బేస్తవారం నుంచి నీలకంఠరావుపేట ఉరుసు

రాయచోటి: రామాపురం మండలంలోని నీలకంఠరావుపేట దర్గాలో గురువారం నుంచి హజరత్ దర్బార్ అలీషావలి (రహంతుల్లా అలై), జలీల్ మస్తాన్‌వలీ ఉరుసు నిర్వహించనున్నట్లు సద్గురు దర్గా స్వామిజీ చెప్పారు.

5న గంధం, 6న జెండా మెరవణి, 7న ప్రసాద పంపిణీ కార్యక్రమాలు ఉంటాయని చెప్పారు. హిందూ-ముస్లిం సమైక్యతకు చిహ్నంగా, మతసామరస్యానికి ప్రతీకగా నీలకంఠరావుపేట దర్గా నిలిచింది. పక్కనే సాయిబాబా ఆలయం ఉండటంతో ఆధ్యాత్మిక కేంద్రంగా నిలిచింది.

బెంగళూరు, చెన్నై, నెల్లూరు, గద్వాల్ తదితర ప్రాంతాల నుంచి భక్తులుతరలిరానున్నారు.

చదవండి :  రేపటి నుంచి మల్లూరమ్మ జాతర

దర్గా స్వామిజీ 1957లో హంపి వద్ద నీటిపారుదల శాఖలో ఉద్యోగం చేస్తుండగా.. తన గురువు ఆదేశాల మేరకు ఇక్కడికి వచ్చారు. 1958 నుంచి ఇక్కడే దర్గాలో పూజలు చేస్తూ భక్తులకు ఉపన్యాసాలు, సందేశాలు ఇస్తున్నారు.

ఇదీ చదవండి!

ఉరుసు గోడపత్రం

కమలాపురం ఉరుసు ముగిసింది

కమలాపురం హజరత్ అబ్దుల్ గఫార్‌షాఖాద్రి ఉరుసు ఘనంగా ముగిసింది. ఈనెల 14న నషాన్‌తో ప్రారంభం కాగా గురువారం తహలీల్‌తో ముగిశాయి. …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

CAPTCHA * Time limit is exhausted. Please reload CAPTCHA.

error: