిం చిన ప్రాజెక్టులు కూడా అవసరం మేరకు నీటిని పొంద లేవు. అలాగే వర్షపాతం సక్రమంగా లేని కాలంలో ఇది మరింత క్లిష్టతరం అవుతుంది. రాష్ట్రాల మధ్య జలాల పం పిణీ కోసం భారతదేశంలో నియమించిన చాలా బోర్డులు ఆయా రాష్ట్రాల మధ్య జల వివాదాలను పరిష్కరించడం లో, ట్రిబ్యునల్ ఇచ్చిన ఆదేశాలను అమలుచేయడంలో పూర్తిగా విఫలమయ్యాయి. కాబట్టి విభజన తరువాత కొత్తగా ఏర్పాటు చేసే నియంత్రణ మండళ్లు ప్రస్తుతం ఉన్న నియంత్రణ మండళ్ల కంటే ప్రతిభావంతంగా పని చేయగలవని ఆశించలేము.

రాజధానికి తాగునీరూ కష్టమే

ఇప్పుడు హైదరాబాద్ నగరానికి నాగార్జునసాగర్ జలా శయం నుంచి కేటాయించిన దానికి మించి సరఫరా జరు గుతోంది. (3.9 టీఎంసీల నీటిని తాగునీటి అవసరాల కోసం ట్రిబ్యునల్ కేటాయించింది. సర్దుబాట్లు తరువాత ఈ కేటాయింపును 5.7 టీఎంసీలకు పెంచింది.) ప్రస్తుత వినియోగం 11 టీఎంసీలు. ముందు ముందు ఈ విని యోగం 16.5 టీఎంసీలకు పెరుగుతుంది. నియంత్రణ మండలి లేదా బోర్డు కృష్ణ నీటిని ఈ తరహాలో హైదరా బాద్‌కు తరలించడానికి భవిష్యత్తులో అనుమతించదు. గోదావరి విషయం కూడా ఇంతకంటే మెరుగ్గా ఉండదు. పరీవాహక ప్రాంతంలోని ఎగువ, దిగువ ప్రాజెక్టులకు సంబంధించి ఘర్షణలు తప్పవు.

– ఆర్.ప్రభాకర్‌రెడ్డి,
సీఈ (రిటైర్డ్), నీటిపారుదల శాఖ

ఇదీ చదవండి!

రాయలసీమ జీవన్మరణ సమస్య

ఇది రాయలసీమ జీవన్మరణ సమస్య

ఇది రాయలసీమ జీవన్మరణ సమస్య రెండు తెలుగు రాష్ట్రాలు కృష్ణా జలాల వినియోగంలో సమస్యలు రాకుండా ఉండడానికి కేంద్ర ప్రభుత్వం …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

CAPTCHA * Time limit is exhausted. Please reload CAPTCHA.

error: